అది మే నెల 2000సం. మేము,మాచిన్న బావమరది వాళ్ళు కలసి తమిళనాడులోని దేవాలయాలు దర్శించాలని అనుకున్నాము.కాని ప్రయాణము ముందు రోజు అవాంతరం వలన వారు మేము విడివిడిగా ప్రయాణం చేశాం.
అలా మేము ఉటీలో విహరించి,పళని దర్శించి మదురై కు చేరుసరికి సాయంత్రం 5గం.లు అయినది.వెంఠనే లాడ్జ్ లో ఫ్రేష్ అయి మీనాక్షి అమ్మ దర్శనమునకు వేళ్ళుసరికి రాత్రి 8గం.లు కావలసి వస్తుంది.ఆసమయానికి సేవల కౌంటర్లో వున్న వ్యక్తి సార్ మీరు వస్తున్నారు అని ఎవరో చెప్పారు ఇదిగోండి అని ఆరోజుకు ఆఖరి టిక్కెట్స్ 2 మాచేతిలో వుంచి కౌంటర్ బంద్ చేసి వెళ్ళిపొయినాడు. ఇది మాకు ఆశ్చర్యం కలిగించింది.కాని ఇది అమ్మ దయగా భావించి అమ్మ దర్శనానికి వెళ్ళాము.అక్కడ గర్భగుడిలో తృప్తిగా అమ్మవారి ఎదుట కూర్చోని షుమారు 30 నిముషములు ఉండి అమ్మవారిని సేవించుకున్నాము.
లాడ్జ్ కు రాగానే మావాళ్ళు ప్రోగ్రాం ప్రకారం రామేశ్వరంలో వుంటారు. అది గమనించిన నేను ఓపిక లేకున్నా రామేశ్వరప్రయాణం అదే రోజున చేయాలని. బస్సుద్వార రామేశ్వరం చేరు సరికి తెల్లవారు జామున 3.30నిముషములయినది. రామేశ్వరములో లాడ్జ్ తీసుకోని గుడివద్దకు స్నానం,దర్శనం కోసమని చేరుసరికి షుమారు ఉ.గం.5లు అయినది.అక్కడ 22 బావులలో స్నానం ఒక విచిత్ర అనుభూతి.అలా అవి మొత్తము ముగించుకోని పోడి వస్త్రాలు ధరించి స్వామి వారి దర్శనానికి మేము వచ్చు సరికి షుమారు ఉ.గం.6 అయినది.
అదే సమయములో స్వామివారికి స్ఫటికలింగానికి అభిషేకం జరుగటానికి ప్రారంభం అవబోతున్నది.స్వామివారు సైకతలింగము అవటము వలన మూల లింగమునకు అభిషేకము ఉండదు.కాని అభిషేక ప్రియుడయిన శివునికి శంకరాచార్య ప్రోక్త స్పటికలింగానికి ప్రతిరోజు ప్రారంభ అభిషేకం చేస్తారు.అది కూడా రోజుకు ఓక్కసారి మాత్రమే. తరువాత మిగతా అభిషేక సేవలన్ని ఉత్సవమూర్తికి మాత్రమే జరుపుతారు.ప్రారంభ అభిషేకం దేవస్థానం వారిది సర్వమానవకోటి శాంతి కోరకు స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆతరువాత ఆర్జీత సేవలను అనుమతి ఇస్తారు.అప్పటి వరకు స్వామివారిది దివ్యదర్శనమే.ఈ సమాచారం మొత్తము నాకు ఆసమయములో తెలియదు.యధాలాపముగా నేను లైనులో ప్రవేశము. నేను స్వామి వారి ముందుకు వచ్చు సరికి స్ఫటికలింగానికి అభిషేక సేవ ప్రారంభిస్తున్నారు.ఇవి ఎమి తెలియని నేను స్వామిని దర్శించుకోని నమస్కరించి బయలదేరబోగా అక్కడవున్న అర్చకులు నన్ను స్వామి మీరు ఉండండి అని అదేశించారు.నాకు కోద్దిగా అర్ధం కాలేదు,అయినా అర్చక స్వాముల అదేశముపై ఉండి స్వామి బయట మావాళ్ళు ఉంటారు వాళ్ళను కలవాలని చెప్పాను.వారు బయట ఉన్న కార్యాలు ప్రతి దినము ఉండేవి, మీకు ప్రాప్తం ఉంది స్వామివారి అభిషేక సమయానికి లైనులో ముందుకు వున్నారు.మీరు పూర్వపుణ్య ఫలం వలన స్వామివారు ఈనాటి అభిషేక దర్శన భాగ్యం మీకు కల్పించినారు.మీరు బయటకు వేళ్ళాలి అంటున్నారు! మీరు మరలా ఈ దేవస్థానానికి రాగలరా?అసలు వచ్చినా ఇలా అభిషేక సమయానికి లైనులో ముందల ఉండటం సాధ్య పడుతుందా ఆలొచించుకోండి.ఈ ప్రశ్నలకు నా వద్ద సమాధానము లేదు.మౌనముగా వారికి క్షమాపణ చేప్పి ,స్వామివారి అభిషేక కార్యక్రమము పూర్తిగా తిలకించి అభిషేక తీర్ధము, శఠారి మొదలగునవి తీసుకోని. మరల అర్చకస్వాములకు ధన్యవాదాలు.స్వామివారి లీలకు ఆశ్చర్యపడి స్వామివారికి నమస్కారాలు సమర్పించి బయటకు వచ్చాము. ఎదో మేము 5నిముషాలు లేద 10 నిముషాలు దర్శనము అనుకుంటే షుమారుగా మాకు 45నిముషాలు అది ప్రారంభ అభిషేకము పూర్తిగా స్వామివారు కటాక్షించారు.అది భక్త జన సందోహములో.
అర్చక స్వాములు అన్నట్లుగా మరలా ఈ 12సంవత్సరములలొ మదురై 3 సార్లు దర్శించుకున్నా కాని రామేశ్వరము దర్శన భాగ్యం కలగలేదు.మరలా ఆస్వామి వారి కటాక్ష భాగ్యం ఎప్పుడో.

http://rajachandraphotos.blogspot.in/2011_07_01_archive.html
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ చూసాను ఫొటొలు అవి చాలా బాగున్నాయి. మేము కూడా అవి అన్ని చూసాం. నా బ్లాగ్ చదివినందుకు ధన్యవాదాలు.
తొలగించండి.... మీకు ప్రాప్తం ఉంది స్వామివారి అభిషేక సమయానికి లైనులో ముందుకు వున్నారు.మీరు పూర్వపుణ్య ఫలం వలన స్వామివారు ఈనాటి అభిషేక దర్శన భాగ్యం మీకు కల్పించినారు.......ఇలా మీకు దర్శనభాగ్యం కలగటం మీ అదృష్టం.
రిప్లయితొలగించండిధన్యవాదాలు. ఆక్షణము ఇవి అన్ని అలోచించే వ్యవధి లేదండి కాని తరువాత అలోచిస్తే స్వామివారి కృపకటాక్షణాలపై ఇలా అవగాహనకు వచ్చింది.
తొలగించండిమేము రామేశ్వరం వెళ్ళినపుడు ముందురోజు సాయత్రం బావుల్లొ స్నానం చేసి దేవుని దర్శనం చేసుకున్నాము.టి.టి.డి. వాళ్ళ నైట్ స్టే అక్కడేను. మాతో వున్న ఓ తెలుగు జంట ఆభిషేక దర్శనం గురించి చెప్పారు. మేము ఉదయమే స్నానాలు చేసి వెళ్ళేసరికే చాలామంది "క్యూ" లో వున్నారు.మేము వెళ్ళి నిలబడ్డాము. ఆరోజు మా ముందు వైపు గేటు తీసి లోపలకు వెళ్ళమన్నారు.దానితొ మేము ముందు వెళ్ళిన దంపతులం అయ్యాము. .మా ముందు నిలబడ్డ వారంతా వెనుక య్యారు.అంతా ఆ పరమేశ్వరుని లీల.ఆ అభిషేక దర్శన భాగ్యం కలగడం మా అదృష్టం.
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మరీ స్వామి కృప కాకపొతె మనము చూడగలమా. అంతమందిలో ఆక్షణము మనకు లభించింనది అంటే ప్రాప్తం.
తొలగించండి