31, మే 2012, గురువారం

రాముని వనవాసకాలము - గోవిందరాజీయము అనుసరించి - వనవాసమునుంచి పట్టాభిషేకము దాక దినచర్య.


గొవిందరాజియము ఉత్తరప్రాంత గ్రంధము అందువలన తిధి,నక్షత్రాలు వారి ఆచారము ప్రకారము వుంటాయి.వారిది బార్హస్పత్యమానము మనది చాంద్రమానము. మనకన్నా వారు 30 రోజులు ముందు వుంటారు. ఇది గమనించగలరు. పొస్ట్ నందు వున్న తిధులు ఉత్తరాది గ్రంధము. ప్రకారము వున్నాయి



1వ రోజున చైత్ర శుద్ధ దశమినాడు వనవాసప్రయాణము.రాత్రి తమసాతీర వాసము.
2వ రోజున జాహ్నవీ తీరవాసము - గుహుని రాక.
3వ రోజున గంగాదక్షిణ తీర తరువు క్రింద వుండుట.
4వ రోజున ప్రయాగలో వుండుట,భరద్వాజ దర్శనము.
5వ రోజున యమునాతీర వాసము,చిత్రకూట ప్రవెశము.
6వ రొజున  సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చుట,రాత్రికి దశరధుని మృత్యువు.
7వ రొజున కౌసల్యాదుల విలాపము భరతునికై దూతలను పంపుట.
8వ రొజునుండి 12వ రోజువరకు భరతుని అయోధ్యా ప్రయాణము.
13వరొజున పౌరలౌకిక కర్మ.
14వరొజున నుండి 17వ రోజువరకు వనమార్గము బాగు చేయుట.
18వరొజునుండి 20వ రోజువరకు భరతుని వన ప్రయాణము.
21వరొజూనుండి 23వరోజువరకు భరతుడు రాముని వద్ద నుండుట.
24వరోజునుండి 27వ రొజూవరకు భరతుడు అయోధ్యకు పాదుకలతో వచ్చుట.
45వ రొజున పాదుకా పట్టాభిషేకము.    

శ్రీరాముడు చిత్రకూటమున పదిన్నర మాసములుండెను.మొదటి సంవత్సరము ఇట్లు గడిచెను.పిదప చిత్రకూటము విడచి దండాకారణ్యమున ప్రవేశించి ఋషుల ఆశ్రమములను చూచుచూ గడిపినవి 10సంవత్సరములు.పిదప పంచవటిలో ఓకటిన్నరసంవత్సరములు గడిపేను.ఈ విధముగా 12.5 సంవత్సరములు పూర్తి అయ్యెను.13వ సంవత్సరము కొంచము మిగిలి వుందనగా మాఘశుద్ధ అష్టమినాడు విందము అన్న ముహుర్తములో రావణుడు సీతను అపహరించినాడు. 
* జ్యేష్ట శుద్ధ పౌర్ణమి వాలి వధ.
* కార్తీక్ శుక్ల పాడ్యమి వరకు సుగ్రీవ పట్టాభిషేకము.
* 4మాసములు వర్షాకాలము సీతా అన్వేషణ జరుగలేదు.
* కార్తీకము చివర లక్ష్మణ ఆగ్రహము, అక్కడి నుండి మార్గ శిర్షము వరకు సీతాన్వేషణ. 
* హనుమంతుడు మార్గశిర శుద్ధ ఏకాదశిన లంకా ప్రవేశము.అర్ధరాత్రిన సీతా దర్శనము.
* ద్వాదశినాడు వృక్షము పైనుంచి రావణుని చూడటము.సీతతో సంభాషణ.
* త్రయోదశీనాడు అక్షాది వధ.
* చతుర్దశినాడు లంకా దహనము.
* మరలా వానరులతో కలయకకు 5 రోజులు.
* మార్గశిర శుక్ల షష్టినాడు మధువన భంజనము.
* అష్టమినాడు ఉత్తర నక్షత్రమున విజయాఖ్య ముహుర్తమున రామ దండు ప్రస్థానము.
* పుష్య పాడ్యమికి సముద్ర తీరమునకు చేరుట.
* పుష్య శుక్ల చవితీకి విభిషుణుడు రాక.
* పంచమికి సముద్రముదాటుటకై అలోచన
* పిదప 4 దినములు సముద్రుని రాముడు ప్రార్ధించుట,ప్రాయోప్రవేశమునకు యత్నము.
* దశమికి సేతుబంధన ప్రారంభము.
* త్రయోదశికి సేతుబంధనము పూర్తి. 
* చతుర్దశికి రాముడు సువేలగిరిని నెక్కుట.
* పుష్య పౌర్ణమి నుండి బహుళ విదియ వరకు సైన్యము దాటుట.
* తదియ నుండి దశమివరకు సేనా నివేశము
* ఏకాదశిన రావణ అదేశముపై శుకసారణులు వచ్చి రామసేనను చూచుట.
* ద్వాదశి వానరసేన గణనము
* అమావాస్య రాక్షసేన గణనము.
* మాఘ శుద్ధ పాడ్యమి అంగద రాయభారము.
* విదియ నుండి అష్టమి వరకు వానర రాక్షస యుద్ధము.
* నవమిరాత్రి ఇంద్రజిత్ నాగాస్త్రముచే రామలక్ష్మణులను బంధించుట.
* దశమీ గరుత్మంతుని ఆగమనము నాగపాశవిమోచనము.
* ఏకాదశి,ద్వాదశిలలొ ధుమ్రాక్షవధ,
* త్రయోదశినాడు అకంపన వధ.
* చతుర్దశినుండి బహుళ పాడ్యమి వరకు యుద్ధము నీలుడు ప్రహస్తుని చంపుట,రాముడు రావణుని మకుటభంగము.
 * పంచమి నుంచి చతుర్దశివరకు కుంభకర్ణునితో యుద్ధము.
* అమావాస్య యుద్ధ విరామము.
* ఫాల్గుణ పాడ్యమి నుంచి చవితివరకు నరాంతక వధ.
* పంచమి నుంచి సప్తమి వరకు అతికాయుని వధ.
* అష్టమి నుంచి ద్వాదశి వరకు కుంభ,నికుంభుల వధ.
* పిదప మూడురొజులు మకరాక్షవధ.
* ఫాల్గున శుద్ధ విదియ ఇంద్రజిత్ యుద్ధము.
* తదియనుంచి సప్తమి వరకు యుద్ధ విరామము.
* త్రయోదశినాడు ఇంద్రజిత్ వధ.
* చతుర్దశి యుద్ధ విరామము.
* ఫాల్గున అమావాస్య రావణుని యుద్ధ యాత్ర.
* చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి రామ రావణ యుద్ధము.
* నవమి రావణపలాయనము.లక్ష్మణ మూర్చ సంజీవిని తెచ్చుట.
* దశమి యుద్ధ విరామము.

* ఏకాదశి ఇంద్రుడు రామునకు రధము పంపుట.
* ద్వాదశినుంచి బహుళ చతుర్దశి వరకు 18 రోజులు రామ రావణ యుద్ధము.
* చతుర్దశి రావణ వధ.
* అమావాస్య రావణునికి సంస్కారము.
* మొత్తము 18రోజుల విరామము,72 రోజుల యుద్ధము.
* వైశాఖ శుద్ధ పాడ్యమి విభీషుణుని పట్టాభిషేకము.
* తదీయ సీత అగ్నీ ప్రవేశము.
* చవితీ పుష్పక విమానము ఎక్కి భరద్వాజ ఆశ్రమమునకు రాక.
* షష్టి నంది గ్రామములో భరతుని కలియుట.
* వైశాఖ శుద్ధ నవమి శ్రీరామ పట్టాభిషేకము.



    


30, మే 2012, బుధవారం

రామునికి సీత ఏమవుతుంది? ఇది హనుమంతునికి ఉదయంచిన ప్రశ్న? - వివరణ.


సాధరణముగా మన జీవనములో అన్నీ,అంతా వివరముగా చెప్పినా, మొత్తము విన్నతరువాత మూలము గురించి ఎవరైనా సందేహంగా ఆడిగితే ఇదిగో ఇలా అంటారు రామాయణమంతా విని రాముడుకు సీత ఎమవుతుంది ? అన్నాడు అని వేళాకోళము చేస్తారు.కానీ అచంచల రామభక్తుడు , సీత అన్వేషణ జరిపిన వాడు హనుమంతుడు ఇలా అంటే మనము ఆశ్చర్యపొతాము.ఈ ప్రశ్నకు మనము అర్ధము తెలుసుకుంటే రామయణ పరమార్ధము మనకు కరతలామలకమే.
సీతా అన్వేషణకై హనుమంతుడు లంకలోకి అడుగు పెట్టాడు.లంకనందు తీవ్రాతితీవ్రమయిన అన్వేషణ జరిపి పరీశీలన మీద సీత ఆశొకవనములో దర్శనము. ఏలా? ఇలా! 

సీతా రాములకు అన్నివిషయాలలొ సామ్యము,సారూప్యము,ఏకత్వము వున్నది.అశోకవనములొ సీతాదేవి రూపలావణ్యము చూసి హనుమంతుడు నివ్వెరపొతాడు. అమే అతిలోక సుందరి అయినందుకు కాదు; అమె అంగాంగసౌష్ఠవములో  ముమ్ముర్తులా రామచంద్రమూర్తి మొక్కట్లు మూసపొసినట్లు కనిపించటమువలన. 
 సామన్యముగా తల్లి పిల్లలు,తండ్రి బిడ్డలు,అన్నదమ్ములు,అక్కచెల్లెండ్లు,మేనమామ బిడ్డలు మేనత్తల పిల్లలు ఒక రూపున ఉండుట సహజము. కాని భార్య భర్తలు ఒకేరూపున ఉండటము చాలా అరుదు.సీతారాములది దగ్గరి సంబంధము కూడాకాదు. అక్కడ రామయ్యను చూసి ఇక్కడ సీతమ్మను చూస్తే అతడే స్త్రీ రూపములో ఇక్కడ ఉన్నట్టు గమనించిన హనుమంతుడు  మనస్సులో ఇలా అనుకుంటాడు:"అస్యా దేవ్యా యధారూపం - అంగప్రత్యంగ సౌష్టవము, రామస్య చ యధారూపం తస్యేయ మసితేక్షణా."  అన్ని అవే పోలికలు, ఏ అవయవము చూసినా ఆ రూపానికి ఇది ప్రతిరూపములా వున్నది తప్ప వేరుకాదు.
    ఇది ఎలా సాధ్యమయింది? ఇదే రామయణములోని అద్వైత రససిద్ధి. సీతారాములకు రూపములొనే కాదు గుణగణాల్లో,ఆలోచనల్లొ,ఆనందములో.ఆవేదనలో అన్నిటా ఏకత్వమే దేనిలోకూడా వ్యత్యాసములేదు."అస్యా దెవ్యా మనస్తస్మిన్ - తస్య చాస్యం ప్రతిష్ఠితం" అమే మనస్సు ఆయనలో లీనమయినట్లుగానే ఆయన మనస్సులో అమే లయించి ఉన్నదట. 
ఇలా ఒకరికొకరు బింబ ప్రతిబింబముగా ఉన్న సీతారాముల ఆత్మమనశ్శరీర సామరస్యాన్ని చూసిన హనుమంతుడు స్థంభించిపోతాడు.అలాంటి మనస్థితిలో హనుమంతుడులాంటి బుద్ధిమంతుడే అనుకొని వుంటాడు.ఇక మనలాంటి పామరులు ప్రశ్నించటములొ పొరపాటులేదు.   

సీతారాముల మధ్యగల అన్యొన్యతను,అభిన్నతను,అనుబంధాన్ని అక్షరరూపములో నిరూపించటమే "రామయణ" పరమావధి. శ్రీరాముడు పరామాత్మస్వరూపుడయితే సీతాదేవి పరామాత్మయందలి పరమ కళ. ఈ కళ ముల్లొకాలకుకూడా మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.

29, మే 2012, మంగళవారం

చారల చొక్కా నారా లోకేష్


ఈ ఫొటో లోని వ్యక్తి అందరికి తెలిసిన వారే నారాలొకేష్.చంద్రబాబు ముద్దుల కోడుకు,బాలయ్య ముద్దుల అల్లుడు.

ఈ ఫొటో నిన్న నందమూరితారకరాముని జయంతి సందర్భముగా ఘాట్ వద్ద తీసిన ఫోటో. లోకెష్ చారాల షర్ట్ ధరించి రావటము అక్కడ వున్నవారు మనవాడు జగన్ లా ఇమిటెట్ చేస్తున్నాడు అని అనుకున్నారంటా.  చంద్రబాబు ఇమిటెట్ పధకాలే కాకుండా షర్ట్ లు కూడా ఇమిటేట్ చేయించి వాళ్ళ అబ్బాయిని ముందుకు తీసికెళ్ళలని నిశ్చయంచినట్లున్నాడు.ఎది ఎమైనా బాబు గ్రేట్ చాలాచక్కగా పకడబ్బందిగా అన్ని పనులు చెస్తాడు. జూనీయర్ ని దూరంగా పెట్టి తన తమ్ముడికోడుకుని ప్రొత్సాహిస్తున్నాడు. రాజకీయములో యువతరము గేటప్ ను కోడుకు వేయించుతున్నాడు. చూద్దాము ఎవరు విన్నొ ......
   

"సీతాయన్" సీత కొణమునుంచి సీతారాముల కధ.






రామాయణము జాతిజీవనములో ఓకభాగముగా మారిపొయింది.వాల్మీకి రామాయాణాన్ని మొదటగా సృజించితే తదనంతరము అనేక వందలమంది అనేక వందల భాషలలో వారి వారి ఆచారములు,స్థానిక సాంప్రదాయాలు కూడా ప్రక్షేపించారు.ఇందుకు కారణము రాముడు తమవాడు,తాము రామునివారము అన్నభావన.
ఇలా "సీతయాన్" అన్నగ్రంధములొని కొన్ని విషయాలు మీకు పరిచయము చేస్తాను.ఇది బీహార్,నేపాలు ప్రాంతాల్లో  వాడుకలో వున్న  గ్రంధము. మీరు పేరు బట్టే గ్రహించి వుంటారు ఇది సీతకొణము నుంచి రాసిన గ్రంధము.ఈ గ్రంధములో సీతకే ప్రాధాన్యము.కధ రావణగాధతో ప్రారంభము అవుతుంది.
   ఇతరరాజ్యలలొని అరణ్యాల నుంచి తన రాజ్యములొని అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్న ఋషులపై రావణుడు పన్ను విధిస్తాడు. ఈ శుల్క సంగ్రహణార్ధము శుల్కగ్రాహకులు ఋషులవద్దకు పొయినప్పుడు వారు కృద్దులై "సుంకముగా చెల్లించటానికి మా వద్ద ఏమున్నది? శుష్కించిన మా శరీరాలలో మాంసం కూడాలేదు ఈ రక్తం తప్ప" అని తమ శరీరాలనుండి తీసిన రుధిరాన్ని ఒక ఘటములో నింపి వాసెనకట్టి వారికి ఇచ్చి ఈ ఘటములొని శోణితాన్ని  రావణుడు దర్శించగానే, ఆతనికి, ఆతని పాలితమయిన లంకకు వినాశము ప్రారంభము అవుతుందని శపిస్తారు.    
అధికారులు ఈ ఘటము తీసుకుని రావణుని సంక్షములో వుంచి వృత్తాంతము మొత్తము వివరముగా తెలుపుతారు. ఇది విన్న రావణుడు భయ,సందిగ్దావస్తలకు లోనయి మంత్రిపురోహితులను సంప్రదిస్తాడు.వారు ఆభాండాన్ని భూస్థాపితం చేయమని సలహ ఇస్తారు. అయితే దీనిని ఎక్కడ నిక్షిప్తము చేయాలన్న ప్రశ్న ఉదయించగా, పూర్వము శంకరుని కొలువులో జనకునివలన తను అవమానితుడు  అయ్యాడు, అందుచేత ఆపగ తీర్చుకొవాలని జనకుని రాజ్యములొని పుణ్యకారణ్యములో ఆఘటాన్ని భూస్థాపితం చేయాలని నిర్ణయించుకొని ఆవిధముగా జరుపుతాడు.   కానీ ఈ శొణిత ప్రభావము వల్లకాని, కాలప్రభావము వల్లకాని పుష్కరకాలము జనకుని రాజ్యము మొత్తము అనావృష్టి పీడితమయి దుర్భిక్షముతో అల్లాడిపొయి జనకుని శరణువేడగా జనకుడు మంత్రిపురొహితాదుల సలహాతో యఙ్ఞం చేస్తాడు.యఙ్ఞానంతరం యాగకర్త భూమిని దున్నాలి.అందుకై పుణ్యకారణ్యములొని స్థలము నిర్దేశించబడుతుంది.జనకుడు బంగారు నాగలితో భూమిని దున్నుతుంటే రాక్షసులు భూస్థాపితము చేసిన రక్తభాండము ఆనాగేటి చాలుకు తగిలి అది విచ్ఛన్నమయిపొగా, ఆ భాండమునుంచి అష్టదళ మధ్యంలో రత్నఖచిత సింహాసనరూఢయై సర్వదేవతాపరివృతమయి దిగ్గజాలు రత్నఘటాలతో అమృతజలాలు అభిషేకిస్తుండగా అణిమాది  అష్టయిశ్వర్యసిద్ధులతో కామధేనువు జయాద్యప్సరసలు కొలువగా సూర్యచంద్రులు మణిదీపాలై ప్రాకాశిస్తుంటే తుంబుర నారదులు కీర్తీగానం చేస్తుండగా పద్మాసనాసీనయై కల్పతరుమూలంలొ భృగ్వాదీఋషులు కొలవగా చతుర్బాహువులతో వీరలక్ష్మీదేవి ఆవిర్భవించినది.వెంటనే కుంభవృష్టిగా వర్షం మొదలయింది. ఋషులంతా ఆదేవిని స్తొత్రము చేయగా జనకుడు భక్తీపారవశ్యముతో అమెను స్తుతిస్తాడు.వీరలక్ష్మీదేవి ప్రసన్నయై వరము కొరుకొమనగా  అతడు తల్లీ! నీవు పసిపాపవై నా ఒడిలో లాలింపబడాలని కొరగా అమే వల్లెయని పసిపాపయై రొదిస్తుంటే జనకుడు అక్కునచేర్చుకుని తన రాణి సునందకు అప్పగిస్తాడు.అమే సీత.  
       
    ఇదే గ్రంధములో సీత అశోకవనములో వున్నప్పుడు ఒకానోక సంధర్భములో ఇలా పలుకుతుంది" ఓరీ నేను ఏవరనుకుంటున్నావు మహాశక్తిని,దుర్బలనారియనినుకోకు. భైరవి రూపధారిణినై నీపై విరుచకపడి దంతాలతో నీ దశముఖాలని, చీల్చిచెండాడుతాను.చండికనై నీ రక్తంతో దాహం తీర్చుకుంటాను.కనుక ప్రళయకాలరూపిణి అయిన ఈ సీతనుండి భయపడి దూరంగాపో.నేను అగ్ని గర్భను నన్నంటిన వారు అగ్ని జ్వాలలోభస్మమయి పొతారు అని వీర గర్జన చేస్తుంది.

28, మే 2012, సోమవారం

విఠలా! విఠలా! జయ పాండురంగ ప్రభు విఠలా! పండరీనాధ జయ విఠలా!




ప్రస్తుత తర యువజనులకు మహారాష్ట్ర అంటే షిరిడి, బొంబాయి తప్ప మరి ఏమి గుర్తుకు రానంతగా పరిస్థితి వున్నది. శాలివాహనుడు  ఈ ఆంధ్రరాజ్యాన్ని పాలించాడని,  అతని ముఖ్యపట్టణము ప్రతిష్టానపురమని దాని ప్రస్తుత నామము పైఠాన్,ఇది కూదా షిరిడి కి దగ్గర   అని ఎంతమంది తెలుసు.ఇకపొతే మనకు వారికి అచారవ్యవహారాలలో చాలాదగ్గర తనము వుంది.మనలాగే వారిది చాంద్రమానమే.అలాగే మనము గొవింద భక్తులము, వారు విఠలుని భక్తులు.ఈ విఠలుడు పండరీపురములో వుండుటవలన,భక్త పుండరీకుని అనుగ్రహించటమువలన పాండురంగవిఠలునిగా ప్రచారము. విఠలుడు,రుక్మిణి సమేతుడై చంద్రభాగా నది ఒడ్డున వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.అనుగ్రహము అంటే మాములు అనుగ్రహము కాదు ఎందరికో సశరీరదర్శన భాగ్యము,మోక్ష భాగ్యమిచ్చి జన్మరాహిత్యము చేసిన లీలారూపుడు.ఈ విఠలుని ప్రస్తుస్తించుతు మరాఠిలో భక్తులు చేసిన కృతులపేరు అభంగాలు అని పేరు.  ఈ అభంగాలు వారి జనజీవనములొ ఒక భాగమయ్యాయింటే అతిశయోక్తికాదు. ఈ అభంగాలన్ని ఎవరొ ఓకరు కృతి చేసినవి కావు అనేకమంది భక్తులు వివిధకాలాల్లొ బాల,స్త్రీ,పురుష,కుల మత ప్రసక్తి లేకుండా చేసినవి.ఈ భక్తులను అనుసరించి కాలగమనములో వర్కారి సాంప్రదాయము అని ఏర్పడింది.
    దాదాపు మనకు పాండురంగ భక్తులంటే తుకారాం,సక్కుబాయిలు మాత్రమే తెలుసు కాని ఇంక ఎందరొ మహానుభావులు వున్నారు.వారు ఙ్ఞానేశ్వర్(ఙ్ఞానదేవ్),సంత్ నామదేవ్,జనాబాయి,సవతిమాలి,చోఖామేళా,నరహరి సొనార్,గోరా కుంభార్,రాకా కుంభార్,సంత్ జీ పవార్,జగమిత్ర నాగ,సేన నహ్వీ, కనహొ పాత్ర,భానుదాస్,జనార్ధన స్వామి,సంత్ ఏకనాధ్,మంకోజీ బోద్లే, సంత్ తుకారాం,సమర్ధ రామదాస్ స్వామి,లతిబ్ షా, షేక్ మహమ్మద్,సక్కుబాయి,నీలోబా మక్సారే వీరందరు గణుతికెక్కిన భక్తులు. ఇంకా ఆశ్చర్యకరమయిన విషయము బ్రిటిష్ కాలములో వీరి మహిమలు,వీరి జీవనము రికార్డులలోకలవు.వీరందరి కాలము 1250 నుంచి 1650 మధ్య వున్న 400 సంవత్సరాలలో వీరందరు ప్రభవించారు.  
    ఇక వర్కారి సాంప్రదాయమంటే. దాదాపు మన పండరీభజన మీకు తెలిస్తే అలాంటిదే కాకపొతే ఆప్రాంతములో చాలాబాగా చేస్తారు.ఆషాడ శుద్ధ ఏకాదశీ నాడు, కార్తీక శుద్ధ ఏకాదశీనాడు భక్తులతో పండరీ పురము కిటకిటలాడుతుంటుంది.రఖమాయి సహిత విఠలుని కొలిచేవారిని వర్కారిలు అని అంటారు. తులసి మాల, చందనములతో దిక్షగా నెలకొసారొ,ఏడాదికి ఓకసారో పండరీపురం తీర్ధయాత్ర చేస్తారు.ఈ యత్రను వర్కారి యాత్ర అని వాడుక.  
ఇంతటి మహిమగల భక్తుల చరిత్రలు,మహిమలు,పద్ధతులను మన కళ్ళకు కట్టినట్లు వివరించారు రామకృష్ణ మఠము వారు వారి పుస్తకము "జయ పాండురంగ విఠలా!" నందు. ఈ పుస్తకము ఆంగ్లము నందు ది సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర గా కూడా కలదు.ఇంగ్లీష్ బుక్ భారతీయ విద్యా భవన్ వారిది గమనించండి.

ఈ పాండురంగని మీచే స్మరణ  చేయటాని కారణము  నా పితృదేవులు కీ.శే. శ్రీ ఆలపాటి పాండురంగారావు గారు.వారు ఈ ఉదయము స్మరణకు వచ్చారు వారి కృపవల్లనే ఈ నాలుగు ముక్కలు వ్రాయగలిగాను.
 వారు నేర్పిన పద్ధతులు,చూపిన బాట నాకు సదా అచారణీయము. సదా వారీ ఆశ్వీరవాదాలు కొరుకుంటూ... 

27, మే 2012, ఆదివారం

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ



అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

పై పద్యము తెలియని దుర్గ భక్తులు వుండరు. ఇది భాగవతములోనిది. పోతన గారి కృతి.ఈ పద్యములో నేను గమనించిన అంతరార్ధము మీకు వివరించుదామని ఈ చిన్న ప్రయత్నము.



అసలు అమ్మ అంటే మాములు మానవుడికే ప్రాణము,అభిమానము. మరి ఈ జగత్ కే సర్వ రూప ధారిణి అయిన దుర్గ అంటే ఇంకేంత. దుర్గమమైన మహిషాసురుని దునుమాడుటకు ఆవతరించిన రూపము దుర్గ. మనిషిలోని మహిష ప్రవృత్తి అనగా పశుప్రవృత్తి తో రాక్షస సమానుడు అవుతున్నాడు. మరి ఇంతటి ప్రవృత్తిని వదలటము అంటే దుర్గమము కాబట్టి మీరు దుర్గను ఆశ్రయించండి.అమే అమ్మలా మీకు అన్నికాలాల్లో మహత్త్వ,కవిత్వ,పటుత్వ,సంపదల్. మహత్త్వ ఈ పదానికి అర్థము దైవ సంభంధమయిన  మోక్ష, అనుగ్రహ లాంటి ఫలితాలు. కవిత్వ ఈ పదానికి సకలవిద్యలు , పటుత్వ ఈ పదానికి అర్ధము ఈ దేహానికి శారీరక సంపూర్ణ ఆరొగ్యము, సంపదల్ ఈ పదానికి అర్ధము అష్ట ఐశ్వర్యాలు  సమకూర్చగలదని. ఎలా ఓక శిశువుకు తల్లి ఎలా సమస్తము తాను ఆయి వ్యక్తుడిగా తీర్చి దిద్దుతుందో అలా. అందుకే ఈ పద్యములో "అమ్మ" అన్న పదము 12 సార్లు పునరావృతమయినది.                
మరి ఈ 12 ఏమిటి అంటే, ఈ 12 భచక్రము లొ గల రాశులకు సంకేతము.అనగా సకల సృష్టి తన ఆధినములొ వున్నదని తనను ఆశ్రయించినవారిని తల్లిలా కాపాడతానని మనకు అభయము.

పై పద్యము తెలియని దుర్గ భక్తులు వుండరు. ఇది భాగవతములోనిది. పోతన గారి కృతి.ఈ పద్యములో నేను గమనించిన అంతరార్ధము మీకు వివరించుదామని ఈ చిన్న ప్రయత్నము.

26, మే 2012, శనివారం

శ్రీ కృష్ణ శతకము లొని - హరి అను రెండు అక్షరముల....





 మన తెనుగు భాషకు గల విలక్షణతల్లో పద్యం ఓకటి.
 దాదాపు ఈ ప్రక్రియ తెనుగులో వున్నంత విశేషత ఇంకో భాషలో కానరాదు.అలాంటి పద్యాలని 108 వున్న వాటిని శతకమని అంటారని మీరు ఎరిగనదే. ఈ శతక పద్యం నందు దాదాపు 4 పాదాలు కలిగి, సాధారణముగా ఎదో ఒక మకుటము కలిగి వుంటాయి.సుమతి,వేమన,భాస్కర,దాశరధి,నరసింహ,శ్రీకృష్ణ మొదలగునవి.ఈ పద్యాల్లో నీతి,భక్తీ ఇలా అనేక విషయాలు కలిగి వున్నాయి. పూర్వ కాలములో ఖచ్చితముగా ప్రతి విద్యార్ధి ఈశతకాలని సాధనతో అన్ని పద్యాలని ధారణచేసే శక్తి కలిగి వుండేవారు.
కాలము మారింది. జీవితాల్లోకి ఆంగ్లము చొచ్చుకొచ్చిన తరువాత వాడుక భాషగా తెనుగు మిగిలింది కాని సాధన భాషగా తెనుగు బాగా తగ్గిపొయినది.                    

కానీ దీనివల్ల అచార సంస్కృతిల్లో మార్పులు, అనుచానముగా వస్తున్న విషయాల్లో అంతరార్ధముగా వున్న నీతి గాని ఇంకేమైనా గాని తెలుసుకునే అవకాశము, తరువాత తరమునకు అందించాలనే అపేక్ష కొరవడినందువల్ల వచ్చిన విపరిణామల్లో ఇది ఓకటి.



ఇక విషయానికి వస్తే ఇక్కడ ఓక పద్యాన్ని పరిచయము చేయాలని అనుకుంటున్నా, ఇది కృష్ణ శతకములోనిది దాదాపు అందరికి తెలిసినదే కాకపొతే ఇందు దాగి వున్న అంతరార్ధాన్ని బుధజనుల ముందుకు తీసుకొని రావటమే.    

హరియను రెండక్షరములు
హరియించును పాతకంబు నంబుజనాభా !
హరి నీ నామమహత్యము
హరి హరి పొగడంగ తరమె హరి శ్రీ కృష్ణా


హరి అన్న రెండు అక్షరములతో సకల పాపములు హారాయించును అన్నది భావము. వదిలించుకొలేని లక్షణాలే పాతకాలుగా మారి మనలను జన్మ,మరుజన్మ ఇలా చక్ర భంధములో వుంచుతున్నాయి. అవి ఏవి కామ,క్రొధ,లోభ,మొహ,మద,మత్సరాలనేవి ఆరింటిని జీవుడు జయంచనంతకాలము ఇలా జరుగుతూనే వుంటది. మరి మానవుని కింకర్తవ్యము ? అందుకే "హరి" ని ఆశ్రయించి హారి నామ స్మరణతో ఈ పాతాకాలను హరాయించుకోవటమే. ఇంకా ఇక్కడ శతక కారుడు తనచాతుర్యము కూడా బాగా చూపించాడు.కరిగినది అనకుండా లేదా  తత్ సమానపదము కూడా ఉపయొగించక హారియించు అన్నదానికి కారణము. కరిగినది అంటే,  ఈ గుణరూపము మార్పు చెందినదే కాని ఇంకా అక్కడే వున్నది అని, కాని హరియించు అంటే పూర్తిగా నివృత్తి.ఇలా అయితేనే మీకు మోక్ష పదమని శతకకారుని భావన. ఇందుకు ఉదాహరణగా హరి అన్న పదాలు పద్యము మొత్తములో ఆరు సార్లు పునరావృతమై కలవు. మీరు ఓక్కసారి పద్యము మరల గమనించండి.                 
ఇలాంటి సత్ సంగతులు నాతో చర్చించే పితృసమానులు శ్రీ వూటుకూరి రామయ్యగారు నాతో జరిగిన ఓక సమావేశములో ఈ విషయము నాకు తెలిపినారు.
ఇక వారిగురించి తెలుసుకొవాలంటే ఈ క్రింది లింకు కు వెళ్ళండి.

25, మే 2012, శుక్రవారం

కాళి - 14 రూపాలు



ఈచరాచర ప్రకృతి మొత్తము అమ్మరూపమే.అలాంటి అమ్మను మనవారు అనేక భిన్నరూపాల్లొ ఆరాధించారు తరించారు.ఇలా అమ్మకు గల అనేకానేక రూపాల్లొ కాళి ఒకటి.కాళికు గల అర్థాలు నలుపు,కాలము,మరణము,శివుడు ఇత్యాది అర్థాలు వున్నాయి. శాక్తేయులు ఈమేను తాంత్రికదేవతగా, బ్రహ్మఙ్ఞానాన్ని అందించే రూపముగా కొలుస్తారు. రామక్రిష్ణ పరమహంస  దక్షిణేశ్వర్ లొ వున్న  కాళిని భవతారిణిగా కొలుస్తారు. సృష్టి మొత్తము కాళీ అధినములొవున్నదని  అని చెప్పుతారు. కారణము కాళీ, కాల రూపిణి కనుక అమే ఆధినములొనె సృష్టి వున్నదని నమ్మకము.  కాళి వద్ద గల సకల జీవ బీజాలతొనే బ్రహ్మ స్రష్టి చేస్తారని పరమహంస అంటారు. ఇంతటి విశిష్ట కాళిని మొదట అధర్వణవేదములొ ప్రస్తావించారు.దేవిమహత్యము లొ ఈమే ఒకరూపంగా ప్రస్తావించారు.కాని అనేక తంత్రాల్లొ కాళికు 12 నుంచి 13 రూపాలు వున్నాయని  కూడ తెలిపినారు.
    
      అభినవగుప్తుడు సార్ధసటీకలో 12 కాళీరూపాలు ప్రస్తావించాడు.అవి 1) సృష్టిసంహార కాళీ 2)స్థితి కాళీ 3) సంహళ కాళీ 4) రక్త కాళీ 5) స్వకాళీ(సుకాళీ) 6)యామ కాళీ 7)మృత్యు కాళీ 8) రుద్ర కాళీ(భద్ర కాళీ) 9) పరమార్క కాళీ 10) మార్తాండ కాళీ 11) కాలాగ్ని రుద్ర కాళీ 12) మహ కాళీ (పర కాళీ, మహా కాలకాళీ, కాల కాళి) .ఇవి కాక తంత్రములో 13 రూపాన్ని తంత్రరాజ భట్టారకుడు ప్రస్తావించాడు ఆరూపము 13)మహా భైరవ గోచార కాళీ అని మనకు తెలిపినాడు.

    ఈ త్రయోదశ రూపాల ఆరాధన పద్దతులు క్రమసద్భావ, సంకసటిక, చిదగంగాప్రకాశిక మరియు క్రమస్తొత్ర గ్రంధాల్లో  వున్నాయి.
ఈ త్రయోదశ రూపాలు కాక ఇంకో చతుర్దశ రూపము గుహ్యాతి గుహ్యముగా నిరంతరసాధన సంపత్తి కలవారికి మాత్రమే తెలుసుకోగల రూపము " కాల సంకర్షిణి".

 కాల సంకర్షిణి యొక్క సారాన్ని ఆచార పద్దతులను,  సమవర్తన మండల  మరియు కాళీకుళా అను శ్రీవిద్యలో కలిపారు. పరశురామ కల్పసూత్రములో కాల సంకర్షిణీ రశ్మి మూలంగా కలిగి వుంటుంది.చిదంబర తంత్రము,మహలక్ష్మి తంత్రము,పరమానంద తంత్రం మొదలైనవన్ని కాలసంకర్షణ కాళీ ని ప్రస్తావిస్తున్నాయి.
ఈ 14 రూపాలు. సృష్టిలో వున్న చతుర్దశ భువనాలకు సంకేతము. ఈ మొత్తము రూపాలు కలసి ఏకరూపనామం కాళీ అందుకే కాళీ జగన్నేత్రీ అని రామకృష్ణుల ఉవాచ.

 ఇన్ని రూపాలను సాధకులు తప్ప మిగతావారు అచరించలేరు కానీ ఆ తల్లి గురించి తెలుసుకొవాలన్న ఉత్సుకత తెలుసుకొనెలా ప్రయత్నిస్తే అమే కరుణతో నాకు ఈ రూపాలు గురించి తెలిసింది. అది మీకు పంచుదామని ఈ చిన్న పొస్ట్.
జరుగుబాటు కష్టముగా వున్నవారు, జరుగుతున్న కాలములో కష్టాలు అనుభవిస్తున్నవారు కాళీని అరాధించండి. మీ నిత్య పూజలో అమ్మని ఆరాధించండీ. అష్టమీ, అమవాస్య దినాలలో మరచిపొకండీ. తామస ప్రకృతిగల రూపము కాబట్టి కాళీ పూజలో సారాయి,వైన్, లాంటీ వి సమర్పించాలీ. ఇది ఎమిటి ఇలా అనుకుంటారా నల్లద్రాక్షలను సమర్పించి నల్లద్రాక్ష రసాన్ని అమ్మవారి రూపముపై అలా కొద్దిగా ఒక పువ్వుతో అలా సమర్పించండి. అమ్మవారికి పుర్రెల దండ ఇష్టము కాబట్టి మీరు ముద్ద కర్పూరానికి మధ్య లొంచి దారము పొనించి మాలా లాగ గుచ్చి అమ్మవారికి పుర్రేలమాలగా భావించమని పలికి సమర్పించండి. అమ్మవారికి ఉత్సవము ఇష్టము కాబట్టి మీరు పూజ సమయములో గట్టిగా కరతాళనము మరచిపొవద్దు.మీరు కాళీ హృదయము, కాళీ కవచ పారాయణ చేయండీ. అసలు మీరు కాళీ హృదయం ఒక్కసారి పరిశిలించితేనే మీకు చాలా విషయాలు బొధపడతాయి.
   కాళి రూపాలలొ మనప్రాంతములో విశిష్టరూపము 'భద్రకాళీ' ఇది వరంగల్ నందు వున్నది.చాలా మహిమ కలది.గత జనవరి నందు అమ్మను దర్శించి ఆలయ ప్రాంగణములో మౌనముగా షుమారు 1.30గం. లు ధ్యానము చెస్తే బ్రహ్మాండమయిన దివ్య దర్శనము. చిక్కటి నల్లటి వెలుగు అందులొ నుంచి మహ ఆద్భుత కాంతి చెప్పలేనంత దివ్య కాంతి. ఈ కాంతి మధ్య నుంచి ఎరుపు రంగు బిందు స్వరూపిణిగా అమ్మదర్శనము. నేను క్లుప్తముగానే చెపుతున్నాను.

ఇంకోటి విజయవాడ తెనాలి మార్గములో కల చిలువూరు వద్దకల కంఠమురాజుకొండూరు వద్దకల మహంకాళీ దేవాలయము. ఇది బాగ గ్రామీణ అచారాలను ప్రతిబింబిస్తుంటది.ఈ దేవాస్థానములో గల మూలరూపము స్వయంభూరూపము.ఇది ఆ ప్రాంతములొకల ఓక రైతుకు స్వఫ్న దర్శనము ఇచ్చి నేను ఫలానా ప్రదేశములో వున్నాను అని తెలుపగా, అంత పరీశీలించగా కాళీ స్వరూపము లభించుటతో దేవాలయ నిర్మాణము.ఇక్కడ ప్రతి ఆదివారము మహచక్కని జాతర వాతావరణము  ప్రతిబింబిస్తుంటది.ఇక్కడ కొళ్ళు,మేకలు లాంటి బలులు,పోంగలి నైవెద్యము లాంటివి బహు బాగా ఆచరిస్తారు.

కాళీ హృదయము పరిశీలనగా చదివితే మనకు కొంత బొధ పడుతుంది. అందు చివరకు "సత్యం సత్యం పునఃసత్యం" అంటూ ఈ స్తొత్ర పారాయణ వల్ల వచ్చు అనుభవాలు, ఏ పరిస్థితులలొ వారు పారాయణ చేయాలో కూడా తెలిపినారు.
   

24, మే 2012, గురువారం

శ్రీ రామకృష్ణ పరమహంస - కధలు -3 (కాశ్యా న్మరణా న్ముక్తిః) ఈ కధప్రతి ఓక్కరు చదవవలసినది.

శ్రీ రామకృష్ణ పరమహంస గారి అద్భుత దివ్యదర్శనాలలో ఇది ఓకటి.

కాశీ క్షేత్రములో మరణము,  ముక్తి అనే నానుడికి బలము చేకూర్చే సంఘటన ఇది.


ఓకసమయములో రాణిరాసమణి తనపరివారము, అల్లుడు మథుర్, కొంతమంది పండితులు, రామకృష్ణుల వారితో కలసి కాశీ నగర సందర్శనకు నౌకల్లొ బయలుదేరారు.అలా కాశీలో వున్న రోజులలొ ఓకనాడు మధుర్,ఇంకొంతమంది పండాలతో కలసి గంగానదిపై విహారము చేస్తున్నారు.ఆ పడవ మణికర్ణికా ఘాట్ సమిపించగా,అక్కడి స్మశానములో జరుగుచున్న శవదహనాన్ని చూసి,అకస్మాత్తుగా ఆనందపరవశులై వడిగా పడవ అంచుకు వెళ్ళి సమాధిమగ్నులై నిలబడిపొయారు.ఆ పరిస్థితులలొ సాధారణముగా దేహస్మృతి వుండదు అందువలన ఆయిన ఎక్కడ నదిలో పడిపొతారోఅని కొందరు రివ్వున ముందుకు వెళ్ళారు. కాని ఆయిన దివ్యదరహాసాలతో నిశ్చలముగా అక్కడ నిలబడి ఉండగా, ఎవ్వరు కాపాడవలసిన అవసరము లేకుండా పొయింది.కొంత సేపటికి వారే ఈ అనుభూతిగూర్చి వివరించారు."పొడవరి పింగళవర్ణ జటాధారీ,శ్వేతవర్ణ పురుషుడు ఐన ఓక పురుషుడు మెల్లగా ఆడుగులు వేస్తూ ప్రతి చితి వద్దకు వెళ్ళి, నెమ్మదిగా అందలి జీవుని పైకెత్తి,చెవిలో తారకబ్రహ్మమంత్రము ఉపదేశించడము చూశాను! సర్వశక్తిమయి అయిన జగదాంబ - కాష్ఠానికి ఆవలి వైపు కూర్చుని,ఆ జీవుడి స్థూలసూక్ష్మ కారాణాది బంధాల నన్నిటిని విడదిసి,స్వయముగా మోక్ష ద్వారము తెరచి,కైవల్య ధామానికి పంపుతున్నది. ఎన్నో యుగాల తపొనిష్ఠలచే మాత్రమే పొందగ్గ అద్వైతానుభవాన్ని భూమానందాని శ్రీ విశ్వనాధుడు క్షణములో ఆ జీవులకు యీ రీతిన ప్రపాదించి వారిని కృతార్థులను చేస్తున్నాడు.

చూసారా రామకృష్ణులవారి దివ్యలీలా వైభవము.

23, మే 2012, బుధవారం

శ్రీరామకృష్ణ పరమహంస - కథలు -2







శ్రీరామకృష్ణులవారి వారు దాదాపు దివ్యస్మృతులుగానే వుంటూ అనేక సమస్యలకు అతి సాధారణ భాషలో అత్యద్భుతమయిన పరిష్కారాలు చూపేవారు అన్నది జగద్విఖ్యాతము.అలాగే వారికి సర్వము,సకలము దైవరూపాలు, వారు దైవవిగ్రహ సమక్షములో ఆరూపముతో వారు స్వయముగా సశరీరముగా వున్నట్లు భావించి ఆరాధన జరిపేవారు.


అలా అనేక సందర్భాలు కలవు వాటిల్లో ఒకటి.

దక్షిణేశ్వర్లో శ్రీరామకృష్ణులు సేవానియుక్తులు ఆయిన తరువాత ఆమందిర ప్రాంగణములొని రాధక్రిష్ణ మందిరములొని కృష్ణవిగ్రహాన్ని అర్చకుడు పవళింపు సేవకు తీసుకుని వేళుతుండగా పొరపాటున మందిర చలువ రాతి మెట్లపై  జారిపడ్డాడు తత్ఫలితముగా చేతిలొని కృష్ణవిగ్రహము కాలు విరిగింది. దీనితో ఆ అర్చకుడిని దేవాలయ విధుల నుంచి తొలగించారు.
  

ఈ విషయాన్ని దేవాలయ యాజమన్యము రాణిరాసమణిదేవికి తెలియపరచబడినది. దీనితో అమె ఆందోళనకు గురి ఆయి సమావేశము ఎర్పాటు చేసినది.అందు పండితులు భగ్నవిగ్రహమునకు అర్చన చేయటము శాస్త్ర విరుద్ధము కాబట్టి ఆ విగ్రహాన్ని గంగార్పణ చేసి, సంప్రొక్షణ జరిపి కొత్త విగ్రహాన్ని ఎర్పాటు చేయాలని సలహా ఇచ్చారు.కాని రాణిగారికి ఎందుకో ఈ సలహా నచ్చలా, అదిగాకా తాను ఇప్పటివరకు అర్చన చేయుచున్న విగ్రహాన్ని గంగార్పణ చెయటానికి అమె మనస్సు అంగీకరించకున్నది.

ఈ విషయంతా గమనిస్తున్న అమె అల్లుడు మధుర్ సలహాపై అమె రామకృష్ణులను సంప్రదించగా ఆ సమయములో వారు దివ్యస్మృతులుగానే వున్నారు, ఈ భావములొనే వారు ఇలా పలికారు "పండితుల నిర్ణయము హస్యాస్పదము, ఒకవేళ రాణిగారి అల్లుడు కాలు విరిగిన పక్షములో అతణ్ణి విడచీ అతడి స్థానాన్ని మరోకరితో భర్తీ చేస్తుందా? చికిత్స చేస్తుందా? ఇక్కడా అదే విధానము అవలంబించటము సముచితము.విగ్రహాన్ని బాగుచేయించి యధాప్రకారము పూజలు జరపండీ.


22, మే 2012, మంగళవారం

శ్రీరామకృష్ణ పరమహంస - కథలు -1




శ్రీరామకృష్ణ పరమహంస - కథలు

ఈ శీర్షికతో శ్రీరామకృష్ణ పరమహంస గారి కథలు కొన్నింటిని బ్లాగ్ జనులకు పరిచయము చేద్దామని ఇలా ప్రారంభము.
మీరు పరమహంసగారి జీవితచరిత్ర చదివేవుంటారు అందు కొన్ని కథలు,ఉదాహరణలు,స్వయముగా పరమహంసగారు స్వయముగా చెప్పినవి అందుకే అవి విలక్షణముగా చిన్న టైపులో వుంటాయి.శ్రీరామక్రిష్ణ మఠము వారు జీవితచరిత్ర 1/8క్రౌన్ సైజు, సమగ్రప్రామాణిక జివిత గాథ 1/8డెమ్మీ సైజులో బాక్స్, శ్రీరామకృష్ణ కథామృతము 1/4క్రౌన్ సైజులో సబ్సీడీ  ధరకు ప్రజలకు అందిస్తున్నారు  వీలు వున్నవారు తప్పక వుంచుకొవలిసిన బుక్స్.

ఇక కథలోకి వద్దాము.

     అరణ్యవాసములో సీతారామలక్ష్మణులు అరణ్యాలగుండా సాగిపొతున్నారు.అది ఎంతో ఇరుకైన దారి ఒకరి వెంట ఒకరు మాత్రమే పోగలరు. ముందు కొదండపాణియిన రాముడు,ఆయిన వెనుక సీత,అమె వెనుక ధనుర్భాణ హస్తుడు  లక్ష్మణుడు నడచి పోతున్నారు. రాముడి పట్ల భక్తి,ప్రేమాసక్తుడైన లక్ష్మణుడు ఆ శ్యామసుందరుండైన శ్రీరాముని సర్వాదా చూడగొరతాడు.కాని సీత అడ్డుగా వుండటముచే పరితపించాడు. ఇది ఎరిగిన సీత కొంచేము ప్రక్కకు తొలిగి "అదిగో చూడు" అన్నది, అప్పుడు లక్ష్మణుడు కళ్ళార తన ఇష్టమూర్తిని అవలొకించాడు.  

     ఇదే రీతిలో జీవునకు ఈశ్వరునికూ నడుమ మాయాశక్తి జగజ్జనని వుంది. అమె దయతలచి పక్కకు తొలిగినగాని జీవుడుకి ఎన్నటికి ఈశ్వరుని చూడలేదు.కాబట్టి అమె కృపలేకుంటే నిత్యానిత్యవస్తువివేచనము, వేదాంత విచారము ఎంత సలిపినా నిష్ప్రయోజనమే.

శ్రీరాముడు సచ్చిదానంద పరబ్రహ్మ రూపుడని సర్వులు ఎరిగినదే, అలాగే సీత, లక్ష్మీ రూపమని, ఈమే త్రిమాతలలో ఒకరని, వీరు ఆ జగజ్జనని రూపాలని కూడా తెలుసు. ఇక లక్ష్మణుడు శేషువు యొక్క రూపమని, ఈ శేషువు ప్రాణరూపుడై సర్ప రూపములో మూలాధార చక్రములో వుంటాడని కూడా ఇక్కడ మనము అన్వయించుకొవాలి.మరీ ప్రాణశక్తీ సహస్రారము అనగా పరబ్రహ్మ రూపాని చేరటానికి మధ్య సంసారము అనే  మాయ వుంటుంది దానిని ప్రక్కకు తొలగమని వేడుకుంటే అనగా సాధన చేస్తేనేకాని పరబ్రహ్మస్వరూపము దొరకదని భావము.
భక్తీ, విశ్వాసాలే ఈ సాధనకు ఆయిధాలు.
కనుక ఆ శ్రీరాముని, తద్వారా సచ్చిదానంద పరబ్రహ్మాన్ని సర్వులూ చూడగలరని ఆశీస్తూ ......     

21, మే 2012, సోమవారం

దేవాలయ ప్రదక్షిణలలో ఉప్పు వినియోగము...?...?....?




హైందవ సాంప్రదాయము ప్రకారము మానవజన్మ పొందటానికి ముందు అనేకజన్మల తరువాత ఈ జన్మలభిస్తుందని. ఈ జన్మలోని కర్మలను బట్టి మరుజన్మ వుంటుందని.మరి ఇలా లభించిన ఈ జీవితములో లభించు సుఖః,దుఃఖాలకు మన సంచిత ప్రారబ్దమేనని మన  వారి విశ్వాసము.

 మనము గత జన్మలో ఎవరికన్నా ఎమన్నా కర్మలద్వారాకాని, క్రియలద్వారాకాని ద్రవ్యముద్వారాకాని మనము ఋణపడి వుంటే మనకు ఈజీవితములో కొన్ని కష్టాలు పడతామని విశ్వాసిస్తారు.మరి వీటి నివృత్తి ఎలా. సాధారణ మానవునికి గతజన్మ స్మృతి కలిగివుండదు.మరి దానికి తరుణొపాయమే ఈ ప్రదక్షిణలలో ఉప్పుని అలా ధ్వజస్థంభము వద్ద నివేదించమని సలహా ఇస్తారు.

భగవంతుడు సర్వ వ్యాపకుడని మీకు తెలిసినదే.అలాగే ఈ భూమండల మంతటిని నీరు ఆవరించివున్నదని.వాయువు లో నీరు ఆవిరి రూపములో కలిగి అంతటా వ్యాపించివున్నది.తద్వారా ఉప్పు అన్నిటా కలిగి వున్నదని.

         అలాగే మనము మనతాలుకు విశ్వాసాలను కూడా "నేను వాడి ఉప్పు తిన్నాను వాడికి ద్రొహము చేయలేను" అని వాడుకలో ధర్మపరాయణులయిన మన వారు పలుకుట మనము ఎరిగినదే.

కనుక సర్వ వ్యాపకుడైన భగవంతునికి మనము ఉప్పు సమర్పించి గతజన్మ తాలుకు ప్రారబ్దములొని దోషనివృత్తి చేయమని, ఋణ విముక్తుడిని చేయమని ఉప్పు సమర్పణ చేస్తున్నాము.
    

20, మే 2012, ఆదివారం

బడాయి భక్తి - వ్యాపార దేవాలయాలు - కార్పొరేట్ అధ్యాత్మికత.




వేదకాలం లో మానవుడు ప్రకృతి శక్తులను పూజించాడు.తదనంతర పరిణామములొ అనేక దైవరూపాలు ఉద్భవించి మానవుని అధ్యాత్మీక వున్నతికి, దైనందిన జీవనములో సంయమనముకు అచారాలు,పూజలు,వ్రతాలు కూర్చ బడ్డాయి.ఇవి వ్యక్తివికాసానికి, సంఘ అభ్యున్నతికి తొడ్పడ్డాయి.వీటికి ఆలంబనగా అనేక వేలమంది రాజులు జమిందార్లు అనేక వేల దేవాలయాలను నిర్మించారు.ఇది కొన్ని వేల సంవత్సరాలు సాగగా బౌద్ధము,జైనమత వ్యాప్తితో హిందుమతo కొన్నివందల సంవత్సరాలు ఆదరణకు నొచుకొలేదంటే ఈనాడు ఆశ్చర్యము  కలుగుతుంది కాని చరిత్ర చెప్పిన సత్యం.ఆతరువాత శంకరుల అద్వైత స్థాపనతో మరలా హిందుమతానికి పునరుజ్జీవము.శంకరులు అతికొద్ది కాలములొనే అసేతు హిమాచలము పర్యటించి అనేక వేల దేవాలయాలను పునరుద్ధరణ,పునరుజ్జీవన,పునఃస్థాపన లాంటి  దిగ్వవిజయవంతమయిన కార్యక్రమాలతో మరలా హిందుమత పతాకము ఎగిరింది.
     తదనంతర మధ్యయుగాలలో అధ్యాత్మకత ఓక భక్తిఉద్యమముగా మారి శైవ,వైష్ణవ,శాక్తేయ ఇలా అనేక శాఖలుగా మారింది. మరలా దినిలో అనేక రకాల ఉపశాఖలు, అనేక మార్గాలు ఎర్పడ్డాయి.ఈ సమయాలలొనె అనేక వందలమంది సాధులు,సంత్,మఠాదిపతులు ప్రవేశం.రామానుజాచార్యులు,మధ్వాచార్యులు,నింబార్కులు,చైతన్యులు,వల్లభాచార్యులు లాంటి మార్గదర్శకులు.తుకారాం,రామదాసు లాంటి అనేక వందల భక్తాగ్రగణ్యులు.ఈ మతాన్ని సుసంపన్నము చేసారు.వీరందరు భక్తిమార్గాలను ధ్యాన,యోగ,ఆరాధన ద్వారానేకాక సంగీత,నృత్య,సాంస్కృతిక కళలను, తమ విద్వత్ వైభవాన్ని దైవ పరంగాచేసి వారు ధన్యులు అవుతూ సమాజాన్ని ఏకీకృతము చేసారు.ఇందుకు సందేహము లేదు.
     కాల క్రమేణా మహ్మదీయదండయాత్రతో ముస్లీం మతం పరిచయము అయినది. ముస్లీం రాజులు మొదట సంపద దొచుకొవటానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చి ఆ తరువాత ఇక్కడ వున్న వనరులు, వాతావరణ పరిస్థితులు ఆకర్షించి రాజ్యవిస్తరణకు పూనుకున్నారు.ఆ తరువాత తమ దేశాలనుంచి పాలన కుదరక ఇక్కడ తమ ప్రతినిధులను వుంచి రాజ్యపాలన సాగించారు.కాల క్రమేణా ఈ ప్రతినిధులు స్వతంత్రులై రాజ్యహస్తగతము చేసుకున్నారు.దీనివలన వారికి స్వంతదేశములనుంఛి మనుషులు రాక తమ విధానాలకొసము బలవంతపు మతమార్పిడీలకు తెగపడి సమాజాన్ని భీభీత్సభయానక గందరగోళానికి గురిచెసారు.ఔరంగజేబు లాంటివానికి మతసహనము అంటే అర్ధము తెలియనంతగా మతమార్పిడిలు జరిగి మసీదులు,ముస్లీం అరాధనా పద్ధతులు ప్రవేశించబడ్డాయి.  
 ఈ వాతావరణము ఇలా వుండగానే డచ్చివారు,ఫ్రైంచివారు,ఆంగ్లేయుల రాకతో క్రైస్తవము దేశములో వ్యాపించింది.క్రైస్తవము మతముగా స్వకరించటానికి ముందుకు రాని పరిస్థితులలో అనాటి సమాజములో అంటరానివారుగా జీవనము గడుపుతున్న హరిజనులకు ఆకట్టుకొని మత విస్తరణ చేసుకున్నారు. క్రైస్తవము విస్తరణలో సేవ ఒక మార్గమయితే, చర్చిలు పేదవారికి,మతము అనుసరించినవారికి బహుమతల పర్వము ఇవ్వటము సాగించి బాగా ప్రాముఖ్యత వహించాయి.

ఇలా స్వాతంత్రకాలానికి జాతిజీవనములో ఈ 3 మతాలు భాగంగావున్నా, కానరాని వైషమ్యాలు వున్నా, ఉమ్మడిగానే జీవనము సాగించారు.
దేవాలయాలు ధర్మసంస్థలు ఆనాడు పటాటోప అర్భాటాలకు దూరంగా వుండి అధ్యాత్మికవాదులకు,భక్తులకు వేదికగాను, శరణు అన్నవారికి అభయ ప్రదాతలుగాను వుండేవి. ఇందువలన అనేక మంది వితరణశీలురు, దాతలు బావులు,సత్రాలు,అన్నదాన సమాజాలు స్థాపించి వాటి నిర్వాహణకు మూలధనాన్ని,ఆస్థులను,జమాబందికి వ్యవస్థను ఎర్పరిచేవారు.దీనివలన దేవాలయాలు మున్నగునవి సాంస్కృతిక కేంద్రాలుగా, పౌరకేంద్రాలుగా వ్యవహరించాయి.కాని స్వాతంత్రయానంతర రాజకీయ నాయకుల జొక్యముతో ఈపౌరకేంద్రాలను రాజకీయకెంద్రాలుగా, కొండకచో వర్ణ,వర్గ బేధాలుగా విభజన జరిగింది. దీని వలన ఆయాప్రాంతాలలో పలుకుబడి,పట్టు వున్న నాయకుల చేతిలోకి దేవాలయాల యాజమాన్యము వెళ్ళి ఆనాయకుల అవినీతి,ఇష్టారాజ్య పాలనతో దేవాలయ ప్రాభవాలు తగ్గాయి.ఇది ఎదొ ఓకనాడు జరిగినది కాదు తరాల దోపిడి, గుట్టుచప్పుడుకాని ధార్మిక మోసము.అందుకే వేలకొద్ది ఎకరాల భూములు మాన్యముగా వున్న దేవాలయాలు కూడా దీపారాధనకు నోచుకోనివి నేటికి చాలా వున్నాయి.ఈ దుస్థితికి ప్రజలు,ప్రభువులు ఇరువురు కారణము.ప్రభువులుగా వుండే నేతలకు కావలసినది అధికారము,ధనము తప్ప వేరుకాదు.అందుకే దేవాదాయ చట్టాల పేరుతో దాదాపు అన్ని దేవాలయాలను తన అధీనములోకి తెచ్చుకోని,దేవాలయ ఆదాయాన్ని బట్టి దేవాలయ స్థాయి వర్గీకరణ దాని బట్టి నిధులు.ఇక ప్రజలు కూడా అధ్యాత్మికతను మనొవికాసానికి,జీవనగమనానికి అనువుగా ఉపయగించకుండా అనేకరకాల మొక్కులు,పూజలతో భక్తిని కూడా వ్యాపారము చేసి. దేవుడితోనె బేరాలు ప్రారంభించారు. 
     ఇవి చాలవన్నట్లు సమాజము నిండా ఊరికి,పేటకు,సందుకు ఓక బాబా,సాధు,సంత్ ల హడావుడి. అలాగే అనుచానముగా వున్న దైవరూపాలకు తోడు షిరిడిసాయి,అయ్యప్ప లాంటి రూపాలకు ఆదరణ.ఈనాడు షిరిడిసాయి మందిరము లేని వార్డు లేదంటే పరిస్థితి గమనించండి.  

ఈ స్వామీజీల మఠాలు,ఆశ్రమాలు చూడండి వైభవంగా వైకుంఠాన్ని తలపించే విధముగా 5నక్షత్రాల హోటళ్ళకన్నా ఎక్కువగా ఉదా. ఆర్ట్ ఆఫ్ లివింగ్, గణపతి సచ్చిదానంద,జియ్యర్ ఆశ్రమాలు.గమనించండి విళ్ళందరు భక్తి రూపములో చేసేది వ్యాపారమే.అధ్యాత్మికత ఓక ముసుగు. సేవ ఓక తేనే పూసిన కత్తి. అయ్యా! ఉదహిరించినవారు మాత్రమే ఇలాకాదు ఆసేతు హిమాచలము వున్న మఠాలు,ఆశ్రమాలది ఇదే తంతు.వీళ్ళ వ్యాపార ధోరణికి కొన్ని చర్చకు చూద్దాము.     
కల్కి మందిరాలలో,కల్కిఆశ్రమములో జరిగే ధనార్జన.పాదపూజ లక్ష,దర్శనానికి వేలు. యఙ్ఞాల పేరిట వేల,లక్షలకొద్ది ధనము వసూలు. ఈధనము పెట్టి స్వామిగారి అబ్బాయి మద్రాసులో సినిమాలు,రియల్ యస్టేట్ వ్యాపారాలు. 
2వది నాస్వీయ అనుభవము.5సంల క్రితము గణపతి స్వామివారు విజయవాడ సిద్ధార్ధకళాశాల ఆడిటొరియం నందు రాగచికిత్స లాంటి కార్యక్రమము ఎదొ చేయ తలపెట్టినారు.అది ఉచితముకాదు టిక్కెట్ 5000,10000 గా నిర్ణయము.ఆ రొజున నేను వీరి ఆశ్రమములోని మరకత రాజేశ్వరి దర్శనానికి వెళ్ళి స్వామివారి అనుగ్రహభాషణ అంటే అలా ఆలకిస్తున్నా.నా ప్రక్కన ఎవరో ఓక స్వామివారి సాధారణ భక్తుడు హైద్రాబాద్ నుంచి వచ్చాడు.అదే సమయములో స్వామివారి ఆంతరింగిక సిబ్బంది సాయంత్రము ప్రొగ్రాము టిక్కెట్స్ అమ్ముడుకాలేదు హాలు డబ్బులు,ప్రచారము ఖర్చు కూడా రాలేదు అని రహస్య సమాచార నివేదిక.దీనితో స్వామివారు ఒక్కసారిగా అగ్రహముతో ఉగ్రముగా మైకులో మీరు నాభక్తులై వుండి 10000 పెట్టి టిక్కెట్ తీసుకోరా డబ్బులేని వాడు కూడా భక్తుడా అన్న అభావ సంభాషణ. ఇది విన్న నేను షాక్,నా ప్రక్కన వున్నవాడు మూర్ఛ.వాడికి నాకు ఓకటే ఉమ్మడి      
ప్రశ్న డబ్బు లేని వాడు భక్తుడుకాడా? అధ్యాత్మికతకు అనర్హుడా!
ఇలా సాగుతున్నాయి స్వాముల భాగొతాలు.
ఇకపొతే దేవాలయాల వ్యవహారానికి వద్దాము.
పాపము ఈ మధ్య దేవుళ్ళందరికి డబ్బుచేసింది.
దేవాలయాలకు 1992 ఆర్ధిక సంస్కరణలు బాగా లాభించాయంటే మీరు ఆశ్చర్యపోవద్దు.30 సం.ల క్రితము దేవాలయాలు స్థితి, నేటి దేవాలయాల రూపు కు మధ్య మీకు గమనింపు వుంటే పరిశీలించండి మికు ఈ తేడా తెలుస్తుంది.ప్రజలలో డబ్బు చేరికతో అధ్యాత్మికత దర్శనాలకన్నా, హోదా, డాబు దర్జా,వేకేషన్ దర్శనాలు పేరిగి భక్త జన సందొహముతో దేవాలయాల వద్ద రద్ది పెరిగింది. ఈ జన సందొహముతో కానుకల శ్రేణి బాగా పెరిగింది. ఓకనాడు లక్ష రూపాయల కానుక ఘనము కాని నేడు కోటి కూడా తూనాబొడ్డు. 
     ఈ కానుకల హంగుతో దేవాలయ పాలకవర్గాలు దేవుడి పేరు చెప్పి బంగారు కవచాలు,దేవాలయ శీతలికరణలు, గ్రానైట్ రాళ్ళు,బంగారు గిన్నేలు,బంగారు శఠారిలు,బంగారు పాత్రలు ఇవి అవసరమా. దేవుడి పేరున చందాలు. ఈ పనుల కాంట్రాక్ట్ లో వాటాలు వీలుంటే మొత్తము గుటకాయ స్వాహాలు.పాపము సమాధి అయ్యెంతవరకు షిరిడి బాబాగారు అతి సాధారణముగా వున్నారు.కాని నేడు షిరిడిలో కాదు సందు సందుకి బాబా ఆలయాలలో వెండి, బంగారు సింహాసనాలు. ఆయన చెప్పిన శ్రద్ధ, సబూరిలు  ఓకటి వెండిగా  మరొకటి బంగారముగా మారిపొయి. బాబాగారు దొపిడిదారులకు అవకాశము అవుతున్నారు ఉదా. విజయవాడ 1 టవున్ నేహ్రు బొమ్మ వద్ద వున్న చిన్న మందిరము చేసిన తంతు. వీళ్ళ దొపిడి ఇంకొకడి పాఠములా మారి వాడుకూడా తెల్లవారెటప్పటికి మందుబాబు కాస్తా భక్తపరమాణు రూపము దాల్చి కొత్త బిచాణ సిద్ధము.దోపిడి ప్రారంభము ఇది వరుస. 
   ఓక్క పూట ఆహారము కూడ పరిశీలించి తినమని వేదము చెపుతుంది.యతులు,స్వాములు దుర్మార్గుడివద్ద ఆహార స్వీకరణ నిషిద్దము.వాళ్ళకే అన్ని వుంటే స్వామివార్లకు ఎన్ని జాగ్రత్తలు వుండాలి.మరి స్వామి వారి ధరింపచేసే ఆభరణాలు,సేవకు ఉపయొగించే పాత్రలు బంగారమువి దాతలు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నమంటున్నారు కాని దాతలు ఎవరు వారి పరిస్థితి ఎమిటని ఒక్కసారి కూడా విచక్షణలేదు.గాలి లాంటివాడి వద్ద కిరిటాలు,ముఖేష్ అంబాని లాంటివాడి వద్ద డబ్బులు.అంబానిల రూముకు  వెళ్ళి ఆశ్వీరవాదాలు. ఇవి అన్ని ఎందుకు జరిగినవి దేవాలయాలు అధాత్మికత వదులుకోని వ్యాపారకెంద్రాలుగా మారిన కారణంగా జరిగిన విపరిణామాలు.
ఇది చాలదన్నట్లు వ్యాపారసంస్థల మధ్య పొటిలా స్వామీజీల సమూహలలొ ఈ మధ్య అంతర్గత పోటిలు,ఆరొపణలు,రకరకాల రూమర్స్ ప్రచారము.వీళ్ళు కూడా ఫ్యాక్షనిష్టుల్లా,భూకబ్జాదారుల్లా వీలయినంత మేరా భూఅక్రమణకు పాల్పడుతున్నారు.విశాఖపట్నము స్వామి గారు ఇదే తరహా అరోపణ ఎదుర్కుంటున్నారు.గతములో నేరాలలో ప్రమేయము,నేడు చెక్ బౌన్స్ కేసులు కర్నూల్ స్వామి మీద వున్నాయి ఇది కూడా పరీశిలనకు తీసుకొవాలి.ఇదే తరహాలో అనెక రకాల సంపాదనా మార్గాలు. దీనికి ఓ పెద్ద ఉదాహరణ.వేలూరు బంగారుగుడి. అంత బంగారము అవసరమా?హెలికాప్టర్స్ లో పూలు చల్లటము దేనిని సూచిస్తుంది.ఎన్నో వందల వేల సంవత్సరాలనుంచి వున్న దేవాలయాలు,మఠాలు చూడనంత సంపద,వైభోగాలు,పూజలు ఎలాచేస్తున్నారు.అందుకు డబ్బు ఏమార్గాల్లో వస్తుంది. ఇవి అన్ని లొకానికి అవసరము లేదు,ఓకవేళ  అడిగినా వాడి నొరు నొక్కటము బాగ తెలిసిన విద్య.రాజకీయనాయకులకు  అందవలసినది అందటముతో ప్రభుత్వాలు మాట్లాడవు.వీళ్ళందరు కొత్తతరం రాజాలు.కదిలితే మెదిలితే విమానాలు,కోట్లరూపాయల వాహనాలు,వందలమంది అంతే వాసులు,భక్తజన సందోహాలు.వీళ్ళు స్వాములు కాని అహాన్ని మాత్రము జయించలేక పొయారు.
      

అందుకు చినజీయ్యర్ ఈ మధ్యలో తిరుమలలో చేసిన పెద్ద హడావుడి.వీరు పేరుమాళ్ళు దర్శనము కూడా కాకుండా మధ్యలో తిరుగు ప్రయాణము  . ఇది వారు ఆరాధించే స్వామిని తృణికారాభావముతో చూసినట్లుకాదా? వాళ్ళు ఎన్ని రకాలా సమర్ధనలు చెప్పినప్పటికి ఈ భావము ప్రజల మనస్సులొకి వచ్చింది అన్నది నిజము.దేవాలయ అధికారులకు తనకు మధ్య వున్న వివాదానికి స్వామిదర్శనము కూడదా? రేపు ఇదే విధముగా తన భక్తులు వీరి పట్ల వ్యవహిరిస్తే అప్పుడు వీరి అనుభూతి. దేవుడు చెప్పలేదని అనుకొవద్దు ప్రజా ఆగ్రహమే  దైవనిర్ణయమని నేను భావిస్తున్నా.

మీరు గమనించారో లేదో వీళ్ళలొ కొద్దిమందికి తప్ప చాలామందికి ఓక్క శ్లోకం చెప్పటము,ఓక్క ప్రవచనము ఇవ్వటము కూడా రాదంటే ఆశ్చర్యమే.అది,ఇది, అలా,ఇలా ల తో మేకప్ చేస్తారు తప్ప ఉటంకింపులు,ఉదాహరణలు,వ్యాఖ్యానాలు,స్తొత్ర పారాయణలు వుండవు. వేలకొట్ల రూపాయలు సంపాదించిన కల్కి వారు నోరు తెరచి మాట్లాడంటే భయం,బండారము బయటపడుతుందని. టీవిలకు,దర్శనాలకు వీరు మౌనముద్రలొ ఎవరికి అందనంత ఎత్తుగా పీఠాలు,తెరలు. ఓక భాషణ,ఓక మార్గము చూపితే అందులో తప్పు ఓప్పులు చర్చకు దారితియ వచ్చని ఖండనకు గురికావలసి వుంటదని ముందునుంచే మౌనము.మౌనముగా కోట్లు సంపాదించి శిష్య,ప్రశిష్యులతో ప్రవచానాలిప్పించి.మాస్వామి అంత మహత్తు,ఇంత మహత్తు అని డాంబిక ప్రచారాలు.పాపము వీరికి తన తోడుగా ఆడ అవతారానికి ఎవరు దొరకక, దొరికినా తనకన్నా ముదురుగా మారి తనను ముంచుతారని జాగ్రత్తగా తన భార్యనే పద్మావతిగా తన ప్రక్కన స్థానము.అధ్యాత్మికత వారసత్వమా.ఓక వ్యక్తి అధ్యాత్మిక వున్నతి సాధించారని అతని భార్య, బిడ్డలకు అది అబ్బదు. దీనికి ఉదాహరణలు చాలా వున్నాయి. పురాణాలలో శుకుడుకు, వ్యాసునకు అధ్యాత్మిక స్థాయిలో ఎవరు వున్నతులో మీకు తెలియందికాదు.మరి వీళ్ళ స్థాయి ఏమిటో బుధ జనులకు తెలియాలి.
   పులి మీద పుట్రలా నిత్యానందలాంటి వాడి వ్యవహారము ఓపెద్ద తలనొప్పి,ఓసిగ్గుచేటు.అంత అంకచండాలమయిన వ్యవహారము సమర్ధనీయమా! నిత్యానంద,రంజితల వాదన,ఖండన వారికి ఇంపు మిగతావారికి కంపు.వీరి వాదనకు నైతిక,సామాజిక అమోద ముద్ర పడకపొవటమే దీనికి తార్కాణము.ఇది ఇలా గుండగానే వీరు 300కోట్ల రూపాయల ఖర్చుతో 1500 సం.ల చరిత్ర వున్న ఙ్ఞాన సంబందర్ స్థాపించిన మదురై ఆధినమనే వీరశైవ మఠానికి వీరు ఉత్తరాధికారిగా పట్టాభిషిక్తుడై సర్వప్రపంచాన్ని షాకుకు,కంచి స్వామీవారిని వేదనకు గురిచేసారు.ఈ వ్యవహారము అందరి మతవిశ్వాసాలలొ ఆజ్యము పొసీనట్లుగా మారింది. దీనితో ఇది రాజకియ పార్టీల రొచ్చు వ్యవహారములా కేసులు,ధర్నాలు,విమర్శలు,ప్రతి విమర్శలగా సాగుతుంది.

    అయ్యా! వీళ్ళందరు ఇన్ని గందరగోళాలు,వైరుధ్యాలు సృష్టించి ఎమి బాపుకుంటున్నారు. వీళ్ళ ఆధాత్మికత స్థాయి "రమణులు","రామకృష్ణ పరమ హంస" లతో  పొల్చితే సూక్ష్మాతీ సూక్ష్మము, అల్పాతీ అల్పము.
                
 ఇవి ఇలా వుంటే టీవిలలొ ఛానల్ ఛానల్ కు పురాణప్రవచనాల మేళా.మరలా మతానికొ ఛానల్ అన్ని మతాల వారు అనుచరగణాలు పెంచుకొవటానికి టివిలలొ దర్శనము.ఈ ప్రవచనాలలో ఎన్నిరకాల వైరుద్ధ్యాలో లేక్కలేదు.పూజలు స్తొత్ర పారాయణలు చెప్పె విధానాలు బొలేడు ఆచరణలు.మీరు నవ్వుతారు కాని ఈ మధ్య మాషాపుకు ఓక తిక్క మెళాము టివిల పైత్యం ముదిరినవాడు వచ్చి "పురుషుల వ్రత కధల " పుస్తకము అడిగాడు.నా 30 సం.లా వ్యాపార అనుభవములో చూడని వింత వాడిని ఎదొ విధముగా చెప్పి పంపాను.ఈ రోజు టీవిలో ఓక పూజ గురించి చెప్పారు అంటే వేలం వెర్రికి వెనుకా ముందు లేదు.ప్రస్తావించరాదు నాకు తెలిసిన ఓక అధ్యాత్మిక రచయుత,వ్యాఖ్యాత కు వున్న మందు, స్త్రీ వ్యామొహము భయంకరము,భరించరానిది.ఈ ప్రవచానాల స్వాములను ఎదో వూరు నుంచి ఓక ఆసామి అయ్యా నేను ఫలానా రొజున పుట్టాను నా సమస్య ఇది.ప్రవచన పంతులుగారు బాబు మీది అశ్వని నక్షత్రము. మేష్లగ్నము,మేష రాసి ఇది నివారణ అని వాడి సమస్యకు ఎదో తరుణొపాయాము చెప్పుతాడు  కాని ఇవతల అసలు సమస్యవాడి సంగతి మనకు తెలవదు కాని శ్రద్ధగా వినే మధ్యవాడు తనది అశ్వని నక్షత్రము అయితే వాడికి అన్వయించుకోని తన దశ, అంతర్దశ,గ్రహస్థితి లాంటివి ప్రక్కన పెట్టి యమ అర్జెంటగా ఈ పూజలు నిర్వాహణ వాడికి పనికి రాక తరువాత లబో దిబో.     
   దీనికి తోడు మాసబ్బు వాడండి, మాషాంపు వాడండీ అని అర్ధనగ్న అమ్మాయిలు ప్రచారములా ఉంగరాలకి,యంత్రాలకి అందముగా వున్న అమ్మాయిలతో ప్రచారము. ఈ మధ్య ప్రచారము అయిన శనియంత్రము కంపేని ఆ ఉత్పత్తి మీద 500కోట్లు సంపాదించినది అంటే ఎంత మంది మొసపొయారో తెలుసుకొండి.నేను 30 మంది వద్ద గమనించాను.
     పూర్వము రామకల్యాణము రేడియోలో ప్రత్య్క్షప్రసారము అవుతుంటే ముచ్చటగా వింటూ సీతరామ కల్యాణఘట్టాన్ని కనుల ముందు ఊహించుకొనేవారు.కానీ నేదు దేశములో అన్ని ప్రాంతాలలొ వున్న క్షేత్రాలలొ సేవలన్ని ప్రత్యక్ష వీక్షణము.పోని విక్షకులన్నా భక్తిగా చూస్తున్నారా! అబ్బేలేదు సీరియల్స్,సినిమాలలొ భాగముగానే ఉదాసినముగానే చూస్తున్నారు.టీవి కంపెనికి రేటింగిలు భక్తులకు కావలసింది కాలు కదపని వినొదము.చివరకు దేవుడుకూడా వినొద సాధనముగా మారిపొయాడు.   
  ఇవి అన్ని ఎందుకు జరుగు తున్నాయి? ఈ పద్దతులు అన్ని వ్యాపార లక్షణాలు కాదా?అందుకే "బడాయి భక్తి - వ్యాపార దేవాలయాలు - కార్పొరేట్ అధాత్మికత" సంఘమునిండా ఉజ్జ్వలముగా వెల్లి విరుస్తుంది.
తస్మాత్ జాగ్రత్త పైవాడికి కోపము వస్తే ....
ఈ మధ్యనే పెనుగొండ కాళేశ్వర్ బాబా పేరు కూడా తెలియని వ్యాధితో కన్నుమూసాడు.ఇది అందరు ఙ్ఞాపకము వుంచుకొవలసిన అంశము.
పాత సామేత ఓకటి  "ఇల్లాలు వెలవెల - వెలయాలు ధగధగా".కాని అంత్యకాలానికి ఇల్లాలే దిక్కు.  
---------------------------------------------------------------------------------------------

    ఈ వ్యాసము చాలా వుంది. కాని విస్తార భీతితో ఇంతవరకు ముగించా.నేను ఏ స్వాములకు మతాలకు వ్యతిరేకము కాదు కాని జరుగు తున్న దొపిడి చూసి బాధ కలిగి ఎవో కొన్ని పేర్లు, సంఘటనలు ప్రస్తావించాను బొలేడు నిజాలు,చాలామంది అవకతవకలు గమనించా.దైవము పై విశ్వాసము వున్న వాడిగా ఈ దారుణ కాండ చూడలేక ఈ విధముగా వెలి బుచ్చాను.అంతే తప్ప వేరుకాదు.
ఒక వేళ పేర్లు ఉదాహరించిన స్వాముల అభిమానులకు కొపాలు వస్తే నమస్కారపూర్వక మన్నింపులు.లేదా మావాడేలే అనుకుంటే ధన్యవాదాలు. రెండు మీ సమక్షములోనే.
   
ఏనాడో వేమన చెప్పాడు చిత్తశుద్ధిలేని శివపూజ గురించి. వీళ్ల చిత్తము డబ్బు మీద వుంటే, వీళ్ళు శివుడి పై ఏమి నిలుపుతారు.

   వేదాలు,ఉపనిషత్తులు,సర్వమతాలు,మతగ్రంధాల సారాంశము ఓక్కటే మానవుడిలోనే దేవుడు వున్నాడు.కనుక మానవత్వమే సర్వులకు సమ్మతము,హితము.

కొంత మంది మిగతా మతాల గురించి వ్రాయలేదే అని అనుమానము. నాకు నా మతమంటే ప్రేమ,అభిమానము. అలాగని ప్రక్కవారి పై నిరాదరణో,ద్వేషమో లేదు.పరిశిలించలా, పరీశిలించి ఖచ్చితముగా తదుపరి టపాలలో వ్రాస్తా.

ఇది మతము పై విమర్శకాదు.ఇలా వున్నదే,ఇలా జరుగుతున్నదే,ఇలాగయితే ఎలా అన్న పరామర్శ మాత్రమే.

19, మే 2012, శనివారం

పాపానికి తండ్రి ఏవరు?







పాపానికి తండ్రి ఏవరు ? నిజమే చాలామందికి అర్థముకాని విషయము. ఈ కథ చదివితే  మీకు అవగాహనకు వస్తుంది.



ఒక పండితుడు కాశినగరములో విద్యాభ్యాసము చేసి తిరిగి స్వగ్రామము వచ్చి గృహస్థజీవితము గడుపుతున్నాడు.
కొద్ది రోజులకు ఆపండితుడి భార్యకు పాపానికి తండ్రి ఏవరని ఓక సందేహము వచ్చింది.స్వంతముగా కొంత ప్రయత్నము చేసినా ఫలితము లేక భర్త వద్దకు వెళ్ళి "పాపాని కి తండ్రి ఏవరు ?" ఈ విషయమయి నాకు కొంత చింత కలుగుతుంది తీర్చగలరని మిమ్ము అడుగుతున్నాను. మన పండితులవారు చాలా విధాలా అలొచించారు,తనవద్ద వున్న తాళపత్ర గ్రంధాలన్ని కూడా పరిశీలించారు. ఆయినకు ఈ విషయము అంతు చిక్కలా.ఇక చేసెది ఎముంది గురువులని అడిగి తెలుసుకుంటాను అని మరలా కాశీ నగరాని ప్రయాణము అయ్యాడు.

పండితుడుగారికి దారిలో ఓక వేశ్య తటస్థపడి అయ్యా తమరి ప్రయాణ కారణము నేను తెలుసుకొవచ్చా అని అడిగింది
    ఆ పండితుడు  వృత్తాంతమంతా అమెకు వివరించాడు.  ఇంత చిన్న విషయానికి మీరు అంత దూరము ప్రయాణము ఏందుకు ఇదే అయితే నేను మీకు ఇక్కడే వివరించగలను అని పలికినదా వేశ్య.కాకపొతే మీరు కొద్దిరొజులు ఆగవలసి వుంటుంది,దీనితో ఆ పండితుడు ప్రయాణము వాయిదా వేసుకొని ఇంటికి తిరుగు ముఖము పట్టాడు.
అమావాస్యకు ముందురొజున ఆమె పండితుడి వద్దకు వచ్చి 100రూపాయల ఇచ్చి భొజనమునకు ఆహ్వానించింది.మనవాడికి డబ్బువస్తుంది భోజనము దోరుకుతుంది అని అంగీకారము తెలిపినాడు.మధ్యాహ్న వేళకు మనవాడు వేశ్య ఇంటికి దయచేసాడు.అతిధి మర్యాదలు అయినతరువా అమె మరలా 100రూ పండితుడికి ఇచ్చినది.అందరు పక్వా ఆహారము సిద్ధము చేస్తారు, నేను మాత్రము పచ్చి ఆహారము మీకొరకు వుంచాను అని పలికినది.
  ఇలా పలుకుతూ మరలా 100రూ లను పండితుడిగారి చెతిలో వుంచి నేను మీకు నా చేతితొ పెడతాను అన్నది. సరే అని పండితుడు నోరు తెరవగా, అమె లేచి పండితుడి లెంపకాయ పగలకొట్టినది.
  ఒక్క సారిగా ఈ సంఘటనతో అతనికి ఎమి అర్థము కాక కారణము ఏమిటని ప్రశ్నించాడు.అంత అమె ఇప్పుటికి మీకు ఙ్ఞానము కలగలేదని ఇలాప్రవర్తించాను అని పలికి.
తన అనుచిత ప్రవర్తనకు ఇది కారణమని పలికినది :  నా చేతి ఆహారముతో మీరు ధర్మభ్రష్టత్వమునకు గురికాకూడదని అలా ప్రవర్తించినాను.మీరు లొభముతో నేను ఇచ్చిన ప్రతిసారి డబ్బు తీసుకున్నారుగాని నిరాకరించలేదు. ఇందు వల్ల మీరు పతనమవుతున్నారని గ్రహించలేదు.లొభమే పాపానికి తండ్రి.

(తండ్రి అనగా బీజ పురుషుడు, అలాగే లొభమే పాపానికి బీజము.)  
       


18, మే 2012, శుక్రవారం

పుష్కరము - పుష్కరాంశ - పుష్కరభాగలు వివరణ.

       

                                                    ఓం నమః శివాయ
.
                   ఈ రోజు నర్మదానది పుష్కరాలు ప్రారంభము. దీని సందర్భముగా.
                                          
                                                               
      పుష్కరాంశ: పుష్కరాంశ అనునది రెండు పదాల కలయిక అనునది ఇట్టే అర్థమయ్యే విషయము.

పుష్కరం :  పుష్కరం అనగా 12 సంవత్సరములు అని అందరికి తెలిసిన విషయమే. అనగా ఇది గురువుకి సంభందించిన విషయము. గురువు (బృహస్పతి) భ చక్రములొని ఒక్కొక్క రాశినందు ఓకసంవత్సరము వుంటాడని అలా 12సంవత్సరములలో భ చక్రము పూర్తిగా చుట్టిరాగలడని విదితమే.దీనినే పుష్కరమని అంటారు.అలా గురువు ఒకరాశి ప్రవేసించే మొదటి 12 రొజులను పుష్కరమని,అలానే ఆరాశి వదిలివెళ్ళే చివరి 12 రొజులను అంత్యపుష్కరముగా గుర్తించుచున్నాము.


  అలాగే, ఇంకా ఒక్క సంగతిని గుర్తుంచుకొవాలి. పుష్కరుడు(పురుషుడు) నదీమాతను(స్త్రీ) చేరు సమయము (సంగమ).అలా ఆసమయమున గురుడు ఆనదీని ఆశ్రయించి వుంటాడని ఓనమ్మకము.అలాగే గురువు పుత్రకారకుడని మనము ఇక్కడ ఒక్కసారి మననము చేసుకొవాలి. అలా పుష్కరుడు నదిని అశ్రయించివున్నాడు.పురుషుడు, స్త్రీ  సంగమముచే పుత్ర సంభవము జరిగితే బాగుంటదని శాస్త్ర అభిలాషణీయము.  తద్వార పుణ్యగతులు కలుగుతాయని సూచితము.    
ఇక పుష్కరమనే మాటకు పుష్కలముగా లభించుట అనికూడ కలదు.ఇలా అన్ని విషయాలు మేళవించి చూస్తే సంగమము అనేది పుత్రేచ్చతో కూడాలి అన్నది శాస్త్రము యొక్క ఆఙ్ఞ. 
అనగా పుష్కరము యొక్క పూర్ణ ఫలము : పుష్కలముగా లభించు పుత్ర సంతానమే.
కామమును,లేక కోరికను మనము జ్యొతిష్యచక్రమునందు వున్న గ్రహాలలో శుక్రుడు చే సూచితము. ఇతనికి భృగుజ అని కూడ అంటారు.ఈ శుక్రునికి సంగమశక్తి,వీర్యమునకు ఆధిపత్యము గా మహర్షుల నిర్దేశ్యము. 
  మరి వివాహము ఎందుకు జరుపుతున్నామో మీకు అర్థమయి వుంటది. వివాహముద్వార తమ తరువాత తరమును సృష్టించి మన యొక్క ఆలొచనలను,శక్తులను,ఈ భూప్రపంచములో నిలిపి వుంచాలన్న అభిలాషతో సంతానమును వృద్ధి పరచుచున్నాము,తద్వార ప్రపంచము,ఙ్ఞానము వృద్ధి అగుచున్నది.

సంతానమే మొదటి ప్రాధాన్యముగా గల వివాహానికి పుష్కరలగ్నము సముచితము.
మొదట 12 లగ్నాలను అగ్నితత్వ,పృధ్వితత్వ,వాయుతత్వ,జలతత్వ అనే నాలుగు రకములుగా విభజించారు.వీటిలో పుష్కర భాగలుకూడ గుర్తించారు.

సంతానమే మొదటి ప్రాధాన్యముగా గల వివాహానికి పుష్కరలగ్నము సముచితము.
మొదట 12 లగ్నాలను అగ్నితత్వ,పృధ్వితత్వ,వాయుతత్వ,జలతత్వ అనే నాలుగు రకములుగా విభజించారు.వీటిలో పుష్కర భాగలుకూడ గుర్తించారు.

అగ్నితత్వ రాశులయిన మేష - సింహం - ధనస్సు రాశులందు 21 భాగమును పుష్కారాంశగాను   
భూతత్వరాశులయిన వృషభ - కన్య - మకరం నందు 14 భాగలను పుష్కరాంశగా
వాయుతత్వపురాశులయిన మిధున - తుల - కుంభము ల 24 భాగలను పుష్కారంశగా
జలతత్వపు రాశులయిన కర్కాటక - వృశ్చిక - మీన రాశులందు 7 భాగములను పుష్కరాంశ గా విభజన.

ఇవియే పుష్కర భాగలు. ఈ పుష్కర భాగలందు ముహుర్తము నిర్ణయించిన అన్ని ఫలితములు పుష్కలముగా సమకూరును అని చెప్పుదురు.

( ఈ టాపిక్ మొత్తము శ్రీ నీలం పూర్ణమొహన్,గుంటూరు గారిది. వారు ఇచ్చిన వివరణను నేను వ్యాసరూపముగా తేలిపాను. ఈ టాపిక్ కామేంట్స్, మీకు కలిగిన అనుమానాలకు ఇక్కడ పూర్ణమొహన్ గారి మెయిల్ అడ్రస్ ఇస్తున్నాను దానికి పంపండి "pm_neelam@yahoo.co.in) 

17, మే 2012, గురువారం

పెసరట్టు! తింటే ముల్లొకాలు అదిరేట్టు రుచి ఆహా!వొహొ!




 మన ఆహారాల్లొ పెసరట్టుది ఒక ఘనమయిన స్థానము.అల్లుడుగారొచ్చరంటే అత్తగారు హడావుడిగా చేసేది పెసరట్టు.ఓక బాస్ ను ప్రసన్నము చేసుకొవాలంటే బడుగు జీవీఆశ్రయించేది పెసరట్టు.జిహ్వచాపల్యము తీరాలంటే శరణుకొరేది పెసరట్టు.
ఈ పెసరట్టు పై అల్లం,మిర్చీ,జీలకర్ర,ఊల్లిపాయలు,వడపప్పు,ధనియాలకారము,కొత్తిమీర ఇలామీరుచికి తగ్గట్టుగా ఏక్కువగా వత్తుగా వేసి దోరగా కాల్పించి దానిపై ఇంత వెన్న వేసి ఆపై ఉప్మా దానికి అనువుగా పప్పు అల్లపచ్చడి(కొబ్బరిచట్ని,అల్లపచ్చడికాదు ఇది వేరె)  తో కలిపి అలా అలా తింటూ వుంటే నా సామిరంగా ఆహా! వొహో! అనవలసినదే.ఆదిక్కుమాలిన పిజ్జాలు,బర్గర్లు అన్ని దీని ముందు దిగదుడుపే.    
ఇంతటి పెసరట్టుని నేను మొదట్లొ తీనాలి అంటే చాలాభయపడే వాడిని కారణము మాఅమ్మగారు,మా మేనమామ భార్య మాఅత్త అయిన లక్ష్మిపంకజవల్లి గార్లకు ఈ పెసరట్టు పై పట్టు చిక్కలా.కాని నా వివాహము అయిన తరువాత కథ మారింది.మహలక్ష్మి నా ఇల్లాలు అయినది. మేము కాపురము పెట్టిన తరువాత ఆమే ఏప్పుడు పెసరట్టు అని ప్రతిపాదించని నేను పాత అనుభవాలతో వద్దు అని అడ్డు.మెల్లగా కారణము అడిగింది.నేను చేస్తానుకదా అన్న హామి అభయము.చెప్పకూడదుకాని మా మహలక్ష్మిది వంటలో ఖానాఖజానా సంజీవ్ కపూర్ కన్నా 2 మెట్లు ముందు వుండేంతటి ప్రఙ్ఞ.అంతకన్నా శుభ్రముగా చేసెటువంటి ఆచారణత్వము.        
అసలు నాకో అనుమానము రాజమండ్రి,కాకినాడ వాళ్ళు ఈ పెసరట్టులో పుడుతునే ఏదో డిప్లమా కొర్స్ చేసేవుంటారు లేకపొతే అంతటి కమ్మదనము రుచి ఎలావస్తాయి?!
మా మహలక్ష్మి మాత్రము శ్రద్ధగా,పద్దతిగా కావలసిన పదార్థములన్ని నానబెట్టి,రుబ్బి, ఇంకా టాపింగ్స్ కావలసిన ఊల్లిపాయలాంటివన్ని ఓపికగా తరగటము.ఆపై దోరగా కాల్చిన పెసరట్టుకి ఉప్మా చేర్చి మాకు పెట్టటములో త్రుప్తి చెందుతుంది. 
 చాలా చాలా థాంక్స్ మహలక్ష్మి.   

16, మే 2012, బుధవారం

ఇది మీరు చేయగలరా.... ?............చేయగలరు!




ఈ ప్రపంచములో అనేకమంది విధివంచితులు,ఆశోపనిహతులు,దురదృష్టవంతులు,అనేకరకాల రుజగ్రస్తులు. ఇలా అనేక మంది దీనగాధలు  మీ దృష్టికి మీడీయాద్వార, న్యూస్ పేపర్లద్వరా, టీవిలద్వారా,ఇంటర్నెట్ ద్వారా మీముందుకు వస్తుంటాయి . ఈ గాధ చదవగానే మీమనస్సు కదులుతుంది,గుండే బరువుతో ఇబ్బందిగా మారుతుంది,దుఃఖము తన్నుకు వస్తుంది. మీరు తత్ క్షణము వారికి ఏదో విధముగా సహాయపడాలని కృతనిశ్చయులు అవుతారు.వీరిలో కొంతమందికి ఆర్ధిక సహాయము చేయమని బాంక్ నంబర్లు కూడా ఇస్తారు.ఈ గాధ మీముందుకు వచ్చేసమయానికి మీరు ప్రయాణము లోవుండవచ్చు,అర్ధరాత్రికావచ్చు,లేకపొతే మీకు ఆర్ధిక వెసులు బాటు లేక పొవచ్చు.మీరు దాతలైన,దయాగుణము సమృద్ధిగావున్న వారైన పరిస్థితుల ప్రాబల్యములో మీరు కూడా చిక్కుకొని వున్నారు.ఏమి చెయాలో తెలియక సతమతమవుతుమటారు.కాని వారి దినగాధకు చలించిపొతుంటారు.అయ్యో ఇదా మానవత్వము అని బాధ పడుతుమటారు. ఆ సమయములో ఈ సూచన పాటించండి. మీబాధకు ఉపశమనము, తక్షణ తరుణోపాయము ఇదే .


ఇటువంటి దీనగాధ మీదృష్టికి వచ్చినప్పుడు మీరు సహాయపడటము ప్రధమవిధి. అటువంటిది సాధ్యము కానప్పుడు, మీరు ఆవ్యక్తిని ఉద్దేసించి మీ ఇష్టదైవాన్ని ప్రార్ధించండి. ఆపదలో వున్నవారి ఇబ్బంది నివారించమని పరమాత్మను కొరండి.వారు ఎవరో తెలియకపొయనా ఫర్వాలేదు కాని వారి తరుపున మీరు  ప్రార్ధించండి. ఇటువంటి నిస్వార్ధపూరిత ప్రార్ధనను పరమాత్మను కదలించి ఏవరో ఓక వ్యక్తి,ఓక దాత సహాయపడతారు.వారు దుఃఖములో పరమాత్మను వేడుకొవచ్చు,లేకపొవచ్చు.కానీ కుల,మత,బంధుత్వాలు,ప్రాంతీయ బేధాలు లేని, అనుబంధ రహిత నిస్వార్ధపూరిత ప్రార్ధనను పరమాత్మ ఆలకిస్తాడని నా విశ్వాసము,నా నమ్మకము.ఇది నేను ఆచరిస్తున్న విధానము.

మిత్రులు కొంతమందికయినా ఉపయోగపడుతుంది ఎమో అని మీముందుకు తీసుకురావటము తప్ప వేరుకాదు.

ప్రార్ధించే పెదవులకన్నా సహాయముచేసె చేతులు మిన్న, కాని కొన్ని సమయాలలో ప్రార్ధన కూడా ఆవసరమే. ఇది మీరు నిస్వార్ధముగా చేయండి.        

15, మే 2012, మంగళవారం

స్వయముగా ఆంజనేయస్వామి 10 రూపాయల అనుగ్రహ ప్రసాదము - ఇది మా ప్రత్యక్ష అనుభవము.


దైవం మిమ్ములను ఓక్కొసారి ఓక్కొ విధముగా అనుగ్రహిస్తాడు.ఆ అనుగ్రహ కటాక్షాలను జీవితములో మధురక్షణాలుగా మనస్సులో భద్రపరచుకొని స్వామి వారిసేవలో గడపాలి.


మేము మా అబ్బాయి శరణ్యకుమార్ పుట్టినరోజుకు అగష్ట్ 29కి దాదాపు ప్రతి సంవత్సరము తిరుమలలో వుండే విధముగా 2004 వరకు వెళ్ళినాము.అలా 1999 సం. లో మాతో సహా ఇంకా 10మందిదాకా వున్నారు.
చాలారోజులనుంచి షొలంగీరు వెళ్ళాలని సంకల్పము.అందుకు స్నేహితులు కూడా తోడు కావటముతో ప్రయాణము ఖాయమయింది. కాట్పాడి వెళ్ళి అటునుంచి షొలంగీర్ చూసి ఆపై తిరుమలకు రావాలని ప్రొగ్రాము.కార్యక్రమములొ అనుకున్న ప్రకారము షొలంగిర్ చేరినాము.ఈ షొలంగిర్ తమిళనాడు లొనిది కాని మన చిత్తూరుకు దగ్గర. ఈ షొలంగిర్ నందు 2 కొండలు.మొదటిది నరసింహ స్వామిది, రెండోవది ఆంజనేయస్వామిది.నరసింహ స్వామి కొండ ఉదయము మాత్రమే దర్శనము అందువలన మేము కూడా,ఉదయమే నరసింహ దర్శనము   వెళ్ళి మా బసకు తిరిగి వచ్చి ఆహారము,విశ్రాంతి తీసుకొని సాయంత్రము ఆంజనేయ దర్శనమునకు వెళ్ళాము.

అలా సాయంత్రము 7.30 ప్రాంతములో ఆంజనేయస్వామి దర్శనమునకు వెళ్లివచ్చాము.అందరము సత్రము మెట్ల వుండి ఎవొ కబుర్లు ఆడుతుండగా అంతలో శ్రీ స్వామివారు వానర రూపములో అలా వచ్చారు.అందరు చూస్తుండగానే,10 మంది మధ్యలో వున్న నా భార్య మహలక్ష్మి కుడిచేయి దగ్గరకుతీసుకోని చేతిలో పదిరూపాయల నోటు వుంచి అలా వెళ్ళిపొయారు.దాని తో మేము కలా నిజమా అని నమ్మలేని పరిస్థితి ఎర్పడింది.మా అమ్మగారు కూడా ఆసమయములో మాతోనేవున్నారు.నాన్నా ఇది స్వామివారి ఆశ్వీరవాదమురా  ఆపదిరూపాయలు జాగ్రత్త అని చెప్పారు.నేటికి ఆనొటు మాపూజామందిరములో.

నమ్మినా నమ్మకున్న ఇది జరిగింది.
     


                                           
hanuman mantra in sanskrit

14, మే 2012, సోమవారం

శివుడి కుటుంబములొని వింతలు






ఆది దంపతులంటే శివ పార్వతులు అన్నది జగద్విదితమే. మరి మీరు ఎప్పుడన్నా పరిశీలించారా వీరి కుటుంబాన్ని. అన్ని పరస్పర విరుద్ధాలే.రూపాలు,గుణాలు,వాహనాలు ఇలా అన్నింటిలొను ఎదురు ఎదురు .అలాగే సంతానములో ఓకరికి ఇంకొకరికి పరస్పర భిన్న ధృవాలే.మరి చూడండి అవి ఎమిటో.    
 
  పరమశివుడు : దేనికి చలించని స్వాభావము.ఎటుచూసినా ఒకేలా దర్శనమిచ్చే లింగరూపము.భక్త సులభత్వము.ఎవరు ఎదికొరినా ఇచ్చే స్వభావము.విభూతి,గజచర్మాలు,జటాజూటాలు ఆలంకరణలు.ఇక ప్రియమా సామాన్యమయిన గంగ జలాభిషేకము.వాహనమా నంది.మొద్దు శక్తికి ప్రతీకయిన నంది సాధుజంతువు.అందరికన్నా ఎక్కువగా మూడోకన్ను. అంటే అందరిని అలా పరిశీలించి చూడగలదు.కాని తెరవడే.ఆయుధమా త్రిగుణాలనికూడా సంహరింఛే త్రిశూలం.అందుకే నిరాకార సచ్చిదానంద రూపము.ఇక రుద్రాక్షలు,పాముల సంగతి సరే సరి.అలానే కష్టాన్ని ఎవరికి చెప్పుకొలేని పురుషత్వానికి ప్రతీకలా కంఠములో గరళము.ఎప్పుడు చూసినా ఓకెలా వుంటాను అన్నదానికి ప్రతికలా అష్టమినాటి చంద్రుడు. భార్యను కూడా బిక్ష అడిగేంతటి సహ్రుదయత.సంచారాలు రుద్రభూములు.


పార్వతి :సరిగ్గా ఇందుకు పూర్తి వ్యతిరేకమయిన స్త్రీ స్వభావము.అమ్మది జగన్మొహన రూపము.సకల ఆభరణ భూషితము.సౌదర్యలహరి వర్ణించేంతటీ మంగళరూపము.అందుకే అమే సర్వమంగళ.అన్ని జగాలు నావే,అన్ని రూపాలు నావే అన్నట్లు తల్లి శ్రీచక్ర రూపములో. మరి ఇంతటి అమ్మను ప్రసన్నము చేసుకొవాలన్న చాలా కష్టము.అయితే అమ్మ హ్రుదయము ప్రసన్నమే.అమ్మరూపాలు బాల,రాజరాజేశ్వరి లాంటి శాంత రూపాలు,కాళి లాంటి తామస రూపాలు,నవదుర్గలు,వామాచారములొని అనేక వందల రూపాలు అన్ని అమ్మవే. అమ్మ రూపాలు, అలంకరాల్లా పూజలు ఎక్కువే.త్రిశతిలు,సప్తశతిలు,పారాయణలు,నవావరుణ,కుంకుమపూజలు ఇలా ఎన్ని చెసినా ఎదొ ఓకటి తక్కువయిందనే భావన. ఇక ఆయిధాలంటారా రూపానికి తగ్గట్లు. మన ఇల్లాళ్ళు చూడండి అవసరానికొ వస్తువు ఉపయొగిస్తారు అలాగా.వాహనమా సింహము. ఇది మృగరాజు అని గుర్తుంచుకొండే.
              

వినాయకుడు : గజముఖుడు,ఓజ్జరూపము.ఏక్కడకు కదలని తత్వము.అన్నింటికి నేను ముందు అనే ప్రారంభ పూజ.ఎవరు ఎంచెప్పినా వింటాను అన్నట్లు పెద్ద చెవులు.తను కదలలేడు కాబట్టి ఎవరన్నా గుంజీలు తీసి,మొట్టికాయలు వేసుకుంటే సంతృప్తి చెందుతాడు.ఇంతటి భారి కాయునికి ఓక చిన్న ఎలుక వాహనము.ఈ ఎలుక పాముకు ఆహరము.ఈ పాములు శివుని భూషితాలగానేకాక, తమ్ముడు కూడా సుబ్రమణ్య అవతారములో సర్పరూపుడే.

కార్తికేయుడు  :  ఈయనకు 6 ముఖాలు వున్నాయి.నియమ నిబంధనలంటే ప్రాణము.దేవసేనాపతి.ఈయన సర్పరూపుడు, మరి వాహనము నెమలి. నెమలికి పాముకి వైరము.అంత శత్రువైనా తన ప్రాణశక్తి తో లొంగతీసుకుని వాహనముగా మార్చుకున్న వైనము.


    ఇలా శివుని కుటుంబములో అన్ని వింతలే.అన్ని వైరుద్ధాలె.

కాని ఇంతటి వ్యతిరేకతను సమన్వయ పరుచుకొని ఆదిదంపతులయినారు.

మీరు గమనించారో లేదొ మన కుటుంబాల్లొని స్త్రీ,పురుషులకు ఇవే లక్షణాలు కలిగి వుంటాయి.సమన్వయ పరుచుకొని జీవించటమే జీవలక్షణము.ఇవే దాంపత్యనికి మూల సూత్రాలు.




13, మే 2012, ఆదివారం

మీకు కలలో యోని చూపుతున్న స్త్రీ దర్శనమిస్తుందా!


దాదాపు ఈ శీర్షిక చూడగానే చాలామంది కొంత సందేహానికి,కొంత ఆగ్రహానికి లోను అవుతారు.


కలలు అంటే సర్వులకు తెలిసినదే,సాధారణ జీవితములో తీరని,దోరకని,సాధించలేని,సాధించవలసిన వాటిగురించి ఆలొచిస్తూ నిద్రించితే మనకు,ఆ సుషుప్తావస్థలో అనేక రంగులమయ ప్రపంచము లో అనేక దర్శనాలు.ఇవి అన్ని నిజమా, కాదు. కాని సాధించటానికి ఉత్ప్రేరకాలు.కాబట్టే కలాంగారు కలలు కనండి సాధించండి అని యువతరానికి బొధిస్తున్నారు.పాపము అంత పెద్దయాన చెపితే కాదనకూదదని మన ముదుర్లు ఇంకోకలలుకంటారు ఇది వేరే సంగతి.
      కానీ అధ్యాత్మిక జీవనములో కలలుకూడా ఒక ప్రత్యేక స్థానము,విలువ వున్నాయి.సాధారణ చర్మచక్షువులకు అందివ్వలేని దర్శనాలను,అనగా సాధన ప్రారంభీకులకు,సాధనలేనివారికి,పూర్వపుణ్యాలు బలముగా వున్నవారికి ఇలా కలలద్వారా అనేక సంఘటనలు సూచించటము,దర్శనము చేయటము జరుగుతుంది అనేది వాడుక.


మరీ ధ్యానసాధకులకు అనేక దివ్యదర్శనాలు కలుగుతాయని అంటారు.అలా కొంతమంది సాధకులకు ఇటువంటి కల వస్తుంది.కొంత మంది బెదరి తమ గురువులకు విన్నవించుకొగా వారు అనునయముగా సరిదిద్దుతారు.

మరి కారణము ఇదీ.

సకల జీవులయందు ఆత్మకలదని ఈ ఆత్మ పరమాత్మ  ప్రతిరూపమని వైదిక విఙ్ఞానం తెలుపుతుంది.జీవునకు తల్లి గర్భములో వున్నప్పుడు తాను పరమాత్మ ప్రతి రూపమని ఎరుక వుంటుంది.  ఈ ప్రపంచానికి సృష్టి నుంచి పాంచభౌతికమయిన దేహముతో యోనిమార్గం ద్వారా వచ్చామని  సర్వులకు విదితమే.ఈ ప్రపంచపు శ్వాస పీల్చగానే, పరమాత్మ తనకు ఆజీవునకు(ఆత్మ రూపునకు) గల బంధాన్ని మాయలో వుంచుతాడు. దీనితో ఆజీవునకు తను దేహరూపుడు అనే ధ్యాస తప్ప ఆత్మరూపుడనే ఎరుక కలుగదు.కాని పరమాత్మ ఆధీనములొనే జీవుని సకల కార్యక్రమాలు. అందువల్ల మయాకు గురికాబడిన జీవుడు సుకర్మ,దుష్కర్మలు చేస్తూ ప్రార్బధకర్మ ఫలాన్ని సంపాదిస్తున్నారు.ఇందువలన జన్మరాహిత్యము లేని వాడయి జన్మపరంపర సలుపుతూ ప్రతిజన్మనందు సంచిత ప్రార్బధ కర్మ ఫలాలను కొనివచ్చి ఆ జన్మనందు సుఖః దుఃఖాలకు తమకు తామే కారణమవుతున్నారు.కాని పరమాత్మ ను చేరు ఉద్దేశ్యముతో జీవుడు సాధన చేస్తే సాధన ద్వార పరమాత్మను సందర్శించవచ్చని యోగశాస్త్రం తెలుపుతుంది.
     
.   యోగశాస్త్రం నందు దేహం లోని సహస్రారం నందు పరమాత్మ కొలువుయి వున్నాడని,ఈ పాంచభౌతిక దేహముతో తీవ్రసాధన ద్వారా పరమాత్మను సందర్శించవచ్చని తెలుపుతుంది.దేహము శాశ్వతము కాదు, ఆత్మరూపము శాశ్వతమని దానిని పరమాత్మతో అనుసంధించటమే  ఆత్మఙ్ఞానం. మరి మన దేహం నందు వున్న సహస్రారం ను మనం దర్శించలేమా అని అనుకొవద్దు. ఎంతో అభిలాష, దైవానుగ్రహము వుంటేకాని సాధన ప్రారంభం కాదు ఈ విద్యకు తగ్గ గురువు లభించరు.

కానీ నేడు మనం పాంచభౌతికమయిన దేహముతో ఆత్మఙ్ఞానం కొరకు పరితపిస్తూ సాధన చేస్తూన్నప్పుడు, సాధన సాధకము అవుతున్నది అనేదానికి స్వప్నావస్తలో ఇటువంటి దర్శనం.


 నిద్రని నిత్యమరణం అనికూడా పిలుస్తారు. సాధకులకు దేహం సుషుప్తావస్తలో వుండి మనస్సుమాత్రం జాగ్రదావస్తలో ఆత్మఙ్ఞానం నకు పరితపిస్తుంది.అటువంటి సమయములో లభించు దర్శనమే ఈ కల.

   మనము సృష్టి నుండి ఈ పాంచభౌతికమయిన దేహానితో  ఈ ప్రపంచములొకి యోనిమార్గముగుండా వచ్చాము.మరి నేడు ఈ పాంచభౌతికమయన శరిరముకాదని సృష్టిస్వరూపము తెలుసుకొవటానికి తద్వార ఆత్మస్వరూపము తెలుసుకొవటానికి సాధన చేస్తున్నాము. కాబట్టి మనము సృష్టి నుండి యోని మార్గము ద్వార వచ్చాము అంటే మనము సృష్టిలోకి వేళ్ళలంటె అదే యోనిమార్గాన్ని అశ్రయించాలి.అదే ఆత్మ రూపానికి దారి.అందుకే యోగమాయ కలలో యోనినిచూపుతూ మార్గము నిర్దేసిస్తుంది.కనుక మీరు వికారాలకు లోనుకాక ఆతల్లికి నమస్కరించి అందులొనికి ప్రవేసించి ఆత్మరూపులుకండి.



       


12, మే 2012, శనివారం

వెన్న తిన్న మూతి చూడ నాకు ముచ్చట



వెన్న తిన్న మూతి చూడ నాకు ముచ్చట

మన్ను తిన్న మూతి చూడ యశోద ముచ్చట

లక్ష్మీస్థీత వక్షాన కౌస్థభమే ముచ్చట

వేణువూదు పెదవులే పెద్ద ముచ్చట

కురులు దువ్వి చుంచుపెట్ట నాకు ముచ్చటా

చిలుకుపచ్చ శిరోవేష్టం నాకు ముచ్చట

తులసిమాల వేసి తనువు చూడముచ్చటా

అమ్మ అంతరంగమే అమిత ముచ్చట

వైకుంఠవాస హరినారాయణ కృష్ణా

నీ దరిచేర్చు బాలకృష్ణా! చిన్నారి కృష్ణా!




తవ చరణం మమ శరణం పుస్తకములో పై పద్యము కలదు.

11, మే 2012, శుక్రవారం

కారణ కారణ సంబంధాలు - వారణాసి అనుభవము.



అవి 2004 విజయదశమి రొజులు. మేము 5మందిమి విజయవాడ నుంచి వారణాసికి మామామగారి అస్థినిమజ్జనకార్యక్రమమునకు వెళ్ళినాము.వారణాసిలో మాబస గుంటూరువారిసత్రం నందు.
మాకార్యక్రమములు పూర్తిచేసినాము.దైవదర్శనము జరిగినది.స్థానిక దేవాలయాలు,సందర్శనీయస్థలాలు అన్ని కూడా చూసినాము.
మా ప్రొగ్రాములో తరువాతిది ఆయిన అయోధ్య,నైమిశారణ్యము సందర్శన.దీనికి గాను సత్రము ప్రక్కనే వున్న ట్రావెల్స్ వారిని సంప్రదించి.ఈ 2 ప్రదేశములు చూపి మమ్ము లక్నోలో డ్రాప్ చేయాలి ఈవిధముగా మాట్లాడుకొన్నాము. అడ్వాన్స్ కూడా ఇచ్చాము.మరుసటిరొజు సాయంత్రము వెళ్ళాలని నిశ్చయము.ఉదయము పూట అవకాశము వున్నదని వింధ్యవాసిని దర్శనమునకుకూడా వెళ్ళివచ్చాము.భొజనము ముగిసిన తరువాత మా బావమరదిని వెళ్ళి మేము సిద్ధమని ట్రావెల్స్ వారికి తేలిపిరా అని పంపినాను. అతను వచ్చి బావగారు 30నిముషములలోపు పాండేహవేలి వద్దకు సుమోవెహికల్ వస్తుంది అని తెలపగా.అందరము సత్రము ఖాళి చేసి 3.30ని. లకు చేరినాము.వెహికల్ రాలేదు,కొంతసేపు నిరిక్షణ తరువాత ఫొన్ చేయగా ఇదిగో అదిగో అని 6 సా.గం. ఆయినా రాదు.ఎమి చేయాలో అర్థముకాదు.ట్రావెల్స్ వాడిమీద గట్టిగా అడిగితే కొంత సహాయాపడుతాడు అనుకున్నా కాని శూన్యము.వాడికి స్థానికుడననే గీర తప్ప ఇంకొటికానరాలేదు.             
ఆడవారితోసహ అందరము రోడ్డుమీద. ఎమిచేయాలో తేలియలా "నాయనా నీదే భారము నిన్నునమ్మి ఇక్కడికొచ్చాము అని మన్సులో పరమేశ్వరుడుని ప్రార్థించా". అంతే అప్పటిదాక సహకరించని ట్రావెల్స్ యజమాని  సన్నగా బక్కగా వున్న వ్యక్తితో అక్కడకు వచ్చి యేమిచేయాలో తెలవటములేదని అన్నాడు.నేను కూడా ఇలా అయితే ఎలా దబ్బుతీసుకునికూడా ఇబ్బంది పేడితే ఎలా అన్నా.మేము అడగకుండానే మాతాలుకు ఇబ్బందిగ్రహించిన మధ్యవ్యక్తి నేను మిమ్ము తీసుకొనివెళ్ళతాను.డబ్బుకూడా మీఇష్టము గతములోలానే ఇవ్వండి అని.ఒక్క క్షణములో వేహికల్ తో మా మధ్య ప్రత్యక్షము.

పొని మమ్ము ఇబ్బంది పెడతాడేమోనని నాభయము.కాని మేము సుమోలొ ఎక్కిందిమొదలు మేము ఆతని స్వంత బంధువర్గములా ఆహారాలవద్ద,ఆయోధ్యలో బస వద్ద,నైమిశారణ్యములో లొకల్ వారి ఆగడాల నుంచి రక్షించి మమ్ము చూసినతీరు మాకు అతనికి ఎదొ జన్మ సంబంధములా వున్నది.అలా మా ట్రిప్ కంప్లీట్ చేసి లక్నోలో డ్రాప్ చేసినదాకా ఎదొ కలలా జరిగిపొయనది.

ఇవి ఆదేవుడు కలిపిన సంబంధాలు.            

10, మే 2012, గురువారం

రాధ ఏవరు ? క్రిష్ణుడు రాసలీలలు ఎందుకు ఆడాడు?




                                      శ్రీ క్రిష్ణుడు ఇలా తలవగానే మనమదిలో ఒక హాయి ఇది బాలరూపము,  ఒక అల్లరి రూపము గొకులములొది,మరల అంతలొనే బృందావనరాసలీల మనొహర రూపము ఇలా మన మనస్సుని వశపరుచుకున్న పరమపురుష స్వరూపము. 
  
గోకులం లొ  నందుని ఇంటికి  క్రిష్ణుడు రావటము మానవజాతికి గొప్ప వరము. గోకులములో ఈ బాల క్రిష్ణుని లీలావినొదము అంతటికన్న  గొప్ప దివ్యచరితము.ఈ బాల క్రిష్ణునిలోవున్న పసితనము,ముగ్ధమోహనత్వము,అమాయకత్వము,గడుసుతనము,అల్లరి.

ఈ రూపములో యశొదకు,గోవులకు,గోపాలకులకు,గొల్లభామలకు,గిరులకు,తరులకు,మడుగులకు ఇలా సర్వప్రకృతి అంతటికి తన స్పర్శ ప్రసాదించాడు,తన ప్రేమ పంచాడు.వారి ఆరాధన స్వీకరించాడు.  


అసలు ఈ గోకులములో ఎన్నిలీలలు పరిశీలించండి పూతన,బకుడు,తృణావర్తుడు,శకాటాసురుడు,గోవర్ధనము,కాళింది,యశోదకు విశ్వరూపసందర్శనము ఇలా ఎన్ని చూపినా అన్నింటిలొను  ఒకటే లీలామానుష వినోదము.

మరి అదే బృందావనములో ఈ గోపికలంతా తామే క్రిష్ణులమయి, ఖచ్చితముగా చెప్పాలంటే విదేహులయి పూర్తిగా తమను క్రిష్ణునికి అర్పించేంతంటి ఆరాధన,ప్రేమ.

ఈ ఆరాధనకు,ప్రేమకు రూపము కలిపిస్తే "రాధ" అయింది. రాధ అంటే అఖండ ప్రేమతత్వము.రాధంటే ఓక్కరు కాదు గోపికలందరి ఉమ్మడిరూపము.అంతటి ఆఖండప్రేమమయిమైన రాధప్రేమలో క్రిష్ణుడు ఓలలాడాడు,ఆ ప్రేమను స్వీకరించాటానికి పరితపించాడు.తాను కూడా ఆగొపికలందరికి ప్రేమను పంచటానికి వివిధరూపాలు ధరించి రాసలీలలు జరిపాడు. 




9, మే 2012, బుధవారం

కారణ కారణ సంబంధాలు




 ఈ కారణ కారణ సంబంధాలు బహు విచిత్రముగా వుంటాయి. అనుభవములొనే తెలుస్తాయి.

ఆడవిలో ఉసిరికాయ,సముద్రములొని ఉప్పు,ఊరిలొని కారము కలిస్తే ఊరగాయగా మారింది.కాని వీటిని అనుసంధానము చేసినవాడు మానవుడు కాబట్టి ఆహారము అయింది,వ్యాపారము ఆయింది.


తోలుబొమ్మలాటలో ఏపాత్ర ఏప్పుడు ప్రవేశమో,నిష్క్రమణో,కథాగమనానికి తగ్గట్టు మొదటినుంచి చివరకు పాత్రలను నడిపించే బాధ్యత నిర్దేశకుడే.కాబట్టి వినొదము అయింది.

కాని జీవితము ఇవేవికాదు అనుభవాల సమాహారం.ఈ జీవన చిత్రణలో ఏవరిని ఏప్పుడు మనకు అనుసంధానము చేయాలి,ఏప్పుడు నిష్క్రమింపచేయాలి అన్నది పూర్తిగా పరమేశ్వర ఆధినములొనే వుంటుంది అన్నద్ది సర్వులకు విదితమే .  ఇంకొద్దిగా వివరము.

మనము మనసాధారణ జీవనములో ఎవరికన్నా ఉపయొగిపడినా,సహాయము చేసిన, మనకు వారు మన అవసరాలలో ఆదుకుంటారనో లేక ప్రత్యుపకారము చేస్తారనో భావనలో వుండటము సహజము.కాని ఆలా జరగదు.ఇందువలన కొంత ఖేదన సహజము.ఇది వ్యవహారికము.కాని ఈ కర్మఫలితము మన పాపపుణ్యాల ఖాతలో నమోదుచేయబడుతుంది.ఇది సృష్టిలోవున్న  అనుల్లిఖిత నిబంధన. ఇది జరుగుతుంది, జరిగీతీరుతుందీ. 
             
మీరు, మీకు అవసరమయినప్పుడు, ఆ పరమేశ్వరుదు తప్ప అన్యులు సహాయము చేయగలవారేవరు అన్న భావన కలిగితే, మీరు భక్తితో ఆ పరమేశ్వరుని కొరండి,పిలవండి చాలు.

ఇక, ఆపై పరమేశ్వరుని భాధ్యత.

ఎవరో ఎందుకో వచ్చి మీకుసహాయపడతారు. మీ తాలుకు ఆవసరము గడిపి,మీ ఇబ్బంది తీర్చుతారు.సహాయపడ్డవ్యక్తి ఎవరో, ఎందుకుమీకు సహయముచేస్తున్నరో,దాదాపు వారి పేరు ఎమిటోకూడా మీకు అడగాలని అనిపించదు.

కాని తరువాత ఆలోచిస్తే,దేవుడే వచ్చాడా అన్నమాయ.

ఇలా జీవులకు జీవులకు పరమేశ్వరుడు కలిపే అనుబంధాలను " కారణ కారణ సంబంధాలు" అని అంటారు.

ఇది నా జీవితములో నేను 2 సార్లు గమనించా.బహుచిత్రముగా అవి "వారాణాసి" మరియు "కేదారనాథ్" నందు.       


 


8, మే 2012, మంగళవారం

పరశురామ అఙ్ఞాతవాసము

రేణుకా,జమదగ్నిల పుత్రుడు పరశురాముడు పితృవాక్యపరిపాలన వలన తల్లిని సంహరించి,మరలా అదే తండ్రీ వరప్రభావముచే తల్లిని పునర్జీవింపచేసిన విశిష్టలక్షణుడు.ఇంతటి పరశురాముడు ఊగ్రుడు,ముక్కొపి.శివుని మెప్పించి ఆయిధముగా గొడ్డలిని సంపాదించినవాడు.తన తండ్రికి జరిగిన ఘోరమునకు ప్రతీకారముగా 21 మార్లు క్షత్రియవంశ నిర్మూలన కావించి సకల ధరామండలము అంతటిని తన ఆధినములో తెచ్చుకున్నవాడు.    


ఇంతవరకు కథ బాగానేవున్నది.అసలు మలుపు ఇక్కడే ప్రారంభము. క్షత్రియిలందరి నిర్మూలన రాజ్యాలన్ని పరశురామ ఆధినములో కానీ పరశురాముడు పాలనకాక తన తపస్సులో.మరి ఇంకేముంది రాజులేని రాజ్యములో పరిపాలన లేక, రాజ ఉద్యొగుల దుర్మర్గాలకు ప్రజలు బలి.శిక్షలు లేక నేరాలు పెచ్చరిల్లటము.ఇలా అనేక ఇబ్బందులతో రాజ్యాలన్ని అల్లకల్లొలముగా వున్నాయి.అంతా అరాచకము.ఇది గమనించిన సకల మునిగణ,పండిత సభలో ఈ సమస్యపై చర్చ.చివరకు ఓక నిర్ణయానికి వచ్చి భాధ్యత కశ్యపునకు అందచేసినారు. పరశురామునకు కబురుపంపి ఆయినను ఈ మునిగణ పేరలొగమునకు ఆహ్వానము.ఆంత పరశురాముడు రాగా ఈ సభనిర్ణయము ఇది అంటు మీవద్ద వున్న సకల రాజ్యాలను కశ్యపునకు ధారపొయాలని తెలిపినారు.ఆపై పరశురాముదు సకలభూమండలాన్ని కశ్యపునకు ధారపొయగా, దానితో కశ్యపుడు ఈ రాజ్యలన్నిటికి రాజుగా మారిపొయాడు.      

దానితో కశ్యపుడు ,పరశురాముని ఉగ్రలక్షణము తెలిసినవాడై మరలా పరశురాముడు జనజీవనస్రవంతిలో వుంటే మరలా ఇటువంటి ఇబ్బంది వస్తొందని పరశురాముని సముద్రతీరప్రాంతమునకు వెళ్ళమని అదేశించాడు.దానితో పరశురాముడు నేటి గోవా ప్రాంతములో శిక్ష,అఙ్ఞాతవాసము,సముద్రతీరప్రాంత ప్రవాసము ఇలా ఎమయిన అనండి అక్కడకు వెళ్ళిపొయాడు.  


7, మే 2012, సోమవారం

కులవర్గీకరణలు,కులపొరాటాలు ఓక్కటి చేస్తున్నవా? - ఓక్కడిని చేస్తున్నవా?


భారతదేశములో పేరు,ఊరు లేక పొయిన బ్రతుకుతారు కాని కులము లేకపొతే బ్రతకలేరంటే ఆశ్చర్యపొనవసరములేదు.
అంతలా భారతదేశ జనజీవనములో కులవ్యవస్థ పాదుకొనిఉన్నది.నేటి కాలములో సమాజము కన్నా కులము పేరు చెప్పి పబ్బము గడుపుకునే రాజకీయనాయకులకు,కుహనా కులపొరాటాలముసుగులో తమ ఆస్తులు,ప్రాబల్యము పెంచుకునే వారికి అవసరము ఎక్కువగావున్నది. వీరి ఆగడాలకు బయటవారికన్నా స్వవర్గమువారే ఎక్కువబలి ఆవుతున్నారు.  
మనువు 4 వర్ణాలు స్రష్టిస్తే.కాల సమాజ అవసారలనుబట్టి వ్రత్తులు ఏర్పడ్డాయి.అలా అనుచానంగా చేస్తున్న వ్రత్తులనుబట్టి కులవ్యవస్థ.గ్రామ ప్రజలకు ఆవసరమయిన వివిధసేవలను వివిధ వర్గాలు నిర్వర్తించటము, దాని లొనీ మంచి చేడులను బట్టి కొన్ని వర్గాల స్వార్థము వలన అగ్రకుల,దిగువకులాలు గా విభజన.   
ఇక దీనిలొని లొటుపాటులు,ఏవరు ఏవరిని దొచుకున్నారు,ఏవరు అణచివేతకు గురి అయ్యారు అన్నది అంతులేని చర్చ. 
ఇక విషయానికి వస్తే, మీరు ఓక్కసారి సముద్రాన్ని వూహించుకొండి, అనంత జలనిధి నర్మగర్భంగా దిక్ మండలము అంతా వ్యాపించివున్న జలరాశి.శాంతముగా వున్నప్పుడు ఎన్నొ ఇచ్చే సాగరుడు ఆగ్రహిస్తే ప్రళయము.మరి ఇంతటి జలరాశి ఒక్కసారి ఎర్పడినదా?అనేక వేల కొండల్లో కొనల్లో, వేల గ్రామాల్లో కురిసిన ఒక్కొ చినుకు ఏరులుగా, వాగులుగా,నదులుగా ప్రవహించి అనంత సాగారాన్ని ఏర్పరుస్తున్నాయి.కాని పారే నదులకు ఆనకట్టలుకట్టి సస్యామలము చేస్తున్నారు. ప్రక్రుతి కాబట్టి సహిష్ణుతవున్నది. సాగరము నిండుగానే వున్నది.      
ఇక  ఇదే విషయాన్ని  మనసమాజ జనసాగరానికి అన్వయించండి వ్యక్తులు,కుటుంబాలుగా,వర్గాలుగా,సమాజాలుగా,గ్రామాలుగా జన సాగరాలుగా ఏర్పడ్డాయి.   
    మరి ఇంతటి సమగ్రతకు,విశ్వజనీనతకు ముప్పు? కులసమాజాలు,కులవర్గీకరణలు,కులద్వేషాలు అడ్డుకట్టలుగా ఏర్పడి మానావసమాజము తిరొగమనములో పయనించి చివరకు వ్యక్తివద్ద ఆగిపొయే పరిస్థితి. ఇంతటి తిరొగమనానికి మూలకారణము "కులము".   
 ఇంతాలా ఓక్కడవటానికి కారణము మాత్రము సమాజము కన్నా నాయకులే ముఖ్యకారణము.

6, మే 2012, ఆదివారం

శోభనము ముచ్చట్లు - ఓక ప్రత్యేక కథనము.


ప్రతి జంట వివాహమయిన తరువాత ఎంతలా ఎదురు చూస్తారన్నది సర్వులకు విదితమే. శృంగారము ఓక కారణమయితే ఈ క్రతువు తరువాత మాత్రమే వారిని దంపతులుగా పిలువటానికి నిజమయిన అర్హత సంపాదిస్తామని. సాధారణ భాషలో కార్యమని,అక్కరని వాడుక. షోడశ జాతసంస్కరాలలో మొదటిది అయిన దీనిని ఇక్కడ గర్భాధానమని,పునహఃసంధానమని పిలుస్తారు.కాని ఎక్కువగా శొభనమని వాడుక. కారణము. శొభ అనే మాటకు కొరీక,వెలుగు,వస్త్రాభరణ భూషితముతో వచ్చు కాంతి(శబ్దరత్నాకరము) అని అర్థాలు.ఈ మూడు అర్థాలు ఈ సంధర్భానికి చక్కగా సరిపొతాయి.అనగా జీవితానికి వెలుగు, తద్వార సంతానమును ప్రసాదించు కార్యము కాబట్టి శోభనమని వాడుక.


ఇది గృహాన్నిబట్టీ,కులాన్నిబట్టీ,ప్రాంతాలని బట్టి అనేకా ఆచారాలుగా,చివరకు వేడుకగా మారిపొయింది. వీటి గురించి తెలుసుకునేముందు గర్భాధానము యొక్క పూర్వా పరాలు తెలుసుకుందాము.
         
మానవుని జీవితము సంస్కారములకు క్షేత్రము.అందు సంతానమును కనుట ప్రాధాన్యము. పూర్వము సంతానమే వాళ్ళ సిరి సంపద.ధర్మశాస్త్రములు సంతానముకనుట పరమ పవిత్రమని పేర్కొన్నవి.ఈ గర్భధారణ ద్వార పురుషుడు, స్త్రీ యందు తన బీజమును వుంచుచున్నాడుకనుక ఇది గర్భాధానమయినది.ఈ సంస్కారము సమంత్రకముగా జరుగనిచో అశ్వలాయనస్మృతి ప్రాయశ్చిత్తము విధించినది.


తల్లి తండ్రుల మనోప్రవృత్తులను అనుసరించి సంతానముయొక్క మనస్సు,శరీరము ఏర్పడుచున్నవి. కామ,వీర,దైవీ లాంటి వివిధ భావాలలో ఎవరు ఏ భావముతో కలిస్తే అదే భావములో సంతానము కలుగుతారు.(మహభారతములో పాండురాజు,ధృతరాష్ట్ర,విదుర జననము).
కనుకనే గర్భాధాన సమయమున పతి తాను ప్రజాపతి అంశకలవానిగాను,భార్యను వసుమతి రూపమని భావించి కలియవలేనని ప్రాచీనుల అభిప్రాయము.

   స్త్రీ శారీరకముగా సమర్థురాలైనప్పుడు ఋతుస్నాత అయిన 5 రోజు రాత్రి నుండి 16 రోజు వరకు అని మనఃస్మృతి చెబుతుంది.మాసమున కొన్ని దినాలు సంగమమునకు నిషిద్ధము.సంక్రమణ దినాలు, పండుగలు,పర్వదీనాలు,పితృకార్య ముందురొజు, ఆరొజు,అష్టమి,చతుర్దశి,పౌర్ణమి,అమావాస్య,ఏకాదశీ,త్రయోదశి లు తిథులలో. శని,ఆది,మంగళ వారాలలొ, భరణి,కృత్తిక,ఆర్ధ్ర,మఘ,పుబ్బ,విశాఖ,జ్యేష్ట,మూల,పూర్వాషాడ,పూర్వాభాద్ర నక్షత్రాలలో వర్జితమని శూద్రకమలాకరము.
ఈ శొభన లగ్నానికి గురు,శుక్ర శుభదృష్టి అవసరము.

  ఇక వేడుకలకు వద్దాము. వేడుక అంటే ముచ్చటగా జరుపుకునే మన గృహకార్యక్రమము.

 గత కాలములో బాల్యవివాహాల వలన అమ్మాయి రజస్వల అయిన తరువాత మంచి మూహుర్తము చూసి మరి జరిపేవారు.అందువలన వివాహానికి ఈ కార్యక్రమానికి చాలా వ్యవధి వుండేది.ఇంతటి ప్రక్రియలో ఎప్పుడు వచ్చి చేరినదో తెలియదు కాని వివాహమయిన 3రొజులలో అని, 16 రోజులపండుగలోపని ఈ కార్యక్రమము జరిపే పద్ధతి ఎక్కువ అయినది .దానికి తోడు ఆగలేని కుర్రజంటలు, బిజీ జీవితాలు.

ఆరోజున "అల్లుడుగారిని పిలుస్తున్నాము" వచ్చి దంపతులను ఆశ్వీరదించి, "దంపత తాంబూలాలు "అందుకొవాలని తమకు హితులయిన బంధు మిత్రులను పిలుస్తారు.

     అమ్మాయికి తెల్లని చీర ఈ చీరకు సాధారణముగా ఒక్క నల్లని చుక్కకూడాలేకుండా ఎంపిక చేస్తారు.
పాతరొజులలో అల్లుడు అలకపానుపు అని డబ్బు దండుకునేవారు.
ఇక ఇంతటి కార్యక్రమానికి వేదిక అయిన పడకకు పూలతో ఆలంకరణ చేసి జంటను పంపుతారు. నేడు  ఫ్లొరిష్ట్ లు రూ40,000/- నుంచి రూ2,50,000/- వరకు చార్జ్ చేస్తున్నారు.

ఈ పడకపై రాత్రికి పానుపు వేసి వచ్చిన దంపతులకు 5,9 తాంబూలాలు ఇప్పిస్తారు.        
సాధారణముగా ఎవరొ ముసలమ్మలు అమ్మాయికు అబ్బాయి చెప్పినట్లు విను అని రహస్యముగా బొధ చేసెవారు. అబ్బాయికి అయితే మిత్రులో,వరసయిన బావలో సరసము జాగ్రత్త అని హెచ్చరికలు జారిచేస్తారు.

అమ్మాయి కట్నం గా కొంగుకు బంగారము కట్టే సాంప్రదాయము ఇంకావున్నది.
ఇక గదిలో అనేకరకాల స్వీట్స్,పాలు గురించి చెప్పవలసిన పని లేదు.
ఇలా అన్ని ముచ్చట్లు ముగిసి మూహూర్తసమయానికి ఆజంటను గదిలో వదిలి ఇవతలకు వస్తారు. ఇక ఆజంట ఎమి చేస్తారంటారా  ష్..ష్..గప్...చుప్.

ఇవి కాకుండా పాతరొజులలొ కొన్ని చిలిపి ముచ్చట్లు,వింత అలవాట్లు వున్నాయి.
పాతతరములో జంటలు బాగా లెత జంటలు. ఇటువంటి జంటలు పార్వతి పరమేశ్వరులని, వారు జరిపే సంసారం, సృష్టి కార్యముగా భావించి చాలామంది ముసలివారు రహస్యముగా చూడటానికి ఉత్సాహము చూపేవారు. 
కొంతమంది దీనికి వెరే అర్థము చెపుతున్నారు జంటలో ఎవరికన్నా సిగ్గు,బిడియాలతొ చేరిక కాక దాంపత్యము విఫలము కాకూడదని అలా చేస్తారు అంటారు. ఎవరి ఇష్టము వారిది.

ఇది కాకుండా ఇంకొ అల్లరి. కొంతమంది కొంటె మరదళ్ళు పడకకు రహస్యముగా గజ్జేలు కడతారు, చిన్నపిల్లలను గదిలో దాచి సమయానికి పిలుస్తారు,ఇంకొంతమంది బావగారిని అల్లరి పెట్టటానికి తలుపు తీసేవరకు దబ దబా తలుపులు తట్టి, తలుపు తీసిన తరువాత మరదలు కట్నము దండుకుంటారు.

ఇంతటి ప్రాశస్థ్యము గల శోభనము నేడు ఎదొ ఒక తంతులా ముగిస్తున్నారు.
మరి ఇటువంటి కార్యక్రమాన్ని హోటల్ గదుల్లాంటి అంక చండాలమయిన చొట్ల కనిసము సంప్రొక్షణ అయిన లేకుండా ఫ్యాషన్ గురించి జరిపితే వాళ్ళ దాంపత్యాలు ఏవిధముగా సరిగా వుంటాయి. 
ఇటువంటి క్రతువులు సరిగా జరగకపొతే దాని విషపరిణామాలు : సంతానలేమి,దాంపత్యములో కలతలు, ఇంకా ఇక్కడ ప్రస్థావించలేని అనేక అపభ్రంశాలు కలుగుతున్నాయి. 
నేడు కొంతమంది ముదుర్లు హాడావుడి పడి (వివాహానికి)ముందే తొందరపడి ఎలాపడితే అలా ఎక్కడ పడితే అక్కడ ముగించుతున్నారు. వారిని ఆ దేవుడేకాపాడాలి.





5, మే 2012, శనివారం

గ్రామీణ పిల్లల ఆటలు - మీరు ఆడినవి ఎన్ని?


వేసవి మహోత్సవాల గురించి పొస్ట్ వ్రాస్తుంటే అసలు నేను ఎన్ని ఆటలు ఆడానో పరిశీలీంచుదామని ఒక పట్టి తయారు చేసా.నాలా మీకు కూడా ఉత్సాహము ఉంటుందని పేర్లుమాత్రము పొస్ట్ లొ తెలిపినాను.
ఆటలు శారీరకవ్యాయామానికే కాదు మానసిక వ్యాయామానికి పిల్లలందరిలో సంఘీభావానికి,నాయకత్వలక్షణాలకు,ఒక పని ఎలా చేయాలి దానికి కావలసిన ఓపిక ఇలా ఎన్నో నేర్పుతుంది.అలా చిన్నప్పుడు ఆడుకున్న ఆటల లిస్ట్. 

1)దాకలబూచి దండాకొర్  2)వీరీవీరీ గుమ్మడిపండు  3) బొంగరాలు 4)తొక్కుడుబిళ్ళ 5)రైలు ఆట  6)స్కిప్పింగ్ 7)బంతి ఆట 8)బంతి ఆట కుండపెంకులతో 9)రింగు ఆట 10)చుక్ చుక్ పుల్లా 11)కబాడ్డి  12) వంగుడు దూకుడు 13) కర్రా బిళ్ళా 14) కర్రా ఆట హాకిలా ఆడతారు 15)అష్టా చేమ్మా 16) లైను ఆట  17) పులి మేక 18)పాము పటము 19)రాములవారి ఉరేగింపు 20)ఓప్పుల కుప్ప 21) వామన గుంటలు 22) అచ్చం కాయలు 23)చుక్కల ఆట 24) పదాలు వెతుకుట 25)గోలీలు 26)కాగితంతో పడవల్లాంటి  ఆకారాలు 27)బయస్కొప్ 28)దారం తో చిక్కుముళ్ళ ఆట 29)సినిమాలు ప్రదర్శన 30)కొబ్బరి ఆకు తో అమ్మాయి లాంటి బొమ్మలు 31)కొబ్బరి ఈనేలు పైకి పంపే ఆట 32)తాటికాయ బండ్లు 33)అగ్గి పెట్టేల సేకరణ 34)చారు ఆట 35)సైకిల్ టైరు,రిమ్ములతొ పరుగు 36)గాలిఫటాలు 37)కూల్ డ్రింకు మూతకు హోల్స్ వేసి దానిలో దారము పంపి ఆడే ఆట  

    ఇన్ని ఆటలు వివిధ వయస్సు లొ ఆడాము. కొన్ని ఆడపిల్లల ఆటలు చిన్నప్పుడుగావున్నప్పుడు వారితో కలసి.తరువాత మా జట్టువారితోనే ఆటలు. 
మీరు గమనించారోలేదో ఈ ఆటలన్ని దాదాపు ప్రక్రతిలొనే ఆడేది , ఆటకు కావలసిన వనరులు కూడా సహజ వనరులే.ఇక ఆర్థికంగా వ్యయమంటే దాదాపు శూన్యము కావలసింది బుద్దిబలము,దేహశ్రమ మాత్రమే.అందుకే ఏన్నితిన్నా ఏమితిన్నా అరుగుదల.  

కానీ నేటి పిల్లలకు కంప్యూటర్ ఆటలు లేకపొతే క్రికేట్.ఈ నాటి ఆటలు దాదపు ఇంటర్ యాక్టివ్ గా వుంటున్నాయి కాని దేహశ్రమ లేదు.
ఇన్ని ఆటలు పల్లెటూరిలో కూడా నాగరికత ప్రభావానికి లొను అయ్యాయి. నర్సరి నుంచే రాంకుల యావ.విద్యలో వ్యాపార ధొరణి,మా అబ్బాయి కొండ యేక్కాలనే పేరాశలు మధ్య ఈ ఆటలన్ని నిర్విర్యము ఆయిపోయాయి. కొన్ని ఆటలు కాలగర్భములో కలసిపొయాయి.ఈనాడు ఈఆటలు ఆడటము నామోషి.ప్రతీది వ్యాపరమయమయిన నేడు ఆటలు ఇందుకు అతీతముకాదు.క్రికెట్,చదరంగము,టెన్నిస్, లాంటీవి నేర్చుకొని తొందరగా కొట్లు సంపాదించాలనే ఆత్రము తప్ప ఇంకొటి కానరాదు.కారణము జివీతాల్లొకి చొచ్చుకొనివచ్చిన టివీ.ఇది ప్రజల ఆలొచన,ఆలవాట్లు,ఆహరము పై వీపరీతప్రభావము చూపుతుంది.     

4, మే 2012, శుక్రవారం

వేసవి కాల మహొత్సవాలు - ఇంటింటి సందళ్ళు - ఆవకాయ.


వేసవి కాల ఇంటింటి వేడుకలలో ఆవకాయది ఒక ముఖ్యఘట్టము.

మామిడే ఓక అద్భుతము ఆయితే మనవారి ఆవకాయ అంతకన్నా మహాద్భుతము.ఏర్రరని రంగు, టపక్ మనే పులుపు, స్ స్ మనేకారముతో నొరువూరటము వెరసి  మొత్తము కలిస్తే ఆవకాయ.  
మన తెలుగువారికి ఎన్ని కూరలు  వున్నా ఆవకాయ లేకపొతే ముద్ద దిగదు.అంతేందుకు 10 రోజులు బయట అలా ప్రయాణాలు చేసివచ్చినతరువాత వేడివేడి అన్నములో ఆవకాయ కలిపి దానికి ఇంత నెయ్యి కలిపి తింటే చవి చచ్చివున్న నాలుక పాముకన్నా వేగముగా కదులుతుంది.అంతటిది ఆవకాయ మహత్యము. మరి ఇంటీల్లపాదికి సం. పొడుగునా ఊరగాయకావాలంటే ఇల్లాళ్ళకు ఎంతశ్రమ ఎంతకష్టము.అంతటి కష్టాన్ని మనమాత్రుదేవతలు  ఇష్టంగా చేసి అహావొహో అని అంటున్న కుటుంబసభ్యుల మాటల్లో తమ కష్టాన్ని మరచిపొతారు.

అసలు ఆవకాయ పెట్టాలంటే క్రత్తికకార్తే రావలనేది మావాళ్ళ ఊవాచ.  తోటల వద్ద మంచికాయలు ఎంచి తేచ్చి వాటికి వున్న సొన,జిగురు అవీ కడీగి వాటిని ఆరబెట్టాలి.

మాగాయ అయితే ముందు మామిడికాయ చెక్కుతీయాలి.పీలర్ తో అలా తోలు వలచి ముక్కలు తరగటమే. ఇప్పుడంటే పీలర్ లు వచ్చాయికాని పాతకాలములో అయితే ఆల్చిప్పలను అరగదీసి పీలర్స్ గా వుపయోగించటమే. ఈ ఆల్చిప్పలను జాగ్రత్తగా దాచి వుంచేవారు.
ఈ తరిగిన ముక్కలు,టెంకేలు  అన్నింటిని కలిపి ఊప్పులో 3 రోజులు ఉరబెట్టాలి.ఆ తరువాత  ముక్కలను పలుచని నూలు వస్త్రములో మూటలాకట్టి దానిపై బరువు వుంచి క్రింద బేసిన్ లాంటిది ఎర్పాటు చేస్తే వూట క్రిందకు దిగుతుంది. అలా సేకరిచిన మొత్తము వూటను ఒక పాత కుండలో భద్రపరచాలి.ఈ ముక్కలను ఎండలొ పెట్టి ఎండపెట్టాలి. వాటీలొ వున్న తేమపొయి గలగల మనేవరకు ఎండాలి.ఇలా ఎండిన ముక్కలను మామిడి వొరుగులు  అంటారు. ఈ మామిడి వొరుగులకు కారము,నూనే కలిపి ఇంగువ తాలింపు పేడితే మాగాయ సిద్ధము.
ఈ మామిడి వొరుగులు కొన్ని తీసి భద్రపర్చితే మామిడికాయ రానికాలాల్లొ పప్పులాంటి కూరల్లొ, టేంకెలయితే మజ్జిగన్నానికి అధరవుగా ఉపయోగిస్తారు.
    ఇక ముఖ్యమయిది ఆవకాయ.దీనిలొ కష్టమయినపని కాయను, టేంకతొసహా అలా మధ్యకు కొయటము.టెంకపైవున్న పెచ్చు గట్టిగావుండి బాగా ఇబ్బంది పెట్టినా మన వాళ్ళప్రయత్నము ముందు అది ఎంత.ఇలా తరిగిన ముక్కలొని జీడి తీసి మనకు అనువుగా చిన్నముక్కలుగా కొట్టాలి.ఇలా సేకరించిన ముక్కలకు ఆవపిండి,కారం,ఊప్పు,నూనే కలిపితే 3 రొజులకు ఆవకాయ సిద్ధము.


చాలమంది ఆవకాయేకాక నువ్వుకాయ,పెసరావకాయ,మెంతికాయ,చిన్నముక్కల ఆవకాయ,ఉల్లి ఆవకాయల్లాంటీ రకాలు కూడ పెడతారు.

ఈ ఆవకాయేలే కాక ఇదే వేసవిలొ వడియాల్లాంటి ఉపచయాలు కూడ ఇప్పుడే అవకాశము.





3, మే 2012, గురువారం

దశావతారాలు ఏన్ని? వాటి దశావతారాలు అన్నపేరుకు కారణము!


మనిషి తన కర్మఫలాన్నిబట్టి జన్మపరంపర జరుగుతుంది.ఈ జన్మపరంపరలో ఎవరైన సమాజములో వున్న అశాంతిని రూపుమాపి శాంతి సమత్వాలు  స్థాపించాడో వారే అవతారపురుషులు.వారిని ఆధారముగావున్నవే అవతారకథలు.
ఈ అవతారకథల  వర్ణనచేసేది శ్రీమద్భాగవతము. మరి ఇందు అప్పటివరకు ప్రకటితమయిన మత్స్య,కూర్మ,వరాహ,నారసింహ,వామన,పరుశురామ,శ్రీరామ,శ్రీక్రిష్ణ అవతారాలు మొత్తము 8 రాబొయేది కల్క్యావతార ప్రస్తావనతో 9 అయినవి.  మరి 10 అవతారం?
 ఈ 10 అవతారముగా  వైష్ణవులు బలరాముని ,మిగతావారు బుద్ధుని అవతారమూర్తిగా పిలుస్తారు. దీనితో 10 కాబట్టి దశావతారాలు అని పరిగణన.

మరి ఇది సరి అయినదా? బలరామా అవతరాములో సమాజముకు ఎమి జరిగిందని అవతార పట్టాభిషేకము. అది వారి సాంప్రదాయము కాబట్టి మనము ఏమి చేయలేము.
మరి బుద్ధుడు అన్నిటిని వ్యతిరెకించినవాడు.మరి వీరికి ఏందుకు అవతార పట్టాభిషేకము.    
      అంటే పురాణకాలానికి దశావతారాలు అన్న గణనలేదు కాని తరువాత మన పూర్వికులు వారి పరిశీలనతో దశావతారాలని వాడుకలోకితెచ్చారు.
బహుశా ఈ రెండు కారణాలు ఆయి వుండవచ్చు.
అందు మొదటిది జీవ పరిణామ సిద్ధాంతాన్ని మనము ఇక్కడ అన్వయిస్తే అంటే సృష్టిలో జీవము ఏర్పడినది నీటిలో అనగా మత్స్య అవతారము. ఆతరువాత ఉభచరము ఇలా  అన్ని అవతారాలకు  సరిపొల్చారని భావించవచ్చు.

రెండొవది నా ఆలొచన ఇందు "ద" అనే అక్షరము దమనత్వాని ప్రతిఫలిస్తే, "శ" అనే అక్షరము శమించాటాన్ని,పరిమార్ఛటాన్ని సూచిస్తుంది.అనగా సమాజములొని రాక్షసత్వాన్ని రూపుమాపి సమత్వాన్ని స్థాపన .   
 కాబట్టి మన పూర్వికులు భాగవతములొ వున్న 9 కి బుద్ధుడిని జొడించి మొత్తము 10 కి సరి చేసి దశావతారాలు అన్నారు.

ఇది మన పూర్వుల ఆలొచనల సారము.    




*********************************************************************************
తాజా అప్ టూ డేట్

 మానవుడు సకల బాధలకు కారణమయిన కొరిక (అనగా సాధారణ మానవుడి లొని దమనత్వాని) . మరి ఇంతటి దానిని జయించి బుద్ధుడుగా సర్వులచే ప్రస్తుతింపపడ్డాడు.
ఇక కల్కి అవతారములొకి వస్తే "శంబల" నుంచి వస్తాడని ఐతిహ్యము. ఇది ఎక్కడది. శంబల అంటే కూడా ఇదే పాపాన్ని ఎవరు అడ్డుకుంటారో అక్కడివాని నివాసమని.అక్కడవున్నవారే కల్కి అవతారమని. మన పూర్వులు కొన్ని సూచన గా మనకు వదిలారు. కాని మనము వాటిని సరిగా ఆర్థము చేసుకొలేక రకరకాలా ప్రక్షిప్తాలు.రకరకాల కథలు.
ఓక్క సారి అలా పరిశీలించండి చాలు.    

2, మే 2012, బుధవారం

వేసవి కాల మహొత్సవాలు - పిల్లల సందళ్ళు



ఈ వేసవికాలం వచ్చిందంటే చాలు వాతావరణములొ మార్పులు.పగటి నిడివి పెరగటము.వ్యక్తుల చైతన్యశీలనత పెరగటము.అలా సమాజము మొత్తము సందడిగా మారుతుంది.
పిల్లలు మాత్రము అన్ని కాలాల కన్నా వేసవికాలం గురించి ఏక్కువ ఎదురుచూస్తారు.ఫైనల్ పరీక్షలయ్యి మీరు పాస్ అయ్యారని స్కూల్లొ మాష్టారు చెప్పగానే,అమ్మా నేను పాస్ అయ్యానో అంటు ఒకటే పరుగు ఇంటికి.దారిలో ఆనందము పట్టలేక ఒకరి మీద ఒకరు ఇంకుచల్లుకొవటము.ఇన్ని సంబరాలమధ్య వేసవి సెలవలపై ప్రణాళిక .సాధారణముగా మొదటిది ప్రముఖమయినది అమ్మమ్మగారీంటికి ప్రయాణము.పరీక్షలయ్యేరొజుకు తాతయ్యకాని,మామయ్యకాని సిద్ధము.అమ్మతో సహా పిల్లలందరు అమ్మమ్మదగ్గరకు ప్రయాణము.ఇక అమ్మమ్మ దగ్గర మనము యువరాజులము,యువరాణులము బొలేడు ముద్దు మురిపాలు.ఇల్లాళ్ళు మాత్రము అమ్మా!వాళ్ళను గారాబము చేయకే,నీ ముద్దుతో తరువాత నన్ను ఇబ్బంది పెడతారు అన్న మందలింపు.అమ్మమ్మమాత్రము , నాన్న అమ్మను ఇబ్బంది పేట్టకే అని వొట్టొట్టి అనునయంపు.అసలు మనము వచ్చేసరికి ఇక్కడ బొలెడురకాలు సిద్ధము.    కొద్దిగా పెద్దపిల్లలు ఆయితే చెట్ల నీడన ఆడుకొవటము.సీమతుమ్మకాయలు,ముంజలు తీసుకొనిరావాటానికీ  చెట్లవెంటా,తోపులవెంటా పొయి సాధించుకొచ్చి తిన్న వాటి రుచి.  
         మధ్యాహ్న ఎండత్రీవ్రతకు బయట తిరుగుట నిషిద్దము ఆయితేనేమి,ఇంట్లో ఆడుకునే ఆటలకు కొదవలేదు.పాముపటము,అష్టాచేమ్మా,దాయము,పులిమేక,చదరంగము,క్యారము లాంటివి అందరు ఆడతారు.అచ్చకాయలు,వామనగుంటలు లాంటివి ఆడపిల్లలకు ప్రత్యేకము.
ఇన్ని కార్యక్రమాల మధ్య సైకిల్ నేర్చుకునేకార్యక్రమము కూడా ఇప్పుడే ప్రారంభము.ఈ నేర్చుకునే కార్యక్రమములో మొకాలికి దెబ్బలు ఆయినా ఎలగొలా నేర్చుకొని కొత్తసైకిల్ మీద బడికి వెళ్ళలనే శపధాలు.వీలు ఆయితే సాయంకాలాలు షటిల్ ఆడటము.

అచ్చగా ఆటపాటలే కాక ప్రాథమిక,మధ్యమిక లాంటి హింది పరిక్షలకు తయారుకావటము.కొంతమంది టైపుకు వెళ్ళటము.
ఈ వేసవిలొనే గ్రామదేవతల ఉత్సవాలు,కళ్యాణాలు,రధొత్సవాలు వీటీల్లొ పాల్గొనటము ఒక సంబరము,ఒక ఉత్సాహము.ఈ ఉత్సవాల్లో  నాటకాలు,హరికథలు,బుర్రకథలు,16మి.మి.సినిమాలు ఇన్ని కళారూపాలు చూడటము ఒక అనుభూతి.   
మరి ఈనాటి పిల్లలకు అమ్మమ్మగారిల్లు ఒక్కటే మిగిలింది. మిగతావన్ని టీవి,కంప్యూటర్లే సర్వము.వీలుంటే అప్పుడప్పుడు ప్రకృతిని పరిచయముచేయండి.