5, జూన్ 2012, మంగళవారం

శ్రీశైలమల్లికార్జునుడు నాకు విధించిన శిక్ష


మీరు దైవదర్శనాలకు వెళ్ళినప్పుడు పలికేపలుకు,చూసేచూపు,చేసే చేష్టా అన్ని జాగ్రత్త. ఏందుకంటారా పరమేశ్వరుడు అన్ని గమనించుతూనే వుంటాడు.తప్పుజరిగిందా ఒక్కొసారి తత్ క్షణమే శిక్షకు గురికావలసి వుంటది.అలా నాకు పడ్డ శిక్ష,నేను పడ్డ ఇబ్బందే ఈ కథనము.

2002 సం. కార్తికపౌర్ణమికి మాకు శాశ్వతకల్యాణము సేవకు దేవస్థానమునుంచి ఆహ్వనము తో స్వామివారి సేవ కార్తికమాస దర్శనము అన్ని జరుగుతాయని,మాకుటుంబము మొత్తము కారులో శ్రీశైలమునకు బయలుదేరి వెళ్ళినాము.అక్కడ నాబస కంబం సత్రములో.వెళ్ళగానే ముందల అభిషేకము టిక్కెట్ తీసుకొని వచ్చాను.స్నానాదికాలు ముగించుకొని గుడికివెళ్ళి అభిషేకము ముగించుకోని సత్రముకు వచ్చి భొజనము తదనంతరము విశ్రాంతి తీసుకున్నాము.    

సాయంత్రము చంద్రొదయసమయానికి మరలా స్వామివారి దర్శనము,కార్తీకదీపారాధన కొరకు మరలా గుడికి బయలుదేరాము.కాని ఇంతలో శ్రీశైలదేవస్థాన గేటుదాటిన తరువాత శంకరస్థంబమువద్ద ఓక జంట "అయ్యా!దర్శనమునకు వచ్చాము.డబ్బుపొయింది" సహాయము చేయమని అర్థించారు.ఇది విన్న నేను సహయముచేసిన,చేయకున్నా పొయేది కాని "ఏమిటి ఇలా దేవాలయాల్లో కూడా యాచన చేయటము ఇబ్బందిగా వున్నది"అని వ్యాఖ్యానించాను.బాగా గమనించండి నేను "దేవాలయ ప్రాంగణములో,శివాధినమయిన ప్రాంతములో " నా ఈ వాఖ్య.  

నేను ఆలయములోకి దర్శనమునకు వెళ్ళివచ్చి ప్రక్కనవున్న అశొకవనములోని ఉసిరి చెట్టువద్ద కార్తికదీపారాధనకై వెళ్ళాము.దీపారాధనకు,పూజకు ఓక అయ్యవారిని కూడ మాట్లాడుకున్నాము.పూజకొసమని పట్టుపంచలు కట్టుకొని కూర్చుందామని,నా ఫ్యాంట్,షర్ట్ విడచి అలా నాప్రక్కనే వున్న బుట్టలో వుంచినాను. పూజ కార్యక్రమము తరువాత అయ్యవారికి సంభావనకొసమని ఫ్యాంట్ కొసము చూస్తే. ఇంకేక్కడి ఫ్యాంట్ ఎప్పుడో 'జంప్ జిలానీ' మొత్తము డబ్బు, కనీసము ఒక్క నిముషముకూడా మాట్లాడని 10వేల రూపాయల సెల్ ఫొన్, సత్రమువారి తాళము చెవులు.అన్నీ మాయము.ఏంతవెదికినా ఫలితములేదు.ఎలాగో అయ్యవారికి సంభావన ఇచ్చి.సత్రము వద్దకు వచ్చి సత్రము యాజమాన్యముతో విషయము చెప్పి, సత్రము సెక్రటరి గారు, మా మేనమామగారు దాయాదులు ఆసంగతి నాకు తెలుసు. ఈ విషయము వారికి తెలిపి  సత్రము యాజమాన్యము నుంచి ఎదురు డబ్బుతీసుకొనీ తిరుగు ప్రయాణమయినాము. 
            
గమనించండి దేవాలయ ప్రాంగణములో నా అనుచిత వ్యాఖ్యకు శిక్ష అన్నట్లు మరలా దేవాలయప్రాంగణము దాటకుండా నన్ను కూడా అదే పరిస్థితికి తీసుకువచ్చి దండించాడు.నాయనా! శివ బుద్ధి వచ్చిందని అది సుతా జాగ్రత్త వహిస్తున్నాను.

కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త. 

6 కామెంట్‌లు:

  1. > మల్లిఖార్జునుడు
    ఎలా ప్రచారంలోకి వచ్చిందో ఈ గుణింతం
    మల్లిక + అర్జున --> మల్లికార్జున

    మల్లిఖార్జున కాదండి మల్లికార్జున. దయచేసి మరింత శ్రధ్ధ వహించండి.
    మనం ఇంగ్లీషులో వ్రాసేటప్పుడు గ్రామరు, స్పెల్లింగులకు ఎంతో ప్రాధాన్యత యిచ్చి జాగ్రత్తాగా వ్రాస్తాము. అదే తెలుగులో వ్రాసేటప్పుడు ఘోరాతిఘోరమయిన తప్పులుకూడా గమనించము! అన్యధా భావించక తెలుగులో కూడా మరింత శ్రధ్ధగా వ్రాయమని మనవి అందరు బ్లాగర్లు మరియు వ్యాఖ్యాతలకు. మిమ్మల్ని నొప్పించటం నా ఉద్దేశం కాదని నా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గ్రామీణ ప్రాంతములో వాడుకలో ఆవిధముగా ఉచ్చరిస్తారు.చిన్నప్పటి నుంచి అలా మనస్సు లో పడి అలా వ్రాయటమయినది.ధన్యవాదాలు. సరిద్దినందుకు,చదివినందుకు.

      తొలగించండి
  2. thappu telusukunnavadiki prayaschittam avasaramuledu, maa mallaiah mimmu sada anugahinchugaka. SHUBAM............................

    రిప్లయితొలగించండి
  3. thappu telusukunnavadiki prayaschittam avasaramuledu, maa mallaiah mimmu sada anugahinchugaka. SHUBAM............................

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.