ఈచరాచర ప్రకృతి మొత్తము అమ్మరూపమే.అలాంటి అమ్మను మనవారు అనేక భిన్నరూపాల్లొ ఆరాధించారు తరించారు.ఇలా అమ్మకు గల అనేకానేక రూపాల్లొ కాళి ఒకటి.కాళికు గల అర్థాలు నలుపు,కాలము,మరణము,శివుడు ఇత్యాది అర్థాలు వున్నాయి. శాక్తేయులు ఈమేను తాంత్రికదేవతగా, బ్రహ్మఙ్ఞానాన్ని అందించే రూపముగా కొలుస్తారు. రామక్రిష్ణ పరమహంస దక్షిణేశ్వర్ లొ వున్న కాళిని భవతారిణిగా కొలుస్తారు. సృష్టి మొత్తము కాళీ అధినములొవున్నదని అని చెప్పుతారు. కారణము కాళీ, కాల రూపిణి కనుక అమే ఆధినములొనె సృష్టి వున్నదని నమ్మకము. కాళి వద్ద గల సకల జీవ బీజాలతొనే బ్రహ్మ స్రష్టి చేస్తారని పరమహంస అంటారు. ఇంతటి విశిష్ట కాళిని మొదట అధర్వణవేదములొ ప్రస్తావించారు.దేవిమహత్యము లొ ఈమే ఒకరూపంగా ప్రస్తావించారు.కాని అనేక తంత్రాల్లొ కాళికు 12 నుంచి 13 రూపాలు వున్నాయని కూడ తెలిపినారు.
అభినవగుప్తుడు సార్ధసటీకలో 12 కాళీరూపాలు ప్రస్తావించాడు.అవి 1) సృష్టిసంహార కాళీ 2)స్థితి కాళీ 3) సంహళ కాళీ 4) రక్త కాళీ 5) స్వకాళీ(సుకాళీ) 6)యామ కాళీ 7)మృత్యు కాళీ 8) రుద్ర కాళీ(భద్ర కాళీ) 9) పరమార్క కాళీ 10) మార్తాండ కాళీ 11) కాలాగ్ని రుద్ర కాళీ 12) మహ కాళీ (పర కాళీ, మహా కాలకాళీ, కాల కాళి) .ఇవి కాక తంత్రములో 13 రూపాన్ని తంత్రరాజ భట్టారకుడు ప్రస్తావించాడు ఆరూపము 13)మహా భైరవ గోచార కాళీ అని మనకు తెలిపినాడు.
ఈ త్రయోదశ రూపాల ఆరాధన పద్దతులు క్రమసద్భావ, సంకసటిక, చిదగంగాప్రకాశిక మరియు క్రమస్తొత్ర గ్రంధాల్లో వున్నాయి.
ఈ త్రయోదశ రూపాలు కాక ఇంకో చతుర్దశ రూపము గుహ్యాతి గుహ్యముగా నిరంతరసాధన సంపత్తి కలవారికి మాత్రమే తెలుసుకోగల రూపము " కాల సంకర్షిణి".
కాల సంకర్షిణి యొక్క సారాన్ని ఆచార పద్దతులను, సమవర్తన మండల మరియు కాళీకుళా అను శ్రీవిద్యలో కలిపారు. పరశురామ కల్పసూత్రములో కాల సంకర్షిణీ రశ్మి మూలంగా కలిగి వుంటుంది.చిదంబర తంత్రము,మహలక్ష్మి తంత్రము,పరమానంద తంత్రం మొదలైనవన్ని కాలసంకర్షణ కాళీ ని ప్రస్తావిస్తున్నాయి.
ఈ 14 రూపాలు. సృష్టిలో వున్న చతుర్దశ భువనాలకు సంకేతము. ఈ మొత్తము రూపాలు కలసి ఏకరూపనామం కాళీ అందుకే కాళీ జగన్నేత్రీ అని రామకృష్ణుల ఉవాచ.
ఇన్ని రూపాలను సాధకులు తప్ప మిగతావారు అచరించలేరు కానీ ఆ తల్లి గురించి తెలుసుకొవాలన్న ఉత్సుకత తెలుసుకొనెలా ప్రయత్నిస్తే అమే కరుణతో నాకు ఈ రూపాలు గురించి తెలిసింది. అది మీకు పంచుదామని ఈ చిన్న పొస్ట్.
జరుగుబాటు కష్టముగా వున్నవారు, జరుగుతున్న కాలములో కష్టాలు అనుభవిస్తున్నవారు కాళీని అరాధించండి. మీ నిత్య పూజలో అమ్మని ఆరాధించండీ. అష్టమీ, అమవాస్య దినాలలో మరచిపొకండీ. తామస ప్రకృతిగల రూపము కాబట్టి కాళీ పూజలో సారాయి,వైన్, లాంటీ వి సమర్పించాలీ. ఇది ఎమిటి ఇలా అనుకుంటారా నల్లద్రాక్షలను సమర్పించి నల్లద్రాక్ష రసాన్ని అమ్మవారి రూపముపై అలా కొద్దిగా ఒక పువ్వుతో అలా సమర్పించండి. అమ్మవారికి పుర్రెల దండ ఇష్టము కాబట్టి మీరు ముద్ద కర్పూరానికి మధ్య లొంచి దారము పొనించి మాలా లాగ గుచ్చి అమ్మవారికి పుర్రేలమాలగా భావించమని పలికి సమర్పించండి. అమ్మవారికి ఉత్సవము ఇష్టము కాబట్టి మీరు పూజ సమయములో గట్టిగా కరతాళనము మరచిపొవద్దు.మీరు కాళీ హృదయము, కాళీ కవచ పారాయణ చేయండీ. అసలు మీరు కాళీ హృదయం ఒక్కసారి పరిశిలించితేనే మీకు చాలా విషయాలు బొధపడతాయి.
కాళి రూపాలలొ మనప్రాంతములో విశిష్టరూపము 'భద్రకాళీ' ఇది వరంగల్ నందు వున్నది.చాలా మహిమ కలది.గత జనవరి నందు అమ్మను దర్శించి ఆలయ ప్రాంగణములో మౌనముగా షుమారు 1.30గం. లు ధ్యానము చెస్తే బ్రహ్మాండమయిన దివ్య దర్శనము. చిక్కటి నల్లటి వెలుగు అందులొ నుంచి మహ ఆద్భుత కాంతి చెప్పలేనంత దివ్య కాంతి. ఈ కాంతి మధ్య నుంచి ఎరుపు రంగు బిందు స్వరూపిణిగా అమ్మదర్శనము. నేను క్లుప్తముగానే చెపుతున్నాను.
ఇంకోటి విజయవాడ తెనాలి మార్గములో కల చిలువూరు వద్దకల కంఠమురాజుకొండూరు వద్దకల మహంకాళీ దేవాలయము. ఇది బాగ గ్రామీణ అచారాలను ప్రతిబింబిస్తుంటది.ఈ దేవాస్థానములో గల మూలరూపము స్వయంభూరూపము.ఇది ఆ ప్రాంతములొకల ఓక రైతుకు స్వఫ్న దర్శనము ఇచ్చి నేను ఫలానా ప్రదేశములో వున్నాను అని తెలుపగా, అంత పరీశీలించగా కాళీ స్వరూపము లభించుటతో దేవాలయ నిర్మాణము.ఇక్కడ ప్రతి ఆదివారము మహచక్కని జాతర వాతావరణము ప్రతిబింబిస్తుంటది.ఇక్కడ కొళ్ళు,మేకలు లాంటి బలులు,పోంగలి నైవెద్యము లాంటివి బహు బాగా ఆచరిస్తారు.
కాళీ హృదయము పరిశీలనగా చదివితే మనకు కొంత బొధ పడుతుంది. అందు చివరకు "సత్యం సత్యం పునఃసత్యం" అంటూ ఈ స్తొత్ర పారాయణ వల్ల వచ్చు అనుభవాలు, ఏ పరిస్థితులలొ వారు పారాయణ చేయాలో కూడా తెలిపినారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.