1, జూన్ 2012, శుక్రవారం

"సీతమ్మ వారి వేవిళ్ళు" - దాదాపు ఇటు వంటి పొస్ట్ చదవి వుండరు.


స్త్రీ కి నిండుతనం ఇచ్చేది మాతృత్వము. అందుకే అమ్మతనము ఓక కమ్మని లక్షణము. అది నిండుగా కలిగిన మాతృదేవతలు, గర్భముధరించిన వద్దనుంచి శరీరములో కలిగే అనేక శారీరక ఇబ్బందులను అదిగమించి తమ ప్రాణములను పణముగా వుంచి మరి మనకు జన్మనిస్తున్నారు. ఈ ఇబ్బందులన్ని అనేక జానపద సాహిత్యాల్లో, సీమంతపు పాటల్లో,వేవిళ్ళ పాటల్లో ఇలా అనేక స్త్రీ రూప సాహిత్యాలు ఒక్కసారి పరీశీలించితే మనకు తెలుస్తుంది.అలాంటి సీతమ్మ వారి వేవిళ్ళు అనే పాటలోని విశేషాలు కొన్ని తెలుసుకుందాము.


  రాముని ఇంట సీత గర్భవతి అయినది. అంతటా ఆనంద సంబరాలు.కొద్దికొద్దిగా శారిరక మార్పులు.వేవిళ్ళు కూడా మొదలు. అసలే అమ్మ సున్నితము అందులోను ఈ వేవిళ్ళ బాధ ఓకటి. కాని అంతలోనే ఎమోతినాలనే వాంఛ. పుల్లనవి ఎవొ కొన్ని కోరికలు కోరినది.మరుక్షణములో సిద్ధము.కానీ రాముడు సీతను ఇంకా ఎమన్నకావాలా? ఎమన్న చేయాలాని అమె చుట్టు పచార్లు,పరామర్శలు.అడగాగా అడగగా సీత ఒక కొరిక అది మాములు కొరిక కాదు ఆయినా సిత సాధారణ స్త్రీ కాదు రాముని వంటి వీరుని పత్ని అందుకే అమె పులిపాలు కొరింది.అంతటితో ఊరుకోక నదిసముద్రములో దిబ్బమీద టేకుచెట్టు తేనె కొరింది.ఇవి అలాకించగానే రాముడు మందహాసము.కాని కౌసల్య చిర్రు బుర్రు.ఈమె అత్తకదా ఈమె కొడుకు ఇబ్బందిపడతాడని ఈమె భావము. దీనితో అమే ఇదేమి చోద్యమమ్మా! రామలక్ష్మణులని కన్ననాడు ఇలాటి వింత కొరికలు కొరలేదని.నీ బిడ్డలు నీకు అబ్బురమయితే నా బిడ్దలు నాకు అబ్బురము కాదా అని అంటుంది.


ఇది ఇలా కొనసాగుతూ సీత వేవిళ్ళతో  అన్న హితవులేక చిక్కీ శల్యమయిపొతుంది చింత,నారింజ లాంటీ పుల్లని పండ్లు, పరిచారికలు, దాసీలుతో కూడి రాణీవాసములొనే ఏండకన్ను ఎరగకవున్నా సుకుమారి సీత గర్భవతీ గా వుండి  శారీరక మార్పులు ఈవిధముగా ఇబ్బంది పెడుతున్నాయి.ఈ వార్తలు విన్న రాముడు రాణీవాసానికి వచ్చి సీతను చూసి ఆనాడు ఆడవిలో అన్ని కష్టాలు పడ్డప్పుడు కూడా ఇంతగా పసివాడలేదు ఈనాడు ఇలాగున్నావేమి అని చింతపడి లక్ష్మణుని మందిరానికి వెళ్లీ

"ఎండలోనే ఎండి వాననేతడసీ ! ఆనాడు ఈరీతీ వడలియుండలేదు !

పండుటాకు వలె పాలి వున్నాది ! పారుటాకు వలె పవ్వళించినది !

నా చేతి ముద్దుటుంగరం ! ముంజేత తోడగవచ్చు మీ వదినకు !"

అని ఈ విధముగా పలికి నివు వెళ్ళి ఒక్కసారి విచారించమని కోరతాడు.

వనవాస సమయములో రామునిసేవలో సీత, లక్ష్మణుడు పొటిపడేవారు. అందు వలన వదినగారు, మరదిగారి మధ్య అవినాభావమయిన తల్లి బిడ్డల మధ్య వున్నట్లు సన్నిహితత్వము.  రామునికి సీతపైగల అనురాగానికి అబ్బురపడి,  లక్ష్మణుడు రాణీవాసాని వెళ్ళీ విషయము తెలుసుకొని అన్నగారి వద్దకు వచ్చి విచారించ వలసిన పనిలేదని తెలుపుతూ

" మీ కంటె ఘనులు యికపుట్టనున్నారు ! మీరేలు రాజ్యమ్ము లేలనున్నారు!

మీరెక్కిన సింహాసనం యెక్కనున్నారు ! మీరు పట్టు ఆయుధములు పట్టనున్నారు !"

ఈ మాటలు విన కొంత ఆందొళన ఉపసిమించినవాడై, రాణీ వాసానికి సీతకు అసౌకర్యము కలగకూడదని మెల్లగా చప్పుడు చేయకుండా వేనక పాటుగా వచ్చి పానుప్ మిదకు వచ్చినారు. కాని ఈ విషయము సీత గమనించలేదు. దాసీలతో పాచికలకు ఆడుతున్నది కాని దాసీలు రాముండు వచ్చిన విషయము గమనించి లేచి నిలబడగా సీత దాసీలతో "ఆడిగెలవాలే కాని మధ్యలో లెవపనిలేదు" అని పలుకగా వారు చిరునవ్వులు చిందించి, వడివడిగా అక్కడనుండి నిష్క్రమిస్తారు.అంత చుట్టూ చూసిన సీత రాముని గాంచి సిగ్గుతో పాచికలను పడవైచి అతని దరిచేరుతుంది.
   అంత రాముడు ప్రేమగా సీతమ్మకు పులిపాలని, ఎరుపిడకలు వేసి దాయలుకట్టి వండిన పులిపాలను,పులిపాల జున్నును, టేకు తేనెను ప్రేమతో అమెకు ఇస్తాడు.
  ఈ విషయాలన్ని తెలుసుకున్న అత్తగారు  మేము గర్భముతో వున్నప్పుడు దోరచింతకాయలు,దొగ్గిలి కూర,పుల్లచల్ల,మామిడిపళ్ళు కొరాము కాని "ఈ సీత బూసట్లు మేముమెరగమమ్మా" అని  హాస్యాలు చేస్తుంది.

     
చూసారా సీత రాములు మన జీవనములో ఏ విధముగా పెనవెసుకుని వున్నారో .పాట పూర్తిగా లభించలేదు కాని జానపద సాహిత్యములోని దైవము పట్ల ప్రేమ,భార్య భర్తల అనురాగము,గర్భిణి స్త్రీ శారిరక మార్పులు, స్త్రీల కొరికలు,వదినా మరుదల మధ్య అనుభంధాలు,పుట్టబొయే వారి మీద ఆశలు, అత్తల ఆరళ్ళు అభిమానాలు ఇలా అన్ని కలిస్తేనే జాతి జీవనము.    


    

10 కామెంట్‌లు:

  1. పిల్లిజాతికి చెందిన పులి పాలా? యాక్.

    రిప్లయితొలగించండి
  2. మీలాగా కంప్యూటర్ తరాలు ఆనాడు రాలేదు కదా! వారికి తెలియవులే. జానపద గీతాలలో,స్త్రీలపాటలలో ఇవి అన్ని అభూతకల్పనలే తప్ప నిజజీవితములో కాదు. సాధరణముగా పులిపాలు తేవటమంటే వీరత్వానికి గుర్తు. తన మగడు వీరుడని తన బిడ్డలు వీరులుగా పుట్టాలని ప్రతి పడతి ఆనాడు కోరుకుంటుంది.కారాణము అనాదిలో వేట జీవనాధారము. ఇటువంటివి సమాజములో మూలమునకు వేళ్ళి చూడాలి తప్ప పిల్లి జాతి యాక్ అంటే మీకు విషయపరిఙ్ఞానము లభించదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కరమున ధనువు శరములు దాలిచి
      ఇరువది చేతుల దొరనే కూలిచి
      సురలను గాచిన వీరాధివీరుడు"
      అన్న విషయం జగజ్జనని సీతమ్మకు తెలియదనే అంటారా?
      కేవలం కేవలం ఓ అడవి జంతువు పాలు తేస్తేనే తనకు ధీరులు పుడతారని సీతమ్మ భావించింది అనడం వాల్మీకిని అవమానించడమే. శివ శివా! ఇలాంటి విషయపరి అజ్ఞానము పరికించుటకేనా నన్ను ఇంకా జీవింప చేశావు?

      తొలగించండి
    2. అంటే మీరు రాసినట్లు తెలుగులో వాల్మీకి వ్రాసారు. మరి ఇది కల్పన కాదా.జానపదులకు,స్త్రీ పాటల్లో కల్పన మామూలే అన్న సంగతి మరచిపొయి శివశివ అని వలవలా బాధపడవద్దు.రామాయాణాన్ని అనేక వేలమంది వందల భాషలలొ తాము దర్శించినట్లు వ్రాసారు.గానము చేసారు,కధలు,హరికధలు,బుర్రకధలు,అనేక సాంస్కృతీక రూపాల్లో తీసుకువచ్చారు.మీకు వాల్మికి రామాయణము అనుసరించిదలచుకుంటే నిరభ్యంతరముగా అనుసరించండి.అంతేకాని ఎదీ ఎలా వున్నదో తెలుసుకోవాలనే ఆసక్తీగల పాఠకులకు ఇబ్బందిగా మారవద్దు.

      ప్రసాదము దేవుడు తింటున్నాడా. గర్భవతిగా వున్నప్పుడు విడ్డూరమయిన కోరిక భార్య అడిగినా పురుషుడు తిర్చటానికి ముందుకు వస్తాడని సంకేతము.రాముడు,సీత పేరున ప్రజల ఆశలు,ఆకాంక్షలు పాటల్లో పద్యాల్లో వస్తాయి గమనించిండి. చాదస్తము,ఛాందసవాదము సాహిత్యాన్ని తులనాత్మకముగా విమర్శించేముందు ప్రక్కన పెట్టవలసిన విషయము.

      తొలగించండి
    3. ఈ పాట నా చిన్నప్పుడు విన్నాను . కాని అంతగా గుర్తులేదు.
      బాగా వివరించారు .

      తొలగించండి
  3. సీతాదేవి వేవిళ్ళు -----మా అమ్మమ్మ గారు పాడేవారు...
    ఊర్మిళాదేవి నిద్ర,లక్ష్మణ మూర్ఛ
    ఇవన్నీ చిన్నప్పుడు ఆవిడ నోటినుంచి వినేవాళ్ళం...
    మళ్ళీ మీ ద్వారా మీ బ్లాగ్ లో చూస్తున్నాను...
    బాగుందండీ!@శ్రీ

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.