28, జూన్ 2012, గురువారం

కార్పోరేట్ విద్యాలయాల కొత్త మాయ - ఇంకో వల ప్రారంభం.



సాంప్రదాయంగా వ్యాపారం అంటే లాభం నకు వస్తువు ఇచ్చి డబ్బు సంపాదించేది అని భావన.
సేవలు కూడా వ్యాపారం లో చేరబడ్డాక అనేక కొత్త పద్ధతులు వ్యాపారం లో చేర్చబడ్డాయి.అలా౦టిదే విద్యాలయలు వాటిలోని వివిధ  సేవలు.
విద్య విజ్ఞానం నకు,జీవనమునకు అవసరమయినది.
విద్య మన దేశంలో తరతరాలు గా ఉచితం గా విద్యార్ధులకు అందించినా కాలక్రమేణ జీవితాల్లో అవసరాలు ప్రభుత్వాల స్వార్ధం నకు ఈ వ్యవస్థలో ప్రైవేటు వర్గాలు విద్యా సేవ ముసుగులో కార్పోరేట్ విద్యాలయాలు ఉరు వాడ అంతా ప్రారంభి౦చబడ్డాయి.వీటిల్లో నేటి కాలమునకు అవసరమయిన విద్యను,పోటి పరీక్షలకు కావలసిన సిద్ధం కావలసిన విద్యార్ధులకు ఆపద్ధతిలో విద్యను అ౦దిస్తు౦డటము తో ప్రజలు విస్తృతముగా ఆ విధానమునకు మొగ్గి కోట్లాది రూపాయల వ్యాపార అవకాశములు వు౦టముతొ  అనేక సంస్థలు ప్రవేసించి రకరకాల పద్ధతులకు తెర తీసాయి.ఓలంపియాడ్ పరిక్షలు, 6 th class lo start iit entrance కు కోచింగ్.
మరలా వీటిల్లో అనేక రకాల అక్రమాలు.
ఈ అక్రమాలపై వివరముగా వ్రాస్తాను.
ఈ నాటి పోస్ట్ యొక్క అంశము నకు వస్తాను.
మా బావమరిది పిల్లలు విశాఖలో శ్రీప్రకాష్ లో చదువుతున్నారు. ఈ మధ్య వాళ్ళ స్కూల్ డైరి పరిశీలిస్తే ఓ కొత్త విషయం ఆసక్తికరంగా వున్నది. అది ప్రతి విద్యార్ధి ఉదయపు ఉపాహారం నకు అవసరమయిన దిన వారి పట్టిక ఇచ్చారు.దాని ప్రకారము పిల్లలకు ఇంటి నుంచి పట్టికలోని ఆహార పదార్థాలు సిద్ధము చేసి పంపితే బ్రేక్ ఫాస్ట్ బెల్ సమయములో విద్యార్ధులందరు అవి స్వీకరించాలి.
ఈ ఉపహార పట్టిక ఈ క్రింది విధముగా వున్నది.
Monday             Bread,Jam  Banana
Tuesday             Idly / Chapathi   Nuts
Wednsday          Sponze cake, Oats  Sprouts
Thursday            Dosa / Chapathi  Palmgrove nuts
Friday                Milk bikis      Fruit Salad
Saturday            Poori / Chapathi   Veg Salad
ఇలా వున్నది. మామూలు గా చూస్తే ఇది పిల్లలందరికీ ఒకే ఆహారం, న్యూట్రిషన్ ప్రోగ్రాం సిద్ధం చేసామని స్కూల్ చెబుతుంది.
అంతా బాగున్నడానికి సందేహం ఏమిటా అనా? ఇటు వంటివి అన్ని మొదట ఉచితముగాను తదుపరి సేవలకు విలువ కడతాయి.మన వాళ్ళకు సొమ్ము పోయినా ఫరవాలేదు కాని సోకు మాత్రం కావాలి. ఇదే అవకాశం  కార్పోరేట్ విద్యాలయాలకు.
ఏముంది మీరు రోజు పిల్లలను పంపండి మేము ఈ ఆహారం సిద్ధం చేసి పెడతాము అంటారు.ఎలాగు మనవాళ్ళకు అర్ధరాత్రి వరకు టీవిలో సీరియల్స్ తో సరిపోతుంది కాబట్టి + స్టేటస్ సింబల్ కాబట్టి మహాఅర్జంట్ గా ఎంత సొమ్ము అయిన ఈ సేవకు చెల్లించటానికి సిద్ధం అవుతారు.స్కూల్  యాజమాన్యాలు ఏ కంపినిలకో అవుట్ సోర్సింగ్ ఇచ్చి సొమ్ము చేస్తాయి.సాధారణముగా సంవత్సరమునకు 220 రోజులు విద్యా దినాలు' వుంటాయి.సగటున విద్యార్ధి 195నుంచి 2౦౦ రోజుల వరకు హాజరు అవుతాడు.పిల్లవాడికి 25 రూ. చొప్పున 5౦౦౦ రూ. సగటున సంవత్సరమునకు ఖర్చు అయితే విద్యాలయాలు 1౦,౦౦౦ రూ ఛార్జ్ చేసినా విద్యార్థి కి 5000 లాభం.
ఇంత సొమ్మును వాళ్ళు వదులుకుంటారా! వల పడ్డది గా చేపలు కొద్దిగా ఆలస్యం అయితేనేమి.
ఇది ఒక వైపు. అసలు ఆ పట్టిక గమనించండి. మన ప్రాంతీయ ఆహారాలు రెండు రోజులు మరలా వాటికి ఎంపికలు ఇచ్చారు.వీళ్ళు ఏ అంతర్జాతీయ కంపెనీలకు దాసోహం. మనదైన ఆహరం కూడా మెల్లగా పిల్లలను దూరం చేసే ప్రక్రియ.విద్య ఇంగ్లీష్ ఆయనది,జీవనం సగానికి పైగా విదేశి సరళికి వచ్చింది.పిజ్జాలు,బర్గర్లు సాయంత్రం పూట నుంచి ఇలాంటి స్కూల్లో పిల్లలకు అలవాటు అయితే నిత్యం సదా అవే అవుతాయి.సాంస్కృతిక దాడి అయిపోయినది.ఇప్పుడు ఆహార దాడి జరుగుతుంది.మనం ఏమి చేయలేమా? అధికారులు,ప్రభుత్వాలు  వ్యవస్థలోని అన్ని అంగాలు  డబ్బు వున్నవాడి కాపలా కుక్కగా మారిపోయాయి.


ఇంటర్లో సత్యనారాయణ అనే స్నేహితుడుకు రోజుకు ఒక్కపూట మాత్రమే ఆహరం లభించేది,అతనికి ఒక్కటే జత దుస్తులు అయన చదవాలి అన్న తన కోరికను బలీయంగా ఉండటం చేత చక్కగా చదువుకున్నాడు.


బాధాకరమయిన విషయం ఏమిటి అంటే ప్రభత్వ విద్యాలయాల్లో ఉచిత పుస్తకాలు,యూనిఫారం,ఉచిత విద్య తో పాటు మధాహ్నం భోజన పధకం అమలు లో వున్నా నిరుపేదలు కూడా చేరటం లేదు.
కాని ప్రభుత్వాలు విద్యా సెస్స్ పేరిట వేల కోట్ల రూపాయలు వసుల్ చేస్తున్నాయి.ప్రైవేట్ విద్యాలయాలు ఫీజు ల పేరిట సొమ్ము చేసుకు౦టున్నాయి.ప్రభుత్వం,ప్రైవేట్ సంస్థలు ఉభయులు కలసి ప్రజలనే దోచు కుంటున్నాయి. 





6 కామెంట్‌లు:

  1. చాలా మంచి విషయం దృష్టికి తెచ్చారు. వ్యాపారం కి కాదేది అనర్హం.
    విద్యార్దుల ఆరోగ్యంతో ఆటలాడుకునే మెనూ..కూడా అది.
    కొంతమంది అయినా ఈ పోస్ట్ చదివి ఆలోచిస్తారు.

    రిప్లయితొలగించండి
  2. I too wish some people would change but I doubt. My cousins complain abt corporate schools but still they keep their kids there only, though they are govt. Teachers. This is usual situation in andhra atleast. Everybody agree with the fact that this generation will end up as machines but they consider themselves as part of the system. I really pity this situation. I should see how I will behave when my daughter needs to go to school. I hope I will not put her into this unhealthy race. Wish me good luck.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. mmd గారు, మీకు శుభాకాంక్షలు.ప్రతి వ్యక్తి పరుగులో ముందల వుండాలనే తొందర ఆశ.ఈ పరుగులో తమ జీవితాలు తమ పిల్లల జీవితాలు పణంగా పెడుతున్నామని తెలిసినా బంధువుల్లో గౌరవాలు,ప్రక్కవారి వద్దా డాబులు ఇలా అనేకం కలసి వ్యవస్థను గందరగోళం చేస్తున్నారు.మన పిల్లవాడిని మామూలు స్కూల్ లో చేరిస్తే అవమానమని రకరకాల కారణాలు.అలాగే ప్రతి వాడికి లక్షల జీతాలపై ఆశ.

      తొలగించండి
  3. చాలా బాగా వ్రాసారు. ఇక్కడ ట్రెండ్ వారంలో ఒకరోజు ఏదో డే అని పెడతారు - ఉదా. పింక్ డే. ఆ రోజు విద్యార్ధులు అన్నీ పింక్ కలరే వేసుకోవాలి, పుస్తకాల సంచికూడా పింక్ కలరే ఉండాలి, బూట్లు ఆఖరికి టిఫిన్ కూడా! అలా అని సంవత్సరానికి ఈ రంగు ఒకరోజే ఉంటుంది. ఆరోజుకు ఇవన్నీ కొనాలంటే తడిసి మోపెడవుతుంది. ఇలాంటివి ఎన్ని శనివారాలొస్తాయో !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిల్లలకు కూడా వస్తు వ్యామోహాన్ని అలవాటు చేసే ప్రక్రియ.వూరకే అంత సొమ్ము మేము ఖర్చు పెట్టం అని నలుగురు తల్లితండ్రులతో కలసి అడగాలి కాని మధ్య తరగతి మనస్తత్వం,పిల్లలపై అనురాగం భరించి,సహించటానికి అలవాటు చేస్తాయి.

      తొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.