లోకపాలకుడు శ్రీ మహవిష్ణువు దశావతారాలు మనందరకు తెలిసినవే.ఆయిన భక్తప్రియత్వము,దుష్టశిక్షణ సజ్జనరక్షణ భాగవతములో ఎన్నిసార్లు చదివినా తనివితీరదు. "ఓం నమో నారాయణయ" అనునది అష్టాక్షరి మంత్రముగా శ్రీ మహ విష్ణువుకు మూల మంత్రముగా భగ్వద్రామానుజలవారు ఉవాచ.ఏందరో భక్తులు ఈ మంత్ర రాజముతో వైకుంఠవాసాన్ని పొందారు.మరి సాధారణ భక్తులకు? అందుకే శ్రీమహవిష్ణువు వివిధకాలాలో వివిధ ప్రదెశాలలో తననుతాను వ్యక్తపరిచిన ప్రదేశాలను స్వయంవ్యక్తక్షేత్రాలుగా పిలుస్తారు. వింతగా ఇవి కూడా 8 గా వుండి ఒక్కో అక్షరానికి ఒక్కో క్షేత్రము సంకేతములా వుండి భక్తుల హృదయాలను చూరగొంటున్నాయి.
1) శ్రీరంగం రంగనాధస్వామి శ్రీరంగం
2) వెంకటాద్రి వేంకటెశ్వరస్వామి తిరుమల
3) శ్రీముష్ణము భూవరాహస్వామి శ్రీముష్ణము,కడలూరు.
4) తోటపర్వతము వానమామలై పేరుమాళ్ నాన్ గునేరి
5) సాలగ్రామము చక్రపాణి ముక్తినాధ్, నేపాల్
6) పుష్కరము విష్ణు పుష్కర్,అజ్మీర్,రాజస్ఠాన్
7) నారాయణాశ్రమము బదరీనారాయణ బదరీనాథ్
8) నైమిశం చక్రనారాయణ నైమిశారణ్యము,నీంసార్, ఉత్తరప్రదేశ్.
ఈ 8 క్షేత్రాలలో నేను 5 దర్శించాను. ముక్తినాధ్ కు మాత్రము త్వరగా వెళ్ళాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.