విశ్వ కుటుంబ వ్యవస్థలలో భారతీయ కుటుంబ వ్యవస్థ అగ్రగణ్యమని సర్వులకు విదితమే.
ఇంతటి కుటుంబ వ్యవస్థ ఏర్పడటానికి మూలం పెళ్ళి. ఫెళ్ళి అంటే ఒక సంబరం,ఒక ఉత్సాహము.ఒక ఉల్లాసం,ఒక వేడుక అంతకు మించి ఆచారము.ఇవి అన్ని కలబోస్తేనే భారతీయకుటుంబాలలో పెళ్ళి.అందుకే ఫెళ్ళి అంటే నూరేళ్ళ పంట అన్నారు.
పూర్వము అష్టావర్షత్ భవేత్ కన్యా అన్నసాంప్రదాయాన్ని అనుసరించి వధువుకు 8సం. లు మరియు వరునకు 10సం.లలో వివాహము.అలాగే భారతీయ వైదిక సిద్దంతాలను అనుసరించి మానవుని కాల అవధి 120సం. లు గా గుర్తించబడినది.
ఉగ్రరధశాంతి, షష్టి అపదపూర్తి(షష్టి అబ్ద పూర్తి) అనునవి శాంతీ కర్మలు. ఉగ్రరధశాంతి 59వ సం. నుంచి 60సం. మధ్యలో,షష్టి అపదపూర్తి(షష్టి అబ్ద పూర్తి) 60వ సం. నుంచి 61వ సం. మధ్యలో జరుపుతారు. కాని కాల చక్రంలో ఉమ్మడి కార్యక్రమముగా మారిపొయినది.
షష్టిఅపదపూర్తి(షష్టి అబ్ద పూర్తి) వాడుకలో షష్టి పూర్తిగా వ్యవహారం.ఇది 60వ జన్మదిన వజ్రొత్సవాలు, వివాహ స్వర్ణొత్సవాలు అని పూర్వులు నిర్ణయించారు. నేడు షష్ఠిపూర్తి ఈ రెండింటి సంయుక్త క్రియ.
మానవుడు కుటుంబ జీవి, కుటుంబమంటేనే సకల సోదర,సొదరి, బంధు,మిత్ర,పుత్ర,పౌత్ర,ప్రపౌత్రులతో వర్ధిల్లడం.మరి ఇందరి సంక్షములో తన యిల్లాలినే వధువుగా నిలిపి తను పునరంకితము కావటము ఎంత ఆనందదాయకము.అనాడు వధువు వరునకు సత్ సంతానాన్ని ఇస్తే, నేడు వరుడు అమెకు "నేను నీవు కలసి ఇంతటి కుటుంబ వ్యవస్థను ఏర్పరచామని " తెలపటమే ఈ షష్ఠిపూర్తి నందు వున్న మార్మిక సందేశం.
మానాన్నపెళ్లి,మా అన్నయ్య పెళ్ళి,మా తాతయ్య పెళ్ళి అంటూ సకల చిరంజీవులు కలసి చేసే ఆనందహేల.ఈ షష్ఠిపూర్తి. కనుకనే ఈ వేడుకను ప్రత్యెకముగా జరపాలని కుటుంబ సభ్యులందరు ఎదురుచూస్తూ వుంటారు.
ఈ షష్టిపూర్తి వేడుకలో ఆయుష్య హోమం,ముఖ్య విధి. దీనికి నవగ్రహ హోమం,ధన్వంతరి హొమం,మృత్యుంజయ హోమం లాంటీ కూడా కలిపి ఆచారిస్తారు.
60 సం. ల జీవనకాలంలొ ఎన్నో అనుభవాలు,అనుభూతులు,వృత్తిపరమయిన కట్టుబాట్లు, జీవనంలోని ఎగుడు దిగుడులు పరిశీలనకు మనస్సు కొరుతుంది.అదే వానప్రస్థమునకు తోలి మెట్టు.తన జీవ అనుభవాలను తన చిరంజీవులకు తెలపడమే ఈ షష్ఠిపూర్తి సారాంశం.
మరి ఇంతటి షష్టిపూర్తి కార్యక్రమము జరగాలంటే దైవానుగ్రహం సంపూర్ణముగా లభించాలి.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిషష్ఠి అంటే ఆరు.
రిప్లయితొలగించండిషష్టి అంటే అరవై.
మార్చండి.
ఆచార్యులకు,
తొలగించండినమస్కారములు.తప్పుసరిదిద్దాను.తెలియచేసినందులకు ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిఅఙ్ఞాత కామేంట్స్ కు ప్రత్యుత్తరము ఇవ్వకూడదని అనుకున్నా అందువల్లనే మీ కామేంట్ కు సమాధానం లభించలేదు. ఈ సారి మీరు నాబ్లాగ్ చదివినప్పుడు సందేహము,విమర్శ ఎవైనా ఒక పద్దతీలో పేరు తెలుపుతూ వ్రాసినా సమాధానము లభించకలదు.
రిప్లయితొలగించండిపురుషులకు 60సంవత్సరములు నిండి 61వసంవత్సరము మధ్యలో షష్టిపూర్తి నిర్వహిస్తారు.పాత అచారాలు,కర్మలు అన్ని పురుష ప్రధానముగానే సాగేవి అన్ని విషయము గమనములోనికి తీసుకోవాలి.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి