పాపానికి తండ్రి ఏవరు ? నిజమే చాలామందికి అర్థముకాని విషయము. ఈ కథ చదివితే మీకు అవగాహనకు వస్తుంది.
ఒక పండితుడు కాశినగరములో విద్యాభ్యాసము చేసి తిరిగి స్వగ్రామము వచ్చి గృహస్థజీవితము గడుపుతున్నాడు.
కొద్ది రోజులకు ఆపండితుడి భార్యకు పాపానికి తండ్రి ఏవరని ఓక సందేహము వచ్చింది.స్వంతముగా కొంత ప్రయత్నము చేసినా ఫలితము లేక భర్త వద్దకు వెళ్ళి "పాపాని కి తండ్రి ఏవరు ?" ఈ విషయమయి నాకు కొంత చింత కలుగుతుంది తీర్చగలరని మిమ్ము అడుగుతున్నాను. మన పండితులవారు చాలా విధాలా అలొచించారు,తనవద్ద వున్న తాళపత్ర గ్రంధాలన్ని కూడా పరిశీలించారు. ఆయినకు ఈ విషయము అంతు చిక్కలా.ఇక చేసెది ఎముంది గురువులని అడిగి తెలుసుకుంటాను అని మరలా కాశీ నగరాని ప్రయాణము అయ్యాడు.
పండితుడుగారికి దారిలో ఓక వేశ్య తటస్థపడి అయ్యా తమరి ప్రయాణ కారణము నేను తెలుసుకొవచ్చా అని అడిగింది
ఆ పండితుడు వృత్తాంతమంతా అమెకు వివరించాడు. ఇంత చిన్న విషయానికి మీరు అంత దూరము ప్రయాణము ఏందుకు ఇదే అయితే నేను మీకు ఇక్కడే వివరించగలను అని పలికినదా వేశ్య.కాకపొతే మీరు కొద్దిరొజులు ఆగవలసి వుంటుంది,దీనితో ఆ పండితుడు ప్రయాణము వాయిదా వేసుకొని ఇంటికి తిరుగు ముఖము పట్టాడు.
అమావాస్యకు ముందురొజున ఆమె పండితుడి వద్దకు వచ్చి 100రూపాయల ఇచ్చి భొజనమునకు ఆహ్వానించింది.మనవాడికి డబ్బువస్తుంది భోజనము దోరుకుతుంది అని అంగీకారము తెలిపినాడు.మధ్యాహ్న వేళకు మనవాడు వేశ్య ఇంటికి దయచేసాడు.అతిధి మర్యాదలు అయినతరువా అమె మరలా 100రూ పండితుడికి ఇచ్చినది.అందరు పక్వా ఆహారము సిద్ధము చేస్తారు, నేను మాత్రము పచ్చి ఆహారము మీకొరకు వుంచాను అని పలికినది.
ఇలా పలుకుతూ మరలా 100రూ లను పండితుడిగారి చెతిలో వుంచి నేను మీకు నా చేతితొ పెడతాను అన్నది. సరే అని పండితుడు నోరు తెరవగా, అమె లేచి పండితుడి లెంపకాయ పగలకొట్టినది.
ఒక్క సారిగా ఈ సంఘటనతో అతనికి ఎమి అర్థము కాక కారణము ఏమిటని ప్రశ్నించాడు.అంత అమె ఇప్పుటికి మీకు ఙ్ఞానము కలగలేదని ఇలాప్రవర్తించాను అని పలికి.
తన అనుచిత ప్రవర్తనకు ఇది కారణమని పలికినది : నా చేతి ఆహారముతో మీరు ధర్మభ్రష్టత్వమునకు గురికాకూడదని అలా ప్రవర్తించినాను.మీరు లొభముతో నేను ఇచ్చిన ప్రతిసారి డబ్బు తీసుకున్నారుగాని నిరాకరించలేదు. ఇందు వల్ల మీరు పతనమవుతున్నారని గ్రహించలేదు.లొభమే పాపానికి తండ్రి.
(తండ్రి అనగా బీజ పురుషుడు, అలాగే లొభమే పాపానికి బీజము.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.