26, జూన్ 2012, మంగళవారం

ఉపచయాలు - భోజనాల్లో నంజుడు కార్యక్రమం - అప్పడాల మామ్మ గారి కమ్మని కధ - ఓ జీవన సత్యం!

 అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ను ఆశ్రయించుకోనీ ప్రాణము  అన్న రస రూపములో   జీవాత్మగా జీవుడులో వుంటుందని వేద మంత్రం,ఉపనిషత్తు వాక్యం.అసలు ఈనాడు భోజనం అంటే ఏదో అతికాము గతికాము అన్నట్లు గా చేస్తున్నారు కాని అది ఒక తపస్సులా ఇష్టపుర్వకముగా చేయటములేదు.పిల్లల కారేజల్లో ఏవిఎవో సర్ది పంపుచున్నారు.
అసలు తెలుగు వాడి భోజనములో వున్నన్ని అధరవులు మరి ఎవరి భోజనములో వున్నాయి. భక్ష్యాలు,భోజ్యాలు,చిత్రాన్నాలు,పొడులు,రసాలు,ఇలా మరి కొన్నిటి తో పాటు ఉపచయాలు.
ఉపచయమంటే భోజనం తో పాటు తీసుకునే ప్రక్క పదార్ధాలు. చయనము అనగా నమలటము. అనగా అప్పడాలు ఓడియాలు లాంటి వాటితో పాటు ఇంకొన్ని పరిచయము.

అప్పడం అంటే మన ప్రాంతములో మినప అప్పడాలు,కంది అప్పడాలు,పెసర అప్పడాలు ఇలా చేస్తారు. పంజాబీలు మినప అప్పడాలు కు కారం బదులు మిరియాల పొడి వాడతారు దానితో ఇవి కొద్దిగా చుర్రుమనే కారము.అప్పడం ను నూనెలో వేపే కన్నా నిప్పులపై కాల్చి దానికి ఇంత నేతి చుక్క తగిలించి తినాలి.
అప్పడం అంటే పూర్వకాలం లో పెళ్లికి ఓ మహాయజ్ఞము.పదిమంది ఆడంగులు కలసి చేసే ఓ ముచ్చట.

అప్పడం అంటే మా ఉరిలో ఓ మామ్మగారు గుర్తుకొచ్చారు. మామ్మగారు పూర్వసువాసిని. ఆమెకు ఓ కొడుకు.ఇతనికి పెళ్లి చేసింది కాని'ఎందువలనో కోడలికి ఈమెకి సరిపడలేదు.ఇంటి ప్రక్కనే తనదైన గదిలో కూర్చొని ఉదయము నుంచి సాయoత్రం దాక అలా అప్పడాలు చేస్తుంటుంది.ఒక్కటి 10 పైసలు అనుకుంటా.అలా అది ఓ వ్యాపకము మాత్రమే.పై అవసరాలకు ఆమె కున్నపొలము ద్వార వచ్చే పంట ఆదాయం దైవకార్యాలకు,మిగతా గృహ అవసరాలకు ఉపయోగించేది.ఇది కాదు విశేషము  వచ్చే పోయే ప్రతి ఒక్కరు ఆమె బంధువులే ఓరే నారాయణ మీ అమ్మాయిని పురిటికి తెస్తున్నవా!సుబ్బులు మీ అల్లుడు మీ అమ్మాయిని సరిగా ఎలుకుంటున్నాడ!రాముడు చేలో కలుపు తీసి నారు మడి సిద్ధము చేశావా! లక్ష్మినారాయణ ఇల్లు గడుస్తున్నదా!పంతులుగారు అమావాస్య ఎప్పుడు ఏకాదశి ఎప్పుడు ఇలా అన్ని రకాల ప్రశ్నలతో చిన్న పెద్దా అందరిని పలకరించేది.సత్రములో ఏదైనా దైవ కార్యమయితే ఈమె ముందలగా అన్ని తెప్పించి ముత్తయుదవుల గురించి ఎదురు చూసేది! త్వరగా రండమ్మ నేను వస్తువులు సిద్ధము చేయగలను కాని ఆపనులకు నేను పనికి రానుకదమ్మ అనేది. మీరు త్వరగా వస్తే త్వరగా మీ ఇంట్లో పిల్లలకు,భర్తలకు సమయానికి వెళ్ళగలరు అనేది. అప్పుడప్పుడు ఎవరన్న ఆలస్యముగా వస్తే ఏమిటి మా అబ్బాయిని కొంగున కట్టావా,మాతమ్ముడినీ అడిస్తున్నావా,పిల్లలకు పాలు ఇస్తున్నావా అని మేలమాడేది.కొంత మంది సిగ్గుతో పో అత్తా అని అంటే,మరి కొంతమంది ప్రక్కకు చేరి ఈ ముసలిది చావదు అని అనే వాళ్ళు.ఈ విషయము గమనించిన నేను ఆమెను ఎందుకు మామ్మ నీవు ఇలా విళనీ నీవు పలకరిస్తావు అని అడిగితె.
ఓరే నాన్న! నేను అందరిని పలకిరిస్తానా పూట గడవని నారాయణ కూతురుని పురిటి కి తేవటము కష్టము రా!హంగు ఆర్భాటం వున్న సుబ్బులు కూతురు ను అల్లుడు ఏలుకోలేదని అందరికి చెప్పలేదు అలాగని గుండెల్లో దాచుకోలేదు!విత్తనాలకు అప్పు తెచ్చే రాముడు కలుపుకు తీసాడాలేదా అప్పు పుట్టిందాలేదా అని విచారణ!సంపాదన తక్కువ బాధ్యతలు ఎక్కువ వున్న లక్ష్మినారాయణ మొహమాటస్తుడు,అభిమానస్తుడు ఇల్లు సరిగా గడవటము లేదని చెప్పుకోలేడు!చెంబు పట్టుకొని ఊరిలోకి వచ్చే పంతులుగారు కి మంచి చెడు అడిగి ఓ గుప్పెడు బియ్యం ఇస్తే పూట గడుస్తుందిరా. అయిన  ఉచితముగా తీసుకోలేదని నేను ఆయినకు ధర్మం చేయలేదని భావన.కష్టం లో వున్న వాడికి ఆసరా దుఃఖం లో వున్నవాడికి ఓదార్పు అవసరము రా.ఈ పలకరింపు వల్ల వాళ్ళ గుండేల్లొ భారం కొద్దిగ తగ్గిస్తాను,కంట్లొ వున్న నీటి చుక్కను తుడుస్తాను.అంతకు మించి వేరు ఎమి చాతకాని పాతకాలపు ముసలి దాన్ని రా!నేను చేయలేక పోయినా చేసేవారు దగ్గరికి పంపటానికి తప్ప వేరు కాదు.
ఇక సత్రం లో  ఆడవారిని విచారణ అంటావ అది ఆడవారికి మాత్రమే అర్ధమయ్యేది, వాళ్ళ కాపురం సరిగా సాగుతుందా లేదా అని అరా!నేను వాళ్ళను తొందరగా వచ్చి తొందరగా ముగించు కొని వెళ్ళమనేది వాళ్ళ పిల్లాపాప లతో ముద్దుముచ్చట్లతో సరదాగా వుంటే నాకు కన్నుల పంట కడుపు నిండు రా!
ఇక వాళ్ళందరూ నన్ను అంటున్నారంటవా, పోనిలే ముసలి దానిని కాటికి కాళ్ళు జాపుకొని వున్నా,ఉరు పొమ్మoటుంది కాడు రమ్మoటుంది. వయస్సు రీత్యా వాళ్ళు నా పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళు నన్ను అన్నా భరించాలి, నేను అంటే శాపం గా మారి వాళ్ళు కష్ట పడితే నాకు బాధ. వాళ్ళు చల్లగా వుండి ఈ ముసలి దాని దగ్గర నాలుగు అప్పడాలు కొంటే నాకు జీవితము సాగుతుంది దేవుడు నాకు ఈ పని ఒక్కటే నేర్పాడు.పైవాడు పిలేచెంత వరకు ఏదో కాలక్షేపం.
 మామ్మ గారిది వేదాంతం,జీవనసత్యం,చాదస్తము,వ్యాపారరహస్యము,సాoఘిక జీవన మర్మము అన్ని కలిపిన ఓ నిజం!మామ్మగారు చదువు కోలేదు చదువింది జీవితంను.


చూసారా ఇదే ఉపచయం పొస్ట్ ను వదిలి ప్రక్కదారి పట్టాము.
ఇంకొన్ని నంజుడు కార్య క్రమాలు.వేడివేడి అన్నం లోకి అప్పడాల పిండి ముద్ద నేతితో కలిపి తినాలి.
పప్పులొకి చల్లమిరపకాయలు,వాము మిరప కాయలు.వేడి వేడి పప్పు ఆవకాయ అన్నం లోకి మీగడకాని,వెన్నకరగ పెట్టిన అడుగున తేలిన గొదారికాని భలె వుంటాయి.పప్పులొకి వాము మిరపకాయ తినమనేది. పప్పు కొద్దిగ అరుగదల తక్కువ వాళ్ళకు వాము మిరపకాయతో ఆ ఇబ్బంది పొతుంది అని.అలానే చింతకాయ పచ్చడి లోకి,గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయ.చింతకాయ పులుపు వలన, గొంగూర దానిలొ వున్న ధాతువుల వల్లన వేడి జనిస్తుంది చలవ కి ఉల్లిపాయ.
ఇక వడియాలది ఓ ప్రత్యేక చరిత్ర. చాలా రకాలు వున్నాయి.సగ్గుబియ్యం,పిండి వడియాలు, బూడిదగుమ్మడి వడియాలు,మినప పొట్టు వడియాలు,చక్రాల వడియాలు ఇల అనేక రకాల వి మనకు మాత్రమే వున్న ప్రత్యేక ఆహర పదార్ధం.
ఇవి కాకుండా గుంటూరు లోనె దొరికెవి గరుగ్గాయలని  నిమ్మరసములొ నాన బెట్టి తినాలి చాలా బావుంటాయి.మామిడి అల్లం కొమ్ములను చక్కగ చెక్కి సన్నని ముక్కలుగా తరిగి పచ్చి మిర్చితో కలిపి నిమ్మరసములొ నాన పెట్టి తిన్న బావుంటుంది.ఇంకో రకము  శ్రావణ మాసములొ  రావటము  మొదలు అవి మారేడు కాయలు పిందలను బాగా కడిగి ఒకటి పదిసార్లు కడిగి నిమ్మరసములొ నానపెట్టి తింటే ఎటువంటి క్రిమి కీటకాలు  పొట్టలొ వున్న మొత్తము క్లియర్.ఈ మధ్య కాలములొ కేరట్ ముక్కలను కూడా నిమ్మ రసములొ నానపెట్టి స్వీకరిస్తున్నారు.
ఇవి కాకుండ భొజనములొకి బజ్జీలు, కారబ్బుంది,మిక్చరు,చక్రాలు,చెక్కలు లాంటివి కుడా తినే వాళ్ళు వున్నారు.
ఇన్ని చెప్పిన తరువాత పెరుగులోకి అని మీరు అడిగితే ఆవకాయ ముక్క,అరటి పండు,మామిడికాయ ఇలా ఎన్నొ ఉపచయాలు.

మరి మీ తాలుకు ప్రత్యేకమైన రుచులు తదితరాలు ఉంటే తెలపండి.              




9 కామెంట్‌లు:

  1. ఇదన్యాయమండి,నేను ఇంకెప్పుడూ మీ బ్లాగులోకి రాను.నోరూరించి పడేసారు.ఇవేమో మాకు దొరికిచావ్వు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు. విశాఖ లో దొరక లేదు అంటే నాకు ఆశ్చర్యం కారణం నా భార్యది విశాఖ.ఇవి అన్ని
      ఇంట్లో సిద్ధం చేసేవి.
      అన్నట్లు మీకో చిన్న ప్రశ్న! మీరు ఇంతకు ముందు మీ పోస్టులో పొన్నూరు,గుంటూరు ల గురించి తెలిపారు. మీరు ఈ ప్రాంతం వారా? నేను పొన్నూరు లో చదువుకున్నాను. మాది అదే ప్రాంతం.

      తొలగించండి
    2. ఔనండి,ప్రపంచం మొత్తం మీద అత్యంత పవిత్రమైన స్థలం పొన్నూరు మాది ఆవూరేనండి,
      నిడుబ్రోలు.
      దొరకట్లేదు అంటే దొరకటం లేదనేనండి,
      మా ఆవిడదీ వైజాగే

      తొలగించండి
    3. మాది చెరుకుపల్లి. నేను కేబియన్ కాలేజి విద్యార్ధిని. నిడుబ్రోలు లో రంగాగారి ఇంటి పై రూంలో చాలా రోజులు వున్నాను.వచ్చే ఆదివారం విశాఖ వస్తున్నా మీకు వీలయితే మనం కలవగలము. నా నంబర్ 9440172262. plese send your no by sms.

      తొలగించండి
    4. పిబిఎన్ కాలేజీ విద్యార్థి అన్నమాట మీరు,నేను గుంటూరులో చదువుకున్నానండి.
      రంగా గారి ఇంటికి కాస్త దగ్గరలోనే మా యిల్లు,ఫిజిక్స్ సత్తార్ గారు తెలుసా ఆ బజార్లో
      తప్పకుండా యస్సెమెస్ చేస్తాను.ఆదివారం సాయంత్రం కలుద్దాము

      తొలగించండి
  2. అప్పడాల మామ్మగారి కథ బాగుంది మాస్టారూ...

    రిప్లయితొలగించండి
  3. మామ్మగారి జీవిత సత్యం చాలా బాగుందండి .
    మీరు చెప్పిన ఉపచయాలు అన్నీ కూడా టేస్టీ గా వున్నాయి :)

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.