భాగవతములొ కృష్ణలీలకు ప్రతీదానికి అంతరార్ధము వున్నది.అది మనము గమనించితే పరామార్ధము తెలిసినట్లే లేకపొతే కృష్ణుని అల్లరి, లీలా వైభవముగా భావించి మురిసిపోవటమే. అలా నా పరిశీలనలొకి వచ్చిన కుబ్జ కథ అంతరార్ధమును పాఠకులకు అందచేద్దామని ఈ పొస్ట్.
గోకులములొ కృష్ణుడు కంసుడు పంపిన మాయలు,మాయరూప రాక్షసులందరిని మట్టుపెట్టాడు.ఈ విషయము కర్ణాకర్ణిగా మధుర ప్రజలకు తెలుస్తుంది. వారు కృష్ణుడు ఎప్పుడు వచ్చి తమకు ఈ రాక్షసపాలన నుంచి విముక్తి కలిగిస్తాడో అని ఎదురు చూస్తున్నారు.
కృష్ణుడు కంస ఆహ్వనము పై బలరామునితో కలసి మధురనగర ప్రవేశము చేసాడు.మధురానగరములో వింతలు విశేషాలు తిలకిస్తూ నగర రహదారులగుండా వెళ్ళుతున్నారు.ఈ జగన్మొహనాకార సోదరులను చూసి ఆహా వీరు ఎంత సౌందర్యముగా వున్నారో మరీ ఆనీలమేఘశ్యాముడైతే దృష్టి మరల్చ లేకుండా వున్నాము. పురుషులలో ఇంత జగన్మొహనాకారాన్ని మేము ఇంత వరకు చూడలేదు ఇలా పరిపరి విధములా తలపొస్తున్నారు.మధుర ప్రజలు బలరామకృష్ణులు ఇరువురికి స్వామి రండి మా ఆతిధ్యము స్వీకరించండి, ఈ మధుర భక్ష్యాలు ఆరగించండి,ఈ పూలమాలలు ధరించండి,ఈ సుగంధాలు ఆఘ్రాణించండి ఇలా అనేక విధాలుగా స్వాగత సత్కారాలు పలుకుతున్నారు.
ఇవి అన్ని రహదారిన కంసమందిరానికి వెళ్ళుతున్న కుబ్జ ఆలకించింది,పరిశీలించింది.ఒక్కసారిగా దుఃఖము ముంచుకు వొచ్చింది.అమె పరిస్థితికి అమెకు జీవితము మీద విరక్తి కలిగినది.కృష్ణునివంటి సౌందర్యవంతునికి ఒక్కసారి సేవ చేసుకునే భాగ్యము నొచుకొనందుకు బాధ పడింది.కారణము అమే గూని స్త్రీ కావటము వలన అందరు అమెను కుబ్జ అని పిలుస్తారు.అమే అసలు పేరు త్రివక్ర. అమె కంస మందిరానికి శ్రీగంధములు,మైపూతలు అందించు పరిచారిక (దాసి) మాత్రమే.అమె తన వికార రూపానికి సిగ్గుపడి కుచించుకుని నడూస్తుంది. అందువలన ఇంకొద్దిగా వికారముగా కనిపించుటతో పిన్నలు పెద్దల ఆవహేళనకు గురి అవుతుంది. ఇన్ని పరిస్థితులలొను అమె భగవధ్యానము మానదు.
ఇక ప్రస్తుతానికి వస్తే కుబ్జ మధనపడుతుంది కనీసము ఒక్కసారి అన్నా కృష్ణుని మనసారా నఖశిఖపర్యంతము చూద్దమంటె శరీరము సహకరించదు.నెమలి పించము,అందమయిన కనుదొయి, అంతకన్నామనొహరమయిన చిరునవ్వు, పితాంబరాలు ఇవి అన్ని చూడాలి తనచే స్వామికి శ్రీగంధాలు అలది స్వామికి సేవ చేయాలని మనసారా కాంక్షిస్తుంది. శరీరము సహకరించదు పైగా తాను దాసీ ఇలా అనేక విధాలుగా తలపొస్తు కంసమందిరానికి వెళ్ళే రహదారిలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుకకు వేస్తూ తచ్చాడుతుంది.
ఆ సమయములొ కృష్ణుడు అమెను చూసి జాలిపడ్డాడు కరుణాసముద్రుడైనాడు సుందరీ! అన్న పిలుపుతో కుబ్జను సంబొధించాడు.అమె వెనుతిరిగి చూసింది . ఆ నిత్యపురుషస్వరూపాని కాంచేసరికి ముందు నివ్వేరపొయింది తరువాత వాస్తవములొకి వచ్చింది.జలజాక్షీ!అన్నాడు కృష్ణుడు కుబ్జ కన్నుల వెంట ఆశ్రువుల ధార, స్వామీ! నీవు కూడా నన్ను ఆవహేళన చేస్తున్నావా?.కృష్ణుడు చిరునవ్వుతో ఏది మీ వద్దవున్న సుగంధ సులేపానాలు పరీమళాలు మాకుకూడా ఇస్తావా ? అమె ఆదరహాసానికి ఆ ఆదరణకు ముగ్ధురాలయి సుగంధాన్ని,మైపూతలను సమర్పణ చేసింది.పన్నిటీతో దేహాన్ని, కన్నిటితో పాదాలను తడిపింది.
ఆ విధముగా అమె చేసిన సేవకు సంతుష్టుడైన కృష్ణుడు అమె పాదము మీద తనపాదము వుంచి అమె గడ్డం క్రింద చేయి పెట్టి తలను పైకెత్తాడు.వెంటనే అమె నడుము వద్ద,వీపు పైన వున్న,కంఠము వద్ద వున్న గూని మొత్తము పొయి అమె కృష్ణ పాదస్పర్శ,కరస్పర్శలవలన అపూరూప సౌందర్య రాశిగా మారింది.అది చూసిన మధుర ప్రజలు జయహో!జయ జయహో! శ్రీకృష్ణా అని జయ జయధ్వానాలు పలికారు.
ఇంత వరకు భాగవత కధగా వున్నది. దీని అంతరార్ధము ఓక్కసారి పరిశీలించుదాము.
తనను ఇంతగా ఆదరిస్తున అభిమానిస్తున్న ప్రజలకు కంససంహరము తప్పదు అని మధుర ప్రజలకు సంకేతముగా తెలియ చేయటమే కృష్ణుని లక్ష్యము.
కుబ్జ ఓక స్త్రీ. స్త్రీ ఎప్పుడు ప్రకృతే. ప్రకృతి తనలో వున్న సుగంధాలయిన తరు,వన,గిరి,జల వనరులను సర్వమానవాళికి అందిస్తుంది,ఆనందిస్తుంది.కానీ, ఇదే ఏ ఒక్కరి ఆధినమయిపొతేనో? దీనికి సూచికముగా కుబ్జ దాసీగాను,కుబ్జ సుగంధ పరిచారికగాను వర్ణించారు వ్యాసులవారు.ప్రకృతిలో భాగమైనది పుష్పము,స్త్రీ. చక్కని వాతావరణము, లాలిత్యముగా పురుషుడు స్త్రీను దగ్గరకు తీసుకుంటే తనలో వున్న సౌందర్యము పురివిప్పుతుంది.అంగాంగము అత్యంత రమణియముగా శోభిల్లుతుంది.పుష్పము,లాలిత్యాన్ని,తావిని,ముగ్ధమనొహరత్వాన్ని సమకూర్చుతుంది. అదే రాక్షస ప్రవృత్తివున్న కంసుని వద్ద ఏమవుతాయి కుబ్జలాగ కుచించుకుపొయి గూనిలాగా త్రివక్రముగా మారిపొతుంది.
పుష్పము విరియదు. కానీ స్త్రీ,పుష్పాలు తమ సహజ లక్షణాలను కొల్పోవు అందుకే సుగంధ పరిచారికగా చూపినారు.
జగన్మొహనాకారుడు పురుష స్వరూపమయిన శ్రీకృష్ణుడు సుందరి అని పిలిచెసరికి మొదట సందేహము తరువాత దుఃఖము చిప్పిల్లగా ప్రభూ అని విలపిస్తుంది.కానీ శ్రీకృష్ణుడు అమెను ఆదరణగా ఓక్కసారి స్పృశీంచెసరికి తనలో వున్న స్త్రీత్వము ఓక్కసారిగా పెల్లుబుకి సౌందర్యరాశిగా మారుతుంది.ప్రకృతికి దాపురించిన రాక్షసత్వము లాంటి గూని పొయి కుబ్జ ఓక సౌందర్యవతిగా మారటమే సంకేతము.
ఈ విషయాన్ని సూచనగా గమనించిన మధుర ప్రజలు కంససంహరము తప్పదు అని జయధ్వానాలు పలికారు, ఆరాధించారు.
*కుబ్జ ఓక స్త్రీ. స్త్రీ ఎప్పుడు ప్రకృతే. ప్రకృతి తనలో వున్న సుగంధాలయిన తరు,వన,గిరి,జల వనరులను సర్వమానవాళికి అందిస్తుంది,ఆనందిస్తుంది.కానీ, ఇదే *
రిప్లయితొలగించండిమీరు స్రీని ప్రకృతి గా పోల్చటం సరి అయిన పద్దతి కాదేమో! ప్రకృతి-పురుషుడు అని గ్రంథాలలో ప్రస్తావించినపుడు, స్రీ -పురుషులని అని అనుకొనేవాడిని. ఉపనిషత్ , వేదాంతం, సనాతన ధర్మం కోణ్మలో నుంచి చూసినపుడు మీరు చెప్పిన "స్త్రీ ఎప్పుడు ప్రకృతే" అనేది వర్తించదు. ఆ కాన్సేప్టే (దర్శనం/తత్వం)వేరు.
ఇక మీరు చెప్పిన కథ విషయానికి వస్తే, భాగవతం లో ఈ చరా చర ప్రకృతి అంతా కూడా దైవ స్వరూపమే, దేవుడే ప్రకృతిగా రూపుదాల్చాడు అని చెపుతుంది. దేవుని సృష్టిలో ఉపయోగపడనటువంటిది, సుందరంకానటువంటిది ఎదీలేదు . అదికాక జగద్గురువు, యోగి అయినటూంటి కృష్ణుడి కి ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి సుందరంగా,ప్రేమమయంగా కనిపిస్తుంది. కనుక ఆయన కుబ్జను ఆ విధంగానే సంభోదించాడు.
SriRam
*కుబ్జ ఓక స్త్రీ. స్త్రీ ఎప్పుడు ప్రకృతే. ప్రకృతి తనలో వున్న సుగంధాలయిన తరు,వన,గిరి,జల వనరులను సర్వమానవాళికి అందిస్తుంది,ఆనందిస్తుంది*
రిప్లయితొలగించండిమీరు వేదాంత, ఫిలాసఫి గ్రంథాలలో చెప్పిన ప్రకృతి-పురుషుడు అనే మాటలను ఆధారం చేసుకొన్ని స్త్రీ ఎప్పుడు ప్రకృతే అని అనుకొంట్టున్నారేమో అనిపిస్తున్నాది.
SriRam