అనగ అనగా ఓ కోతి. ఈ సృష్టి లో వున్న కోతులా౦టి దైన దానికి వున్నఅధిక చపలత్వం వల్ల మనకు కధ వస్తువు అయినది.అన్ని కోతులకు వున్నట్లే దీనికి ఓతోక వున్నది. పాపం తోక గూడా దాని బాద్యత అది చేస్తున్నా మన కోతి గారికి తోకంటే కోపం, అసహనం.కారణం అది కోతి వెంట వదలకుండా వెంబడిస్తున్నది.దీనీతో కోతికి తోకను ఎలాగయినా వదిలించు కోవాలని దీక్ష బూనింది.మరి తోక లేక పొతే నిన్ను కోతిగా గుర్తు పట్టరంటే.ప్రక్క వాడి తోక లాంటిది తగిలించు కుంటా అని ఎదురు దాడి.ఇలా ఆగం ఆగం చేస్తుంది.దీనితో కోతికి తోకకు వైరం.ఈ అల్లరి కోతి అగాడల్ని గమని౦చిన ఇంకో వృద్ధ కోతి, దానిని పిలచి కారణం అడిగింది.నాకు నాతోక అంటే అసహ్యం గా వున్నది. దీనిని వదిలించు కోవాలని ఈ గోల తప్ప వేరు కాదు.
సరే, దానికి ఇది కాదు పధ్ధతి.నీవు నీ కున్న శక్తి కొద్ది ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు దూకు ఈ దూకుడు లో నీ తోక వూడి పోతుంది. సమస్య తీరుతు౦ది.మాకు ఉప శమనం కలుగుతుంది.
ఈ సలహా విన్న కోతి ఇక తన జాతి బుద్ధి చూప నారంభించినది.దూకుడు,పల్టీలు,గెంతులు ఇలా అన్ని రకముల కోతి లక్షణాలు ఉధృతంగా చూపింది.అయినా లాభం లేదు కోతి తోక యధాతధంగా అలానే వున్నది, కాని సరైన జాగ్రత్త తీసుకోని కారణమున కోతి చెట్టు పైనుంచి పట్టు తప్పి క్రింద పడబోయింది.అప్పటి దాక కోతికి,తోకకు వైరం అయినా క్రింద పడితే దానితో పాటు తనకు అపాయమని తోక చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగ పట్టుకొంది.
దీని తో కోతి క్రింద పడి అపాయం నకు గురి కాకుండా రక్షింప బడినది.
ఈ దెబ్బకు కోతికి తోక విలువ తెలిసి వచ్చింది.ఇప్పుడు దానికి తోక అందమయినది,విలువైనది.
ఇంతకు కోతి ఎవరంటారు.కోతి- పురుషుడు. తోక - వాడి భార్య. చపలత్వం - పర స్త్రీ వాంఛ.
:):) బాగుందండీ. మీరు కోతిని ఇలా అన్వయించారా? నేను వేరేలా అన్వయించాను ఒకసారి చూడండి.
రిప్లయితొలగించండిhttp://patrika.haaram.com/MagPost.aspx?AID=20
ధన్యవాదాలు. కధ చదివాను బాగున్నది. నిడివి తగ్గించ వచ్చును ప్రయత్నిచండి.
తొలగించండినేను చపలత్వం లేని కోతిని,ఎందుకంటే నాకు ఒక మంచి తోక వుంది
రిప్లయితొలగించండి