3, జూన్ 2012, ఆదివారం

ఋణానుబంధరూపేణా .......




ఋణానుబంధరూపేణా పశుపత్నిసుతాలయం అన్నారు పెద్దలు. ఈ విషయము పరీశీలనలొ అనుభవంలోకి  వస్తే కాని అర్ధంవలేదు.

నా పితృదేవులు కీ.శే. శ్రీ ఆలపాటి పాండురంగారావు గారు గుంటూరుజిల్లా, చెరుకుపల్లి గ్రామవాసి.వృత్తి రీత్యా ఉపాధ్యాలు ప్రవృత్తిరీత్యా సాధుజీవులు,ఆచారవంతులు. కానీ ప్రారబ్దవశాత్తు  అనారోగ్యము వీరి జీవితము పాలిట శాపము అయినది.1993 ఉపాధ్యాయునిగా పదవివీరమణ చేసినారు.వీరి జీవన ప్రారంభములో  కాలప్రభమువల్ల కానివ్వండి, ఆర్ధిక ప్రభావము వల్ల కానీవ్వండి ప్రతిదానికి లోటు, సర్దుబాటు.కానీ జాగ్రత్తగ 4 సంతానాన్ని పువ్వులా  కాపాడుకొచ్చారు.దైవకృపవలన అన్ని సాధించుకొచ్చారు.తన బాధ్యతలు తీర్చుకొని ప్రశాంతముగా జివనము గడుపుదామన్న సమయములో "కేన్సర్" వీరిపాలిట మహమ్మారిల దాపురించి,ఈ వ్యాధి వలన చాలా బాధకు గురి అయినారు.అలా 2002 నుంచి 2006 వరకు కేన్సర్ వ్యాధిగ్రస్తునిగా వున్నప్పుడు పుత్రునిగా వారికి పూర్తి సేవ చేసుకునే భాగ్యము దక్కింది.
          2006 జనవరికి మానాన్నగారు మాస్వగ్రామములో వున్నారు. నేను సంక్రాంతి నిమిత్తము తప్పనిసరి అయి మానాన్నగారి అనుమతి ద్వారా విశాఖకుపయనము.ఆ సమయమున 15/01/2006న నా మేనల్లుడు మామయ్య తాతగారికి సీరియస్ అని ఫొన్ ఉత్తరక్షణములొ రైలులో బయలుదేరి మా స్వగ్రామానికి చేరాను.ఆ రైలులొనే నాస్నేహితులకు,సన్నిహితులకు పరిస్థితి వివరించి  ఎవరికి ఎమిచెయాలో పురమాయింపు,సహాయ అబ్యర్ధనలు ఇలా అన్నీ పనులు చేసాను.మాగ్రమముచేరి మానాన్నగారిని చూడగానే పరిస్థితిని అంచనా వేసి వెనువెంఠనే అంబులేన్స్ లో విజయవాడకు అత్యవసర వైద్యసహాయము కోసము తరలింపు.విజయవాడలో 16 నుంచి 20 వ తేది వరకు వుంచి 20వ తేదిన డిశ్చార్జీ  చేశారు.మరలా నాన్నగారిని అంబులెన్స్ లో తిరిగి స్వగ్రామానికి పంపుసమయములో నాన్నగారు అంబులెన్స్ చార్జిలు మీ వద్దవున్నవా అని యధాలాపముగా ప్రశ్న వేసాను.అప్పటికే నేను వ్యాపారరీత్యా విజయవాడనందు స్థిర నివాసము ఎర్పరుచుకొన్నందువలన  నాన్నగారితో కూడా వెల్లే అవకాశములెక మా సొదరునితోపాటు పంపుతూ ఈ ప్రశ్న వేసాను. నా ప్రశ్నకు సమాధానముగా ప్రస్తుతము నావద్ద అంత పైకములేదు వూరు చేరిన తరువాత నాతిప్పలు నేను పడతాను అన్నారు.ఇది విన్న నేను చాలా ఇబ్బంది,బాధకు గురి అయి నేను ఉండగా మీరు అంత ఇబ్బంది పడనవసరములేదు అని గమ్మత్తుగా నా ఖచ్చితముగా అంబులెన్స్ చార్జీలు మాత్రమే సరిపొను సొమ్ముఆ సమయం న  నా జోబులోవున్నాయి.ఈ సోమ్మును ప్రక్కనేవున్న నాసొదరునికి కాక మా నాన్నగారికే అందించా.అంతే వారికి నాకు మధ్య ఆర్ధిక ఋణానుబంధము తీరినట్లయినది. వారు జీవించి వుండగా వారికి ఇచ్చిన పెట్టిన ఆఖరి ద్రవ్యరూప ఖర్చు.వారు 20/02/2006 న నా చేయి పట్టుకొని,నాచేతిలోనే స్వర్గస్తులయినారు.


మాపెద్ద అక్కగారి వివాహము 1979లో మామేనత్తకొడుకుతో వివాహము అయినది. విధివశాత్తు వీరికి షుమారు 8 సం లు సంతానము కలుగలా. ఆతరువాత దైవకృపవలన ఒక ఆడశిశువు కలిగింది. ఈ పాపపేరు తేజస్వి. తేజస్వి మాగ్రామములోనె మా అమ్మగారి సంరక్షణలో పెద్దది అయినది.ఈ సమయములో నాకు బాగా మాలిమి, ముద్దు. తెజమ్మకూడా మామయ్య అంటే అంతే ఇష్టముగా వుండేది. ఈ పాపను నేను జామపండు అనే వాడిని అంత ఎర్రగా చక్కగావుండేది.


2003వ సoవత్సరములొ తేజస్వికి దాదాపు 15సం ల వయస్సు 10వ తరగతి చదువుతున్న సమయములో  అప్పటివరకు చక్కగా సన్నజాజితీగలా సలక్షణముగా వున్నపిల్ల అనారొగ్యమునకు గురి అయినది. ఎన్నిరకాల మందులు,ఎన్ని రకాలపరీక్షలు ఎంతమంది  డాక్టర్స్ వద్దకు తిరిగినా జబ్బుఎమిలేదు అనే సమాధానము.కానీ పిల్ల మాత్రము ఎండిపొయిన చెట్టులా మారిపొతుంది. ఆసమయములో ఓ ఉపాసకునిద్వారా ఈ పిల్ల పై క్షుద్ర శక్తి ప్రయోగము జరిగినది కారకులు వీరు ఇలా జరిగినది అని మొత్తము తెలిపినారు.కానీ ఆదుష్టశక్తిని పారద్రోలటము అతనివల్ల కాలేదు.ఆరోగ్య పరిస్థితికి డాక్టర్స్ సలహాలు మందులు వాడుతూ ప్రక్కప్రయత్నముగా ఈ దుష్టశక్తి పారాద్రోలేమార్గము అన్వేషించారు. అచ్చంపేట వద్ద ఆడవిలో ఎవరో మాంత్రికున్నాడు అంటే అక్కడకు వేళ్ళి  విషయముచెపితే అతను లాభములేదు మీరు ఇంకాముందు రావలసింది దుష్టశక్తి నరనరానప్రాకిపొయింది అన్నాడు.మందులు ఎమి పని చేయటములేదు షుమారు 5లక్షల రూపాయాలు పొయినా  పిల్ల ఆరొగ్యము నెమ్మది లేదు సరికదా ఇంకా విషమముగా తయారు అయినది.పగలు మొత్తము బాగానే వుంటది రాత్రి అయితే చాలు దుష్టశక్తి విజృంభించి ఎమి నన్ను పారద్రొలతారా మీవల్ల కాదు అని భీకర భయంకరంగా కేకలు వెసేది.అసలు అంత శక్తి అంత స్వరము ఎక్కడినుంచి వస్తున్నవో అర్ధముకావటములేదు.పిల్ల మరి నానాటికి తిసికట్టుగా మారుతుండటముతో పిల్లను నెల్లూరువద్ద వున్న జొన్నవాడలోని కామాక్షి దేవాలయములో కొన్ని రోజులు నిద్ర చెస్తే ఆరొగ్యము నిమ్మళిస్తుంది అని బ్రహ్మప్రయత్నముమీద పిల్లను జొన్నవాడకు తరలింపు.పిల్లకు తోడుగా మా అమ్మగారు. ఇరువురు అక్కడ ఒక గది తీసుకొని ఉన్నారు. రోజు దేవాలయానికి ముపొద్దులా దర్శనము, సేవ. పిల్లకు కొద్దిగా నెమ్మదించినట్లువున్నది.
                 
2003 ఆగష్ట్ 15వ తేదికు నేను, నాభార్య మహలక్ష్మి కలసి పిల్లను చూడాలని నిశ్చయంచుకున్నాము. ఆరోజు నాషాపునందు అర్ధరాత్రివరకు తప్పనిసరిగా వుండవల్సి వచ్చినది.ఇంటికిచేరు సరికి అర్ధరాత్రి 2గం.లు అయినది.మహాలక్ష్మి ఇంత రాత్రి అయినది మరలా 5గం.లకు రైలు మీరు ప్రయాణము చెయగలరా అని సందేహము. నేను సరేచుద్దాము అని తలవూపి నిద్రపొవటానికి పడక చేరా. నిద్రరాదు ఓకవేళ నిద్ర వచ్చిన ఎవరో చెంపఛళ్ళున చరచినట్లు అనూభూతి ఇది ఒక్కసారికాదు ఆరాత్రి పలుమార్లు అనుభవము అయినది.నాకు ఎమి అర్ధము కావటములేదు నాచుట్టూ ఎదో ఒక వాతావరణము తేడాగా వున్నది. సరే అని భగవధ్యానము చేస్తూ వున్నా అంతలోకి తెల్లవారుఝాము 4.30 అయినది. దీనితో వెంఠనే నేను తయారు అయి, మహాలక్ష్మి నేను ఇరువురము జొన్నవాడకు పినాకిని ద్వారా చేరాము. పిల్లను చూసా పిల్ల బావురమని మామయ్యాని నన్ను పట్టుకొని ఓక్కసారిగా ఎడ్చింది.చిన్నపిల్ల అంతబాధను సహనముగా భరిస్తున్న వున్న చిట్టితల్లి నన్ను చూడగానే ఓక్కసారిగా నిగ్రహాన్ని, దుఃఖాన్నికూడా ఆపుకొలేకపొయింది.వరదలా నేను తేజా కన్నీటిప్రవాహములో. మాఇద్దరి మధ్య ఎదో ఒక గాఢమయిన జన్మజన్మల సంబంధము.పాప నా కూతురుతో సమానము. ఇరువురకు ఆగని,ఆపని,ఆపుకొలేని వీపరీత దుఃఖము.కృత్యాదీఅవస్థమీద నిగ్రహించుకోని ఇరువురము సముదాయించుకొన్నము.అప్పటికి కొద్దిరోజులగా భోజనముచేయని పిల్ల నేను కొద్దిగానమ్మా అంటూ అలా అలా  చిన్న ముద్దలుకలిపి అన్నము పెడితే చిట్టితల్లి ఎదోకొద్దిగా తిన్నది.జాంపండూ అని దగ్గరకు తీసుకోని వోడిలో నిద్రబుచ్చితే నిద్రకూడాపొయినది. పాపనిద్రపొయిన తరువాత మా అమ్మగారిని విషయసేకరణచేస్తే ఆదుష్టశక్తి తగ్గలేదని రాత్రి అయితేచాలు విజృంభించుతున్నదని తెలిపారు.ఇలా కొద్దిసేపు గడిపినతరువాత నేను తిరుగు ప్రయాణము అయ్యా. ఆసమయములో పాపకు వందరూపాయల నోటుఇచ్చి అమ్మా ఎమన్నాకొనుక్కోతల్లి అని చెప్పి వదలలేక వదిలి వచ్చాను.అది నాకు పాపకు ఈజన్మకు ఆఖరి విడ్కోలుగా  మారింది అన్నసంగతినాకు ఆక్షణములో తెలియరాలేదు.      
         ఇంతలో సెప్టెంబర్ 2003 వచ్చింది.పాప ఆరొగ్యము తగ్గలేదు.ఈలోపు 18/09/2003న నేను వ్యాపార వొడిదొడుకులలొ భాగము,ప్రత్యర్ధుల కుట్ర ఫలితముగా చట్టపర అవరొధాలు.వీటిని ఏదుర్కొంటూ నేను వున్నా. అక్కడ పాప ఆరొగ్యము పూర్తిగా హీనాతిహీనమయిపొయినది.మాబావగారి ఇలవేలుపు రంగనాధస్వామి అని పాపను కనీసము ఒక్కసారి అన్నా నెల్లూరిలో వున్న రంగనాధస్వామి దేవస్థానానికి  తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తే  ఎన్ని చెసినా ఎంత చెసినా పాప  దేవాలయ ప్రాంగణానికికూడా రాలేదు.బలవంతముగా కొద్దిమంది ద్వారా తీసుకొనీ వస్తే దేవాలయప్రాంగణములోని గడప బయట ఓక్కసారిగా వెసుకున్న దుస్తులలొనే అశుద్ధమునకు గురీయినది.దీనితో తప్పనిసరి పరిస్థితులలో పాపను తీసుకోని వేనుకకుమరలారు.అక్కడ అలా విజయవాడలో నేను బాగా అంటే బాగ ఇబ్బందులలో.ఇది జరిగిన 5రోజులకు అనగా 23/09/2003న పాప అనంతవాయువులలో కలసిపొయినది.ఈ విషయము నాకు తెలవనివ్వలేదు. 24/05/2009 న పాపను మట్టి చేస్తూన్నారు. ఇక్కడ నేను విజయవాడలో అప్పటివరకు నిబ్బరముగావున్న వాడిని ఓక్కసారిగా దేనికో ఎందుకో చెప్పరాని చెప్పలేని దుఃఖవాతావరణము చుట్టుముట్టి విపరీతమయిన దుఃఖము పొగిలి పొగిలి ఏడుపు తన్నుకు వచ్చింది. నన్ను నేను నిభాయించుకొలెనంత ఏడుపు.నాకు కారణము తెలియటములేదు కాని ఏడుపు ఆగలేదు. చాలాసేపటికి తగ్గినది. ఆతరువాత నేను 4 రోజులకు ఇంటికి చేరాను.నెమ్మదిగా నాభార్య పాప ఇకలేదు అన్నవిషయము తెలిపినది.వెను వెంఠనే గుంటూరు వెళ్ళా పాప ఫొటో చూడగానే నా అంతరాలలో దాగివున్న ప్రేమ మరలా దుఃఖముగామారిపొయింది.                
ఇది మీరునమ్మినా నమ్మకున్నా నాస్వానుభవము.ఆనాటి నుంచి ఈ నాటివరకు తేజస్విని తలచుకుంటే చాలు విపరీత దుఃఖము నన్ను వెన్నాడుతూనే వున్నది. పొయిన బంగారాన్ని తీసుకురాలేక పాపకున్న ముద్దు పేరు అయిన 'జామపండు 'ను ఈ జన్మకు తినకూడదని నిశ్చయించుకున్నా. అది సుతా నేను నాభార్య ఈ నాటి వరకు జామపండుని తినము. ఆ రొజునుంచి జామపండు ఎప్పుడు కనిపించినా పిల్ల గుర్తుకు వస్తూనే వున్నది.ఇది పాపకు నానివాళి. పిల్లకు పెళ్ళిచేసి అత్తవారింటికి వెళుతుంటె చూసి  మేనమామగా ముచ్చటపడవలసినవాడిని కనీసము మట్టిచేస్తున్నా గుప్పెడు మట్టిచల్లేందుకు నొచుకోని ఆజన్మ పరివేదన,   పాపను దూరము చేసి దేవుడునాకు కానరాని శిక్ష వేశాడు. జొన్నవాడలో కొద్దిగా అన్నమునాచెతితో,కొద్దిసేపు నావోడిలోనిద్ర,ఒక వందరూపాయాలతో ఋణానుబంధము తీరిపొయింది.మరలా ఙ్ఞాపకాలలొతప్ప ఇంకేప్పుడు దర్శనము ఇవ్వని నా చిట్టి తల్లి జామపండుకి మరొక్కసారి నివాళి.

అమ్మా!జామపండూ నీ ఙ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే వున్నాయమ్మ ఇది రాస్తూంటే నీవు నాప్రక్కనే వున్నావు తల్లీ!మరల ఏజన్మలో ఎప్పుడొ ఎలానో కలవాలమ్మ ! అప్పటిదాక ఈ దుఃఖాన్నిభరిస్తూ, నీ రూపాన్ని ఙ్ఞాపకములో వుంచుకుంటాము.
ఇంత కన్నా భరిచలేనిది భరించరానిది నిత్యం ఈ నాటికి తన ఙ్ఞాపకాలతో  శోకము గుండెల్లో గూడుకట్టుకోని వున్నా మౌనముగా భారముగా విరాగిలా వున్న నాసోదరిని చూస్తే ఇంకోద్ది భయము.అమే ప్రశ్న ఓక్కటే "దేవుడు ఇవ్వక ఇవ్వక ఓక్కటే మంచి పండు ఇచ్చాడు అంతలోకి నావోడిలోని పండు లాకోన్నాడు " ఈ గర్భ శోకము భరింప రానిదిరా అంటుంది. నిజమే ఓకరిది ప్రారరబ్దం, ఇంకోకరిది విధిలిఖితం,నాది ఋణానుబంధం. అన్నిటికి ఒక్క సారిగా ఈశ్వరుడు లెక్క చెప్పాడు. కాని కాని .........??..??         

6 కామెంట్‌లు:

  1. చదివిన మాకే చాలా బాధగా, కన్నీళ్ళాపుకోలేని దుఃఖంగా ఉంటే అంత అనుబంధమున్న మీ పరిస్థితి!

    రిప్లయితొలగించండి
  2. గుండె బరువయింది. నయనం చెమర్చినది.
    కొన్ని బంధాలు విడదీయరాని అనుబంధాలు. రూపం లేకపోతేనేం!? జ్ఞాపకం సజీవంగా ,అది వేదనగా..
    ప్రాణం ఉన్న అక్షరాలూ చూసాను. :( .

    రిప్లయితొలగించండి
  3. చిలమకూరు గారు,
    వనజవనమాలి గారు,

    నమస్కారములు, పొస్ట్ చదివి మీ కామెంట్ రూపముగా మీ స్పందన తెలిపినందుకు ధన్య్వాదాలు.
    ఈ విషయ ఙ్ఞప్తికి వచ్చినప్పుడల్లా,జాంపండును చూసినప్పుడు మనస్సు బాధ పడుతుంది. కాని చేయ గలిగినది ఎమి లేదు.

    రిప్లయితొలగించండి
  4. పురాణపండ ఫణి గారు,
    యస్.యన్.కె.ర్ గారు.

    అదే జివితము. అందుకె దుఃఖం.
    చదివినందుకు,కామెంట్ తో మీ ఫిలింగ్స్ వ్యక్త పరచినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.