24, జూన్ 2012, ఆదివారం

పంచభూతాలు శరీరంలో ఏవిధముగా మార్పు చేందాయి.


మనము దాదాపు అనేక ప్రవచనాలలో,పురాణలలొ,కధలలొ వింటూ వస్తాము ఈ దేహము పంచభౌతిక శరీరము. పంచభూతాలు అంటే మనకు తెలుసు. కాని శరీర నిర్మాణములో ఎవిధముగా పాలుపంచుకున్నాయి,ఎ జీవక్రియలు చేస్తున్నాయి, అవి ఎవి ఉత్పత్తి చేస్తున్నాయి అన్న వివరణ చాలమందికి తెలియదు.యోగ, ధ్యాన తరగతులలో ఇవి బొధన జరుగుతుందో లేదో. ఈ కాలములో ఈ రంగములో కూడా అన్ని ఆధునిక పద్ధతులు,మార్గాలు,క్రియలు వచ్చాయి.అంతా నవ్య ధోరణులు.విరు వారి మార్గ అనుసరుణలకు వారిమార్గము మాత్రమే బొధిస్తున్నారు.వాటి పట్ల ఆసక్తీ వున్న వారికి ఉద్దేసించినది ఈ పొస్ట్.    


ఆకాశము,వాయు,అగ్నీ,జల,పృధ్వి మొదలగునవి పంచభూతాలుగా మీకు తెలిసు.వీటిలొ ఓక్క దానిని తీసుకుని రెండు అర్ధభాగాలుగా చేసి, మొదటీ భాగము శరీరములో ఆతత్వన్ని ప్రతిబింబించే భాగాలుగాను.రెండవ అర్ధభాగము మరల 4 భాగాలుగా విడిపొయి ప్రతి ఒక్క భాగము మిగతా నాలుగు తత్వాలలో ఒక్కో తత్వముతో  కలసి శరీరములో భాగాలుగా మారి అనేక విధులు నిర్వర్తిస్తున్నాయి.    
పంచభూతాలు స్థూలశరిరములొ ఏవిధముగా ఏర్పడినాయో వివరము తెలుసుకుందాము.

పృధ్వి భూతము యొక్క స్థూల భాగములు : పృధ్వి 2 భాగములయి, మొదటి సగభాగము తన నిజ అంశనందుండి "అస్తులు" గా మరుతుంది
పృధ్వి రెండవ భాగము మరలా 4 భాగములై 1)ఆకాశముతో కలసి నఖ,రోమములు 2)వాయువుతో కలసి చర్మము  3) అగ్నీ తో కలసి నరములు 4) జలముతో కలసి మాంసముగా మార్పుచెందుతుంది.

జలభూతము యొక్క స్థూలభాగములు : జలము 2 భాగములయి మొదటి భాగము తన నిజ అంశనందు వుంది శుక్లముగాను. జలము యొక్క రెండవ భాగము మరలా 4 భాగములయి 1)ఆకాశముతో కలసి చొల్లు గాను, 2) వాయువుతో కలసి చెమటగాను,3) అగ్నీ తోకలసి మూత్రము గాను 4)పృధ్వితో కలసి రక్తమాయేను. 

అగ్ని భూతముయొక్క స్థూలభాగములు : అగ్ని 2 భాగములయి మొదటి భాగము తన నిజ అంశనందు వుండి ఆకలి గా మారుతుంది. రెండవ భాగము మరలా 4 భాగములయి 1)ఆకాశముతొకలసి నిద్రగాను 2) వాయువుతో కలసి దప్పికగాను 3)జలముతో కలసి సంగమముగాను  4) పృధ్వితో కలసి ఆలస్యమాయెను 

వాయువు భూతము యొక్క స్థూలభాగములు : వాయువు 2 భాగములయి మొదటి భాగము తన నిజ అంశనందు వుండి పరుగు గాను రెండవభాగము మరలా 4 భాగములయి 1) ఆకాశముతో కల్సి దాటుట గాను 2)అగ్ని తో కలసి తిరుగుట గాను 3)జలముతో కలసి చలనముగాను 4) పృధ్వితో కలసి సంకోచము గాను మార్పు చెందాయి.

ఆకాశభూతము యొక్క స్థూలభాగములు : ఆకాశము రెండు భాగములయి మొదటి భాగము తన నిజ అంశనందు వుండి శోకముగాను మిగిలిన రెండవ భాగము మరలా 4 భాగములయి 1)వాయువుతో కలసి కామముగాను 2) అగ్నీ తో కలసి క్రోధముగాను 3) జలముతో కలసి మోహముగాను 4) పృధ్వితో కలసి భయముగాను మార్పు చేందాయి.



3 కామెంట్‌లు:

  1. sir, 2 saarlu chadivaanu ayinaa edo sandeham. chaalaa high standered lo undi, malee chaduvutaanu. ika rojee mee blog loki chudatame naa pani

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫాతిమా గారు,
      ఇది రాజయోగంలో పంచపిoడికరణ అనే భాగంలో కొంత మాత్రమే తెలిపాను.పూర్తిగా తెలిపితే మన బ్లాగర్లు చాదస్తుడి గా భావిస్తారు. ధన్యవాదాలు! మీరు ప్రతి రోజు నాబ్లాగ్ చదవాలని నిర్ణయిమ్చినందుకు. మీ లాంటి సాహితి పట్ల ప్రేమ,జ్ఞానం పైన అనురక్తి వున్న వారు అభిమానం చూపటము నాకు సంతోషమే!

      గూగుల్ ime download చేసుకోండి తెలుగు టైపింగ్ మీకు చాల తేలిక అవుతుంది.

      తొలగించండి
  2. నమస్కారం .... చాలా బాగుంది ... ఇంకొంచెం వివరిస్తే మరింత తెలుసుకునే అవకాశం వుంటుంది .ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.