మానవుడు సంఘజీవి. మనకు అనేకమంది స్నేహితులు,బంధువులు,పరిచయస్తులు వుంటారు.మీరు ఓక్కసారి మీ అంతఃచక్షువులతో పరిశీలించండి వారిలో చాలమందిలో ఎదో ఓక ప్రత్యేకలక్షణము గమనించగలరు.ఇది ఎలాగంటారా ? ఏముంది " మీ హృదయనేత్రముతో ఓక్క ఫొటో తీయండిచాలు. యక్స్ - రే వద్దు. ఫొటో చాలు.యక్స్-రే అయితే ఏముంది అస్థికలు, ఇది మానవజీవితాల్లో స్థిరంగా వుండే స్వార్ధము కు ప్రతిఫలిస్తుంది. అదే మీరు బాహ్యాము నుంచి మీ మనొ అంతారాలతో ఫొటో తీసారు అనుకొండి నేగిటీవ్ చూడండి సమాజములో తెల్లగా ధగధగాలడే వ్యక్తుల మనొభావాలు నల్లగా, హీనమయిన నల్లని కుక్కపిల్ల కన్నా నీచముగా వుండే వ్యక్తి కున్న మనోసౌందర్యము పాలకన్న తెల్లగా".
"జీవితము అందరకు స్థిరము". కానీ జీవన విధానము వ్యక్తిని బట్టి మారుతుంది. సుఖః,దుఖఃలలో వారిమాట,వారి ప్రవర్తన,వారి జీవన విధానము జీవన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తుంది.ఇది" జీవితము చాలామందికి నేర్పే పాఠము,ఓక కళ.కాకపొతే మరికొంతమందికి సహజాతముగా మాతృగర్భము నుంచే లభిస్తుంది".అలా నేను పరీశిలించిన కీ.శే. శ్రీ తవ్వా వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి గురించి ఈ కథనము.కాకపొతే వీరు నాకు మామగారుకావటము యాదృచ్చికము.
ఈయన బహుచక్కని రూపసులు,బహుసున్నిత మనస్కులు,అత్యంత సంతోషి. ఎవ్వరిని ఎప్పుడు ఓక్కమాట పరుషంగా మాట్లాడినది లేదు.గొదావరిజిల్లాల సరమయిన మాట వీరీ నోటివెంట.
నా వివాహసమయానికి వీరు ఆర్ధికముగా ఇబ్బందిపడి,రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి వచ్చి మామేనమామ గారి ఆలంబనతో స్వయముగా నిలదొక్కుకుంటున్నారు.ఇది నావివాహము నాటి నేపధ్యము. రాజమండ్రిలో ఓక రాజకుమారునిలా ఉమ్మడికుటుంబములో వున్న ఆయిన కృత్యాదిఆవస్థ మీద విశాఖలో స్థిరపడ్డారు.గతం గతః అన్నరీతిలో పొయిన సొమ్ము గురించి ఓక్క క్షణము కూడా అలొచించలేదు,బాధపడలేదు.నాతో ఎన్నడు ప్రస్తావించలేదు.సరికదా, జీవితము ఉల్లసముగా,ఉత్సాహముగా ప్రతీ క్షణము,ప్రతి రోజు నాదే అన్నంతగా గడిపారు.అల్లుడుగా నన్ను ఎంత ఆదర అభిమాన మర్యాద పూర్వకముగా చూసేవారో అంత మర్యాద మన్నన సర్వుల పట్ల చూపేవారు.వీరు అజాత శత్రువు.పొరపాటున కూడా ఎన్నడైనను నొరెత్తి దూషించినదిలేదు,కన్నుతో కొపించినది లేదు.సరికదా ఎవరైనా అభాసుగా ప్రవర్తిస్తే, దూషిస్తే, వారిపట్ల వీరి నిరశన " వాడి పాపాన వాడే పొతాడు" ఇది ఆవ్యక్తి పట్ల తిరస్కార దూషణ.
వ్యక్తుల శుభ్రత మనస్సు పరిశుభ్రత పైన ప్రభావితము చూపుతుందంటారు.వీరిని ఎప్పుడు గమనించినా అరవిచ్చినా రొజాలా,అప్పుడే తోటనుండి కోసుకు వచ్చిన మల్లేమొగ్గలా తాజాగా మడత నలగని వస్త్రధారణ.అంత కన్నా ముఖ్యముగా చిరునవ్వు.వీరీకే ప్రత్యేకమయిన సుగంధాలు.
పండుగైనా,వేడుకయినా అది జరిపే తీరు విలక్షణమే.అలాగే ఆహారము ఎన్నిరకాల పదార్ధాలో,ఆ రుచులు, ఆ కాంబినేషన్స్,చెప్పతరముకాదు.ఈ పదార్ధము ఇలా తినాలి,ఇలా అస్వాదించాలి అనే సాధికారత. తను తన కుటుంబము తింటే పట్టించుకొవలసిన పనిలేదు వారితో పరిచయమున్న ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే.నాకు తెలసి వారు రేపు గురించి ఆలొచించినది లేదు అంతా పరమాత్ముడి దయ అనేవారు.
అలానే వీరి జీవననిష్క్రమణ ఓక వింతగా అనిపిస్తుంది.
09/08/2004 న నేను వ్యాపారపని నేను విశాఖలొ వున్నా, కాని వీరు కూడా వ్యాపారపని మీద కేంప్ లో వుండటము వలన కలవలేకపొయాము.అదే రొజు నేను తిరుగు ప్రయాణము.కాని 12వ తేదికి విజయవాడలో వీరి అమ్మాయిని చూడాలని ప్రత్యక్షము. నాకు ఆశ్చర్యము,నా శ్రీమతికి సంతోషము నాన్న వచ్చారని.టిఫిన్ కార్యక్రమము తరువాత బజారుకు. నాకు తెలిసి ఆయిన ఎవరి ఇంట్లోను భొజనము చేయరు ఆఖరుకు కూతురైనా సున్నితముగా నిరాకరిస్తారు.కాని ఆరొజు వారు నేను మధాహ్న భొజనమునకు వచ్చు వరకు వుండి నాతోకలసి భోజనము చేసాము.ఇది మేము ఇద్దరము కలసి చేసిన ఆఖరి భోజనము.ఇది అల్లుడుగా నాకు ఇచ్చిన మర్యాదా లేక విడ్కొలా ఆదైవానికే తెలియాలి.వారు 12 వతేది న తిరుగు ప్రయాణము.

14వతేది ఇంటినుంచి షాపుకు వచ్చు సమయములో వాటర్ బాటిల్ కూడా స్వయముగా నింపుకొని షాపుకు వచ్చి ఓక గంట గడిపారు.షుమారు 11.30 ప్రాంతములో షాపులో వున్నవారు వున్నట్లు అలా దైవ సాన్నిధ్యానికి చేరారు.
శంకరభగవత్ పాదులు అన్నట్లు దోసపండు దొసపాదు నుంచి విడచినట్లు అలా వీరి ఆత్మ పరమాత్మలో లీనమయింది.
ఇటువంటి వ్యక్తిత్వము.జీవనము,అనాయాసమరణము చాలా అరుదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.