ప్రస్తుత తర యువజనులకు మహారాష్ట్ర అంటే షిరిడి, బొంబాయి తప్ప మరి ఏమి గుర్తుకు రానంతగా పరిస్థితి వున్నది. శాలివాహనుడు ఈ ఆంధ్రరాజ్యాన్ని పాలించాడని, అతని ముఖ్యపట్టణము ప్రతిష్టానపురమని దాని ప్రస్తుత నామము పైఠాన్,ఇది కూదా షిరిడి కి దగ్గర అని ఎంతమంది తెలుసు.ఇకపొతే మనకు వారికి అచారవ్యవహారాలలో చాలాదగ్గర తనము వుంది.మనలాగే వారిది చాంద్రమానమే.అలాగే మనము గొవింద భక్తులము, వారు విఠలుని భక్తులు.ఈ విఠలుడు పండరీపురములో వుండుటవలన,భక్త పుండరీకుని అనుగ్రహించటమువలన పాండురంగవిఠలునిగా ప్రచారము. విఠలుడు,రుక్మిణి సమేతుడై చంద్రభాగా నది ఒడ్డున వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.అనుగ్రహము అంటే మాములు అనుగ్రహము కాదు ఎందరికో సశరీరదర్శన భాగ్యము,మోక్ష భాగ్యమిచ్చి జన్మరాహిత్యము చేసిన లీలారూపుడు.ఈ విఠలుని ప్రస్తుస్తించుతు మరాఠిలో భక్తులు చేసిన కృతులపేరు అభంగాలు అని పేరు. ఈ అభంగాలు వారి జనజీవనములొ ఒక భాగమయ్యాయింటే అతిశయోక్తికాదు. ఈ అభంగాలన్ని ఎవరొ ఓకరు కృతి చేసినవి కావు అనేకమంది భక్తులు వివిధకాలాల్లొ బాల,స్త్రీ,పురుష,కుల మత ప్రసక్తి లేకుండా చేసినవి.ఈ భక్తులను అనుసరించి కాలగమనములో వర్కారి సాంప్రదాయము అని ఏర్పడింది.
దాదాపు మనకు పాండురంగ భక్తులంటే తుకారాం,సక్కుబాయిలు మాత్రమే తెలుసు కాని ఇంక ఎందరొ మహానుభావులు వున్నారు.వారు ఙ్ఞానేశ్వర్(ఙ్ఞానదేవ్),సంత్ నామదేవ్,జనాబాయి,సవతిమాలి,చోఖామేళా,నరహరి సొనార్,గోరా కుంభార్,రాకా కుంభార్,సంత్ జీ పవార్,జగమిత్ర నాగ,సేన నహ్వీ, కనహొ పాత్ర,భానుదాస్,జనార్ధన స్వామి,సంత్ ఏకనాధ్,మంకోజీ బోద్లే, సంత్ తుకారాం,సమర్ధ రామదాస్ స్వామి,లతిబ్ షా, షేక్ మహమ్మద్,సక్కుబాయి,నీలోబా మక్సారే వీరందరు గణుతికెక్కిన భక్తులు. ఇంకా ఆశ్చర్యకరమయిన విషయము బ్రిటిష్ కాలములో వీరి మహిమలు,వీరి జీవనము రికార్డులలోకలవు.వీరందరి కాలము 1250 నుంచి 1650 మధ్య వున్న 400 సంవత్సరాలలో వీరందరు ప్రభవించారు.
ఇక వర్కారి సాంప్రదాయమంటే. దాదాపు మన పండరీభజన మీకు తెలిస్తే అలాంటిదే కాకపొతే ఆప్రాంతములో చాలాబాగా చేస్తారు.ఆషాడ శుద్ధ ఏకాదశీ నాడు, కార్తీక శుద్ధ ఏకాదశీనాడు భక్తులతో పండరీ పురము కిటకిటలాడుతుంటుంది.రఖమాయి సహిత విఠలుని కొలిచేవారిని వర్కారిలు అని అంటారు. తులసి మాల, చందనములతో దిక్షగా నెలకొసారొ,ఏడాదికి ఓకసారో పండరీపురం తీర్ధయాత్ర చేస్తారు.ఈ యత్రను వర్కారి యాత్ర అని వాడుక.
ఇంతటి మహిమగల భక్తుల చరిత్రలు,మహిమలు,పద్ధతులను మన కళ్ళకు కట్టినట్లు వివరించారు రామకృష్ణ మఠము వారు వారి పుస్తకము "జయ పాండురంగ విఠలా!" నందు. ఈ పుస్తకము ఆంగ్లము నందు ది సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర గా కూడా కలదు.ఇంగ్లీష్ బుక్ భారతీయ విద్యా భవన్ వారిది గమనించండి.
ఈ పాండురంగని మీచే స్మరణ చేయటాని కారణము నా పితృదేవులు కీ.శే. శ్రీ ఆలపాటి పాండురంగారావు గారు.వారు ఈ ఉదయము స్మరణకు వచ్చారు వారి కృపవల్లనే ఈ నాలుగు ముక్కలు వ్రాయగలిగాను.
వారు నేర్పిన పద్ధతులు,చూపిన బాట నాకు సదా అచారణీయము. సదా వారీ ఆశ్వీరవాదాలు కొరుకుంటూ...
jaya jaya vithalaa
రిప్లయితొలగించండిధన్యవాదాలు!
తొలగించండి