ఓం నమః శివాయ
.
ఈ రోజు నర్మదానది పుష్కరాలు ప్రారంభము. దీని సందర్భముగా.
పుష్కరాంశ: పుష్కరాంశ అనునది రెండు పదాల కలయిక అనునది ఇట్టే అర్థమయ్యే విషయము.
పుష్కరం : పుష్కరం అనగా 12 సంవత్సరములు అని అందరికి తెలిసిన విషయమే. అనగా ఇది గురువుకి సంభందించిన విషయము. గురువు (బృహస్పతి) భ చక్రములొని ఒక్కొక్క రాశినందు ఓకసంవత్సరము వుంటాడని అలా 12సంవత్సరములలో భ చక్రము పూర్తిగా చుట్టిరాగలడని విదితమే.దీనినే పుష్కరమని అంటారు.అలా గురువు ఒకరాశి ప్రవేసించే మొదటి 12 రొజులను పుష్కరమని,అలానే ఆరాశి వదిలివెళ్ళే చివరి 12 రొజులను అంత్యపుష్కరముగా గుర్తించుచున్నాము.
అలాగే, ఇంకా ఒక్క సంగతిని గుర్తుంచుకొవాలి. పుష్కరుడు(పురుషుడు) నదీమాతను(స్త్రీ) చేరు సమయము (సంగమ).అలా ఆసమయమున గురుడు ఆనదీని ఆశ్రయించి వుంటాడని ఓనమ్మకము.అలాగే గురువు పుత్రకారకుడని మనము ఇక్కడ ఒక్కసారి మననము చేసుకొవాలి. అలా పుష్కరుడు నదిని అశ్రయించివున్నాడు.పురుషుడు, స్త్రీ సంగమముచే పుత్ర సంభవము జరిగితే బాగుంటదని శాస్త్ర అభిలాషణీయము. తద్వార పుణ్యగతులు కలుగుతాయని సూచితము.
ఇక పుష్కరమనే మాటకు పుష్కలముగా లభించుట అనికూడ కలదు.ఇలా అన్ని విషయాలు మేళవించి చూస్తే సంగమము అనేది పుత్రేచ్చతో కూడాలి అన్నది శాస్త్రము యొక్క ఆఙ్ఞ.
అనగా పుష్కరము యొక్క పూర్ణ ఫలము : పుష్కలముగా లభించు పుత్ర సంతానమే.
కామమును,లేక కోరికను మనము జ్యొతిష్యచక్రమునందు వున్న గ్రహాలలో శుక్రుడు చే సూచితము. ఇతనికి భృగుజ అని కూడ అంటారు.ఈ శుక్రునికి సంగమశక్తి,వీర్యమునకు ఆధిపత్యము గా మహర్షుల నిర్దేశ్యము.
మరి వివాహము ఎందుకు జరుపుతున్నామో మీకు అర్థమయి వుంటది. వివాహముద్వార తమ తరువాత తరమును సృష్టించి మన యొక్క ఆలొచనలను,శక్తులను,ఈ భూప్రపంచములో నిలిపి వుంచాలన్న అభిలాషతో సంతానమును వృద్ధి పరచుచున్నాము,తద్వార ప్రపంచము,ఙ్ఞానము వృద్ధి అగుచున్నది.
సంతానమే మొదటి ప్రాధాన్యముగా గల వివాహానికి పుష్కరలగ్నము సముచితము.
మొదట 12 లగ్నాలను అగ్నితత్వ,పృధ్వితత్వ,వాయుతత్వ,జలతత్వ అనే నాలుగు రకములుగా విభజించారు.వీటిలో పుష్కర భాగలుకూడ గుర్తించారు.
సంతానమే మొదటి ప్రాధాన్యముగా గల వివాహానికి పుష్కరలగ్నము సముచితము.
మొదట 12 లగ్నాలను అగ్నితత్వ,పృధ్వితత్వ,వాయుతత్వ,జలతత్వ అనే నాలుగు రకములుగా విభజించారు.వీటిలో పుష్కర భాగలుకూడ గుర్తించారు.
అగ్నితత్వ రాశులయిన మేష - సింహం - ధనస్సు రాశులందు 21 భాగమును పుష్కారాంశగాను
భూతత్వరాశులయిన వృషభ - కన్య - మకరం నందు 14 భాగలను పుష్కరాంశగా
వాయుతత్వపురాశులయిన మిధున - తుల - కుంభము ల 24 భాగలను పుష్కారంశగా
జలతత్వపు రాశులయిన కర్కాటక - వృశ్చిక - మీన రాశులందు 7 భాగములను పుష్కరాంశ గా విభజన.
ఇవియే పుష్కర భాగలు. ఈ పుష్కర భాగలందు ముహుర్తము నిర్ణయించిన అన్ని ఫలితములు పుష్కలముగా సమకూరును అని చెప్పుదురు.
( ఈ టాపిక్ మొత్తము శ్రీ నీలం పూర్ణమొహన్,గుంటూరు గారిది. వారు ఇచ్చిన వివరణను నేను వ్యాసరూపముగా తేలిపాను. ఈ టాపిక్ కామేంట్స్, మీకు కలిగిన అనుమానాలకు ఇక్కడ పూర్ణమొహన్ గారి మెయిల్ అడ్రస్ ఇస్తున్నాను దానికి పంపండి "pm_neelam@yahoo.co.in)
మంచి విషయాన్ని మాకు పంచారు
రిప్లయితొలగించండిబాగుంది..
@శ్రీ
ధన్యవాదాలు.
తొలగించండి