శ్రీరామకృష్ణులవారి వారు దాదాపు దివ్యస్మృతులుగానే వుంటూ అనేక సమస్యలకు అతి సాధారణ భాషలో అత్యద్భుతమయిన పరిష్కారాలు చూపేవారు అన్నది జగద్విఖ్యాతము.అలాగే వారికి సర్వము,సకలము దైవరూపాలు, వారు దైవవిగ్రహ సమక్షములో ఆరూపముతో వారు స్వయముగా సశరీరముగా వున్నట్లు భావించి ఆరాధన జరిపేవారు.
అలా అనేక సందర్భాలు కలవు వాటిల్లో ఒకటి.
దక్షిణేశ్వర్లో శ్రీరామకృష్ణులు సేవానియుక్తులు ఆయిన తరువాత ఆమందిర ప్రాంగణములొని రాధక్రిష్ణ మందిరములొని కృష్ణవిగ్రహాన్ని అర్చకుడు పవళింపు సేవకు తీసుకుని వేళుతుండగా పొరపాటున మందిర చలువ రాతి మెట్లపై జారిపడ్డాడు తత్ఫలితముగా చేతిలొని కృష్ణవిగ్రహము కాలు విరిగింది. దీనితో ఆ అర్చకుడిని దేవాలయ విధుల నుంచి తొలగించారు.
ఈ విషయాన్ని దేవాలయ యాజమన్యము రాణిరాసమణిదేవికి తెలియపరచబడినది. దీనితో అమె ఆందోళనకు గురి ఆయి సమావేశము ఎర్పాటు చేసినది.అందు పండితులు భగ్నవిగ్రహమునకు అర్చన చేయటము శాస్త్ర విరుద్ధము కాబట్టి ఆ విగ్రహాన్ని గంగార్పణ చేసి, సంప్రొక్షణ జరిపి కొత్త విగ్రహాన్ని ఎర్పాటు చేయాలని సలహా ఇచ్చారు.కాని రాణిగారికి ఎందుకో ఈ సలహా నచ్చలా, అదిగాకా తాను ఇప్పటివరకు అర్చన చేయుచున్న విగ్రహాన్ని గంగార్పణ చెయటానికి అమె మనస్సు అంగీకరించకున్నది.
ఈ విషయంతా గమనిస్తున్న అమె అల్లుడు మధుర్ సలహాపై అమె రామకృష్ణులను సంప్రదించగా ఆ సమయములో వారు దివ్యస్మృతులుగానే వున్నారు, ఈ భావములొనే వారు ఇలా పలికారు "పండితుల నిర్ణయము హస్యాస్పదము, ఒకవేళ రాణిగారి అల్లుడు కాలు విరిగిన పక్షములో అతణ్ణి విడచీ అతడి స్థానాన్ని మరోకరితో భర్తీ చేస్తుందా? చికిత్స చేస్తుందా? ఇక్కడా అదే విధానము అవలంబించటము సముచితము.విగ్రహాన్ని బాగుచేయించి యధాప్రకారము పూజలు జరపండీ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.