5, ఆగస్టు 2020, బుధవారం

శ్రీరామ చంద్రుడు - పరిశీలన - సీరిస్ - 2

రాముడు పరిశీలన సీరిస్ - 2
************************************
రామునికి ఎన్నో విశిష్ట లక్షణాలు. వాటిల్లో
రాముని ఏక పత్నీ వ్రతం గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకూ గొప్పగా చెప్పుతారు....
మరి రాముడు ఏకపత్నీ వ్రతం అనేది ఎందుకంత విశేషత....ఈనాటి వారికి అదో సాధారణ సంగతిలా వుంటుంది... కాని విశేషమే...అసలు రాముడు మహిళల పట్ల గౌరవ మర్యాదలు చూపే అంత విశిష్టత నిర్ణయం రావటానికి గల కారణాలు విశ్లేషించటమే...ఈనాటి టాపిక్ లక్ష్యం.
రామావతార లక్ష్యమే రావణసంహరం.
రావణుని బలహీనత స్త్రీ వ్యామోహం.
రావణునికి గల రాక్షస ప్రవృత్తి లో ఇది ఓకటి మాత్రమే....
మరి ఇటువంటి రాక్షస ప్రవృత్తిని ఎదుర్కోవాలంటే....అటువంటి అవలక్షణము లేని వ్యక్తి కావాలి...మరి దశరధుడు అటువంటి వాడా కాదు అని మనకు తెలుసు....కాని విశిష్ట వంశం...దశరధుడు కూడా దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన పోరాడిన వాడు...ఇవి సానుకూలతలు...ఇంతమాత్రం చేత దశరధుని ఔరసపుత్రడుగా ముందుగానే జరుగలేదు...దశరధునికి ముగ్గురు భార్యలున్ననూ నిస్సంతుగా వుండటానికి కారణము దైవనిర్ణయం....మరి ఈ సమయంలో దశరధునికి పుత్రకామేష్ఠి యజ్ఞం గురించి తెలియచేసి అతనిచే ఈయాగ నిర్వాహణ. అసలు పుత్రకామేష్ఠి అంటే...పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.
మరి ఈ పుత్రకామేష్ఠి యజ్ఞం ఎవరి ఆర్ధ్వర్యంలో నిర్వహించాలి.....మరి ఇంతటి శ్రేష్టుడు ఎవరు.... ఋషులందరూ గొప్పవారే కాని ఓక్కొక్కరిది ఓక్కో కధ గాధ...మరి ఆసమయంలో వారందరికి ఓక్కరే స్ఫురణకు వస్తారు వారు ఋష్యశృంగుడు.
కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు. కనుకనే దైవనిర్ణయానుసారం..యాగ ఆర్ధ్వర్యం వీరికి ఓసగబడినది...అందునా వీరు యజుర్వేదంలో నిష్ణాతులు. యజుర్వేదంలో పుత్రకామేష్ఠి క్రతువు వున్నది.
ఇక్కడే మీరు సాధారణంగా చదువుకుంటూ వెళ్ళే సమయంలో ఓక క్షణం ఆగి ఆలోచన సాగించండి.....
మనం నిత్యపూజ సంకల్పానికే విశేషత వహించేటప్పుడు....రావణ సంహర కర్త జన్మించటానికి ఎన్ని విధాల జాగ్రత్తలు అవసరం...
మన నిత్యవంటలో దినుసులు సరి సమంగా...శుభ్రతగా...శుచిగా చేస్తాం...అలాగే పూజాదికాలు భక్తి శ్రద్ధలతో వివిధ పద్ధతులలో వివిధ రూపాల వస్తు వినియోగం చేసి సంతృప్తి చెందుతాం....మరి రావణసంహరమే లక్ష్యం గా అంశ ఉద్భవించాలంటే....స్త్రీ బలహీనత లేని యజ్ఞ ఆర్ధ్వర్యుని నిర్వాహణలో యజ్ఞ ఫలంగా అంతటి విశిష్టత గల అంశ  పుట్టుట మాత్రమే
సాధ్యం....అందుకే దేవతలు ఏరి కోరి మరి...ఋష్యశృంగుని....ఎన్నుకున్నది....
వశిష్ఠుల వారు వున్ననూ వారి కన్ననూ యజ్ఞ నిర్వాహణకి ఋష్యశృంగునికి అప్ప చెప్పినది....
మరి ఈ యాగ నిర్వాహణలో చివరగా అగ్ని ఇచ్చిన యాగ ఫలిత పాయస ప్రభావంచే...శ్రీరామ జననం.
మీకు ఇంత వివరించటానికి కారణం...ఓక కార్యసిద్ధి కి అత్యుత్తమ సంకల్పం కలిగి అటువంటి విశిష్టత గల వ్యక్తులచే నిర్వహించ బడితే అంతటి మంచి ఫలితం లభిస్తుంది...
అందు వల్లనే జన్మతః రామునికి ఈ లక్షణం వున్నది...కాని ఆనాటి సామాజిక రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణాలు ప్రస్తావిస్తాను.....
రాముడు క్షత్రీయుడు... అందునా రాజ్యాధికారం సిద్ధించబోయేవాడు...మరి మిగతా వారి వలనే బహు భార్యత్వాన్ని ఎందుకు ఎంచుకోలేదు...రాముడు అన్నీంటికి తన పూర్వీకుల మార్గం పాటించినా ఇందులో మాత్రం తన ప్రత్యేకత నిలుపుకోవటానికి ప్రధమ కారణం...తన తండ్రి బహు భార్యత్వానికి ప్రధమంగా ఇబ్బంది పడినది...రాముని తల్లి కౌసల్య....ఈమే పట్టపు రాణి అయిననూ భర్త ఆదరణ లేక వ్యధతో కూడిన జీవితం...మరి తల్లి తాలూకు వేదన చూసిన రాముడు అటువంటి పొరపాటు చేయగలడా....
అలాగే రాముని అరణ్యవాసం కారణం కూడా...దశరధుని వ్యామోహమే....
రామునికి ధర్మ  , కర్మ ఆచారణ పట్ల ఎంతో మక్కువ.... సీతా స్వయంవరం ముందు జరిగిన అహల్య శాపవిమోచన ఘట్టం లో తనవలన ఓక స్త్రీ కి శాపవిమోచన కి సంతోషించిననూ...అది అతని మనస్సులో ఓక ముద్ర ఏర్పరిచినది....గౌతముని వంటి తపస్వికి ఇల్లాలు అయిననూ పరపురుష వ్యామోహంచే
ఆమే ధర్మ , కర్మ భ్రష్టత్వం పొంది..ఆ విధంగా శిలగా వుండటం రాముని ఆలోచింప చేసినది...
అందుకే పురుషునకో నియమం , స్త్రీ కో నియమం వుండుటను అతను నిరసించి....ఏకపత్నీ వ్రతం అనే కొత్త సూత్రం తనదిగా చేసుకున్నాడు....
ఇటువంటి నూతన విధానంలో కాబోవు రాజు మక్కువ చూపుతున్నారు అని ప్రజలలో తెలిస్తే వారికి రాముని పట్ల గౌరవం పెరుగుతుంది.
రాజుకి రాజ్యం లోని ప్రజలకి ఉభయుల మధ్య ఓక విధమైన సంఘటితం ఏర్పడుతుంది... ఆ రాజ్యం బలపడుతుంది.
మీరు ఈ వివరణ సాగిన విధం గమనించండి...
రావణుని రాక్షసత్వంచే విసిగి వేసారిన దైవ , ఋషి వర్గాల అభిప్రాయం అణుగుణంగా నారాయణుడు జన్మ తీసుకోవాలి..అందుకూ అతని వరంలోని వున్న మానవ , వానరులు వలన నాకు మృత్యువు రాకూడదు అన్నది విస్మరింపో లేక అహంకార పూరితమో అయినా దేవ , ఋషి ప్రణాళిక లో అదే మూలం అయి...నారాయణుడు మానవజన్మ తీసుకోవటానికి ప్రధాన కారణం అయినది. రావణుని పర స్త్రీ వ్యామోహం అనే దుర్బలత్వానికి విరుగుడు ఏకపత్నీ వ్రతం అనే బలమైన ఆయుధం...ధర్మ , కర్మ ఆచారణ కు బలంగా మారినాయి...ఇక తదుపరి వివరణలు కుటుంబ , రాజకీయ ,సామాజిక వివరణలు...
ఇలా రామాయణాన్ని, రాముని మనం ఇష్టపడుతూ...ఆ జగదభిరాముని లీలావిలాసాన్ని ఓక్కసారి ఆయన పాదం పట్టి అడిగితే తన తత్వాన్ని ఓకింత మన బుద్ధి మేర కొంత కరుణిస్తాడు.....సర్వం శ్రీరామ మయం...
సర్వులకు సర్వం శ్రీరామ జయం......
మిత్రులు, విమర్శలు సదా స్వాగతం.....
మీ యొక్క సందేహలకి సమాధానం...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ.
94401 72262.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.