మానవ వికాసాన్ని అలా పరిశీలనతో చూస్తే నేటి సహజత్వాలకి,అసహజత్వాలకు ఆనాడే ఎలా పాదుకొల్ప బడినదో మీకు అర్ధము అవుతుంది.నేడు చాల దేశాల్లో అమలులొ వున్న ఏకపత్ని వ్యవస్థకు ఆనాడు ఎలాగు ఎందుకు రూపకల్పన చేయబడినదో కొంత తేలికగా అర్ధమయ్యే ప్రయత్నము చేస్తాను.
ఆనాటి వ్యవస్థలో మాతృస్వామ్య వ్యవస్థ గా వున్నది. ఈ సమయములో స్త్రీ తనకు నచ్చినoత మంది పురుషులు లతో తాను జీవించేది.ఈ వ్యవస్థను నేటి శాస్త్ర ప్రకారము polyandry గా పిలుస్తారు. ఈ బహు భర్త వ్యవస్థ వలన పుట్టిన సంతానములో ఒక్కొక్కరు ఒక్కో విధముగా వుండే వాళ్ళు. ఇది మొదట్లో సాధారణముగా వున్నా శతాబ్దల తరువాత అనగా స్త్రీ భాగస్వామ్యము నుంచి వ్యక్తి గత ఆస్థి గాను, భోగ,చిహ్నంగా మారటానికి మధ్య అనేక మార్పులకు లోనయింది.
మొదటిగా వున్న వ్యవస్థలోని పురుషులు ఆనాటి స్త్రీ పొందు కోసము తపించే వాళ్ళు దీనికిగాను వాళ్ళల్లో వాళ్ళు అనేక పోరాటాలకు దిగేవాళ్ళు.ఈ విధంగా పురుషుల్లో సఖ్యత లేక పోవటము ఒక కారణము అయితే సంతానములో కూడా సఖ్యత కుదిరేది కాదు.వివిధ పురుషుల వల్ల ప్రభవించిన సంతానము, తల్లి ఒక్కరయినా తండ్రులు వేరు కావటము వలన వివిధ రంగు రూపంలో ఉండటముతో వారిలో వారికి ఆనేక అభిప్రాయ బేధాలు వచ్చేవి.తద్వార గణాల్లో అశాంతి,పోరాటాలు నిత్యకృత్యమయ్యాయి.ఇలా చాల రోజులు సాగిన తరువాత శ్వేతకేతు అనే వాడు దీనికి కారణము బహుభర్త వ్యవస్థ అని, దీనిని రద్దు పరచి ఏకపత్ని వ్యవస్థను ప్రారంభించాడు.
ఈ విషయము మనకు రాహుల్ సాంకృత్యాయన్ తన గ్రంధం ఓల్గా సే గంగ లో తెలుపుతాడు.
అసలు ఈ శ్వేతకేతు ఎవరా అని అరా తిస్తె ఇంకొన్ని విషయాలు బయటపడ్డాయి.అరుణఋషి కుమారుడు గౌతముడు గాను ఇతని పుత్రుడు శ్వేతకేతు గాను ,శ్వేతకేతు అరుణి కుమారుడు గాను మరో కధలొ వివరించ బడినది.ఇది రామక్రిష్ణ మఠం వారి ఉపనిషత్కధలు అన్న దానిలో ఇది వున్నది.
శ్వేత కేతు తండ్రిలానే అచారవంతుడు. ఒక నాడు తమ ఆశ్రమమునకు అతిధిగా వచ్చిన మరో ఋషికి అతిధి సత్కారలతో పాటు గృహస్తు భార్యను కూడా అతిధికి సమర్పించే సాంప్రదాయమును అనుసరించి అతిధి శ్వేతకేతు తల్లితో భొగమును అనుభవిస్తుంటాడు. ఇది గమనించిన శ్వేతకేతు అవమానముతో వుడికిపొయి ఏకపత్ని వ్యవస్థను ప్రారంభించాడు.
ఈ బహు భర్త వ్యవస్థ పై చార్వాకులు తమదైన అలోచన చేశారు. వీళ్ళు దేవుడిని నిరసించినా శాస్త్రీయ ఆలోచన లకు ఓ ఉదాహరణ గా తీసుకోనే ప్రయత్నం చేశారు. వీళ్ళు పార్వతినీ మాతృస్వామ్య వ్యవస్థలో ఓక స్త్రీగా ఎంచి ఆమె ఆనాటి బహు భర్త వ్యవస్థలో భాగం గా వినాయకుడు,కుమారస్వామినీ కన్నదని వీళ్ళలో అభిప్రాయ బేధాల్లో భాగము గా శివుడు వినాయకుడు నీ చంపాడు అని వాళ్ళ ఆలోచన.
ఇన్ని గందరగోళానికి కారణమయిన శ్వేతకేతు అనే పదము లోనే పూర్తి రహస్యము దాగివున్నది.
శ్వేతము అనగా తెలుపు అని, కేతువు సర్ప రూపములొ వుంటాడు.మరి పురుషుడి వీర్యములోని శుక్ర కణాలు తెల్లగ పాముల కదులుతు స్త్రీ గర్భములోని బీజములను చేరి శొణితమయి పిండముగా మారి తదుపరి శిశుజననమునకు కారణమవుతుంది శుక్రకణాలు కాబట్టి ఇవి బీజాలు.స్త్రీ క్షేత్రము మాత్రమే అని పరిశీలించిన వాళ్ళు .క్షేత్రములొ రకరకాల బిజాల వల్ల వివిధ రకాల వర్ణసంకర జాతులు ఏర్పడుతున్నాయనే కారణముతో పాటు మెల్లగ సమాజము పితృస్వామ్య వ్యవస్థకు అడుగుపెట్టే దిశలో ఏక పత్ని వ్యవస్థ మాత్రమే ఇటువంటి సమస్యలకు సమాధానమని ఎంచి అది ప్రవేశ పెట్టారు.
ఇక బహు పత్ని వ్యవస్థ అంటారా జాతుల దాడులు, పొరాటాలు వెరశి బానిసత్వాలు తదుపరి భొగత్వాలు ఇన్ని కలిస్థే సమాధానము వస్తుంది.
ఇంగ్లిష్ లొ ఏకపత్ని వ్యవస్థను మోనోగమిగాను, బహుపత్ని వ్యవస్థను పాలిగమి గాను వ్యవహరిస్తారు.
వివాహం జరిగిన తరువాత స్త్రీ " అర్ధాంగి " అవుతుంది. అంటే భర్తలో అర్ధ భాగం అని. భార్యాభర్తలు శరీరాలు వేరైనా వారిద్దరూ ఒకటే అని పెద్దలు వివరించటం జరిగింది. భార్యాభర్తలు ఒకరికొకరు అర్ధభాగం అయినప్పుడు ఇక మూడో వ్యక్తి వారి జీవితంలో ప్రవేశించటం అనేది అసంభవం కదా ! భార్యాభర్తలు ( జంట. ) అంటే ఇద్దరు అనే అర్ధం. వివాహమంత్రాలు ఇంకా " నాతిచరామి ........ " ఇవన్నీ గమనిస్తే పెద్దల అభిప్రాయం అర్ధమవుతుంది.
రిప్లయితొలగించండిఇక పురాణేతిహాసాల్లో స్త్రీపురుషులు ఎన్నో వివాహాలు చేసుకోవటం అంటే .... అలా జరగటానికి వెనుక ఎన్నో కారణాలు , పరిస్థితులు ఉన్నాయి. ( మనం అవి గమనించి జాగ్రత్తగా ఉండాలన్నది పెద్దల అభిప్రాయం కావచ్చు. ) పురాణేతిహాసాలలో మనకు అర్ధం కాని అంతరార్ధాలు ఎన్నో ఉంటాయి. మనం పైపైన కనిపించే అర్ధాన్ని బట్టి అపార్ధం చేసుకోకూడదని పెద్దలు చెబుతున్నారు.
* సనాతనమైన వేదాలలోనే ఏకపత్నీ, ఏకపతీ........గురించి చెప్పబడిందట.
ఇవన్నీ గమనిస్తే ఒక వ్యక్తి బోలెడు వివాహాలు చేసుకోవటాన్ని పెద్దలు సమర్ధించలేదు అనిపిస్తుంది. ( కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో అంటే , భార్య చనిపోయినప్పుడు, లేక భార్య భర్తను వదిలి వెళ్ళిపోయినప్పుడు, లేక మొదటి భార్య ఇంకో వివాహం చేసుకున్నప్పుడో , ఇలా....మరో వివాహం చేసుకోవటం తప్పు కాకపోవచ్చేమో ...)
ఎక్కువ వివాహాలు చేసుకోవటాన్నే సమర్ధించనప్పుడు ...ఇంటికి వచ్చిన అతిధి కోరుకున్నంతమాత్రాన ఇల్లాలిని అప్పగించటాన్ని పెద్దలు అస్సలు సమర్ధించరు ..
* మీరు వ్రాసిన కధ అలా జరగటానికి వెనుక మనకు తెలియని కారణాలు ఉండి ఉంటాయండి......శ్వేతకేతు అనే వారు వేదాలలో చెప్పబడిన ఏకపత్నీవ్రతాన్ని మరల పునరుద్ధరించి ఉండవచ్చు.
రావణాసురుడు కూడా అతిధి ( బిక్షువు ) రూపంలోనే వచ్చాడు. సీతాదేవిని కోరుకున్నాడు. రాముడు రావణాసురుని కోరికను మన్నించలేదు సరి కదా, రావణాసురుని వంశాన్నే నాశనం చేసి , పరస్త్రీని కోరుకోవటం అనేది ధర్మవిరుద్ధమైన కోరిక .... అని లోకానికి తెలియజేశారు. అతిథి మర్యాదలకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా !
పెద్దలు సమాజ హితం కోసం నైతికవిలువలతో కూడిన ఎన్నో ధర్మాలను ఏర్పరిచారు. మానవులు కొన్నిసార్లు మనసును అదుపులో పెట్టుకోలేక , కొన్నిసార్లు పరిస్థితుల ప్రాబల్యం వల్ల , ఇంకా మరెన్నో కారణాల వల్ల ఆ ధర్మాలను అతిక్రమిస్తుంటారు. ఆ విధంగా సమాజంలో రకరకాల మార్పులుచేర్పులు జరుగుతున్నాయి.
* మానవుని అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని సాధించాలంటే మనస్సును అదుపులో పెట్టుకోవటమే మార్గం. అందుకు దైవకృప అవసరం. దైవకృపను పొందాలంటే సత్ప్రవర్తన ఎంతో అవసరం..
మీరు ఎన్నో విషయాలు తెలిసినవారు..... ఇవన్నీ మీకు తెలియవని కాదు. నా అభిప్రాయాలు కూడా చెప్పాలని ఇవన్నీ వ్రాసాను.... అంతేనండి. వ్యాఖ్యను టపాలా వ్రాసినందుకు క్షమించండి..
అనురాధ గారు, సనాతన ధర్మం ను పాటించే స్త్రీ మూర్తిగా మీ అభిప్రాయం వ్రాసారు. ఆదిమ మానవుడి వద్ద నుంచి నవీన మానవుడి దాక సమాజము ఆనేక మార్పులకు లోనయింది.వాటి మీద మీకు అవగాహన లేదు. మీరు పోస్ట్ లో తెలిపిన పుస్తకము చదవండి తెలుగులో వుంటుంది
తొలగించండిమీకు చాల తెలుస్తాయి. ఇక అతిధి వ్యవహారాలూ అన్నిటికి మీకు సమాధానము లభిస్తుంది.నేను మీ సందేహాలు కు వివరముగా సమాధానము ఇవ్వాలంటే 4 post ల మేటర్ చెప్పాలి.
రమేష్ గారూ, బహు భార్యత్వం ఆ నాటి కాల పరిస్థుతుల మీద ఆదార పాడినదే తప్ప మాత్రు స్వామ్యాన్ని నిరసించినది కాదు, కొంతవివాహ వ్యవస్థ లో అవగాహన లేకపోవటం అయిఉండవచ్చు, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.
రిప్లయితొలగించండిఫాతిమా గారు, బహు భార్యత్వం ను మాత్రు స్వామ్యా వ్యవస్థకు నిరసన అని నేను తెలుపలేదు.
తొలగించండి"ఇక బహు పత్ని వ్యవస్థ అంటారా జాతుల దాడులు, పొరాటాలు వెరశి బానిసత్వాలు తదుపరి భొగత్వాలు ఇన్ని కలిస్థే సమాధానము వస్తుంది."
ఇది ఆనేక రకాల విపరిణామాలకు లోనయున వ్యవస్థ. వివాహ వ్యవస్థ పై అవగాహన వున్నది కాని పొస్ట్ పరధి పెరుగుతున్నదని. వివరముగా తెలుపలేదు
పోస్ట్ చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.
sir chaalaa varaku vivaramgaane thelipaaru. mee vivarana ardavanthamainade.
తొలగించండి(excuse me for not being able to type in Telugu right now)
రిప్లయితొలగించండిThe polygamous nature of social set ups in yester-eras is mostly due to the then prevailing social conditions which were very volatile and war prone on trifles. Wars often left behind clans filled with great number of mourning widows. The glaring inequity in male -female ratio only culminated in the natural justice that men take multiple wives. Not that victors and war-returned take war widows, which could have been partly true, there was another more compelling reason for polygamy. As most eligible bachelor get killed, the remaining few have to marry multiple girls to maintain healthy societies. Societies which enjoy more peaceful existence always can afford monogamy.
మీరు చెప్పిన కారణం పూర్తి సమాధానం ఇవ్వదనుకుంటా. రెండో ప్రపంచ యుద్ధంలో కోట్ల సంఖ్యలో మగవారు చనిపోయినా ఆయా దేశాలలో బహుభార్యావ్యవస్థ రాలేదు. యుద్ధం అయిపోయిన వెంటనే జనాభా విపరీతంగా పెరిగినా అది ఏకపత్నీవ్యవస్తలోనే జరిగింది. కొంత లోతుకు వెళితే తప్ప దీని కారణాలు తెలియవు.
తొలగించండి