4, ఆగస్టు 2020, మంగళవారం

సత్యనారాయణ వ్రతం విశిష్టత అంతరార్ధం

సత్యనారాయణ వ్రతం విశిష్టత.
కార్తీక మాసంలో ను , మరి 
విశిష్ట సమయంలో సర్వ బాహుళ్యం వారి నివాసంలోను , అన్నవరం లోను , వనభోజనం సమయంలో వ్రతం చేస్తారు కాని వీరిలో ఒక్క శాతం వారికి కూడా దీని విశిష్టత పై అవగాహన లేదు. మరి నేను నా కోణంలో తెలియచెప్పే ప్రయత్నం మాత్రమే అని గ్రహించ ప్రార్ధన.
మనకున్న అనేకానేక పూజా విధానములలో సత్యనారాయణ వ్రతం ఎంతో విశిష్టత కలది.
సహజంగా అందరు వివాహంతో గృహస్థులు కాగానే చేయి మొదటి దైవ కార్యం. చాలా మంది ఆసక్తిగా చేసినా తదనంతరం పరిణామం లో కొంత ఆసక్తి తగ్గుతుంది దానితో యాంత్రికత కలుగుతుంది. కాని వ్రతం శ్రద్ధగా చేయివారికి కొంగుబంగారంగా  స్వామి వారిని కరుణిస్తారు అనటంలో సందేహం వలదు.
ఈ వ్రతం స్మార్త విధానంలో గణపతిపూజతోను వైష్ణవవిధానంలో విష్వక్సేన పూజతో ప్రారంభం.
అ తరువాత వ్రత కధ ప్రారంభం.
ఈ వ్రత కధ ఐదు అధ్యాయాలు కలదిగా బహుళ ప్రచారంలో వున్నను ఇది 9 అధ్యాయాల వ్రత కధ. ఇందు మొదటి ఐదు కధలు పూజ సమయంలోను. తదుపరి నాలుగు కధలు వ్రతం ముగిసిన తరువాత రాత్రి సమయంలో భగవత్సేవ కైంకర్యం సమయంలో వినాలి అని నిర్దేశించారు.    మరి ఏ సమయంలో ఏ పెద్దలు ఈ క్రతువును ఐదు కధలు కలదిగా మార్చే సంకల్పం చేసి కల్పోక్తపూజవిధానంగా మార్పు చేసి సుజనరంజకము సుభోదకముగా చేశారనుటలో సందేహంలేదు.
ఈ విధానం మొత్తం రెండు భాగాలుగా  విభజన. ప్రధమ భాగం దేవత ఆహ్వానం , వ్రత కధ రెండోవ భాగం.
ఈనాడు గృహస్థులు యాంత్రిక తో చేయిచున్నారు కాని వారికి అవగాహన వున్న శ్రద్ధగా చేయగలరు అనుటలో సందేహం లేదు. దేవతా ఆహ్వానం ను మండపారాధన అంటారు. సాధారణంగా మనం గృహమునకు అతిధి వస్తే  ఆసనం,నీరు లాంటి మర్యాదపూర్వక చర్యలు చేస్తాం కాని నేడు మనం దేవాది దేవుడు అగు సత్యనారాయణ స్వామిని, మన వ్రత ప్రదేశం నకు స్వామిని అర్చారూపకంగా ఆహ్వానం పలికి  కలశరూపంలో స్థాపన చేయిటయే మండపారాధన.
ఈ మండపారాధన కు, ఓ క్రమ పద్ధతి వున్నది.
వ్రతం ప్రదేశం నందు చక్కగా రంగవల్లులు తో తీర్చి ఆపై అరటిఆకు గాని , వెడల్పయిన పీటగాని వేసి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై ప్రాణం జీవనాధారం అగు ధాన్యం (బియ్యం) ను పరిచి
ఆపై గణేశాది పంచపాలకులు (గణపతి , బ్రహ్మ, విష్ణు, రుద్రుడు,గౌరి)  తదనంతరం నవగ్రహాలు వాటి తాలూకు అధి దేవతా ప్రత్యధిదేవతా సహితంగా వీరిని   క్రమంలో సమంత్రకంగా ఆహ్వానం చెపుతూ వారి వారి గ్రహ యొక్క శక్తి మన దేహంపై మన నిత్య జీవితంలో ఏవిభాగం పై వుంటుందో తెలుపుతూ ఆహ్వానిస్తారు.

(సూర్యుడు - ఆత్మ - అగ్ని - రుద్రుడు
చంద్రుడు - మనస్సు - ఆపః - గౌరి
కుజుడు - రోగ,  - భూమి - క్షేత్రపాలకం.
బుధుడు - బుద్ధి - విష్ణుం - నారాయణం
గురువు - సంతానం - బ్రహ్మణం - ఇంద్రుడు
శుక్రుడు - కళత్ర - ఇంద్రాణి - ఇంద్రమరుత్తులు
శని - కర్మ  - యమం - ప్రజాపతి
రాహువు - చక్షువు - గామం - సర్వాంగ
కేతువు - మోక్ష - చిత్రగుప్తుడు -బ్రహ్మణం)
తదనంతరం అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, క్షేత్ర పాలకుడు,భూమి,ఆకాశం ఇలా సమస్త దేవతలను వారు ,వారి కుటుంబ ,పరివారం,వాహనం,ఆయుధసమేతంగా విచ్చేయమని సమంత్రకంగా ఆృహ్వానిస్తూ వారి వారి స్థానాలకు వారిని ఉపస్థితులను కావింప చేయాలి.
మరి వీరితో పాటు గృహస్థులు యెక్క జన్మనక్షత్రం అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా ఆహ్వానం. దీని వలన గృహస్థులు కు గోచార రీత్యా క్షేమం.
మరి వీరందరి ఆహ్వానంనకు ప్రతి ఒక్కరిని
ఓ తమలపాకు పై వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరం, అక్షింతలు, రూపాయికాసు సహితంగా ఆహ్వానం చేస్తాం. ఇందు వక్క దేవతాంశ గాను , పసుపు కొమ్ము దేవతాంశ స్త్రీ రూపం గాను ఖర్జూరం నివేదనగాను , అక్షింతలు వారికి అర్చన గాను , రూపాయి కాసు హిరణ్యరూపకంగాను (పాపం మన వాళ్ళు ఈ రూపాయి కాసు అయ్యవారికి వెళుతుందని లోభిస్తారు ) ఇది లోపం లేకుండా వుండాలి.
‌కారణం విశ్వాంతరాళలలోనుండి వచ్చే దేవతలకు వారి పరివారాలకు ఆహ్వానం పలుకుటలో మనకు తెలియని లోపాలను నివృత్తి కై మరియి వారి నిమిత్తం దాన, దక్షిణకై...
ఇలా ఇవి అన్ని కలిపి సుమారు 50 పైగా అవుతాయి. ఇలా వీరందరి మధ్య స్వామి ని కలశరూపకంగా సకల నది జలాలు సకల దిజ్మండలాల మధ్య సకల పరివారం సహితంగా శ్రీ సత్యనారాయణ స్వామి ని ప్రతిష్ట చేస్తాం.
తదనంతరం స్వామి పురుష సూక్త పూజ , ఆ తదుపరి స్వామివారి రూపును పంచామృత అభిషేకం మన్యుసూక్తసహితంగా చేసి తదనంతరం స్వామి వారి అష్టోత్తర, సహస్రనామాలు తో స్తుతించడం తదనంతరం లక్ష్మీ దేవిని అష్టోత్తర పూజలతో వ్రతం నందు మొదటి భాగం పూర్తి.
తదుపరి వ్రతం యొక్క ఉత్తర భాగం కధ భాగంలో అడుగు పెడతాం.
మనం ఇప్పటి వరకూ వ్రత విధానం తెలుసుకున్నాం. మరి స్వామి వారు ఎవరు మన వ్రతం యెుక్క లక్ష్యం,ప్రసాదం మహిమ ఏమిటి చేస్తే వచ్చే ఫలితం ,చేయగలమని అనుకోని చేయకపోవటులో ఇబ్బంది తెలుసుకోవటమే కధ రూపకంగా.
* ప్రధమ అధ్యాయం*
వ్రతం ప్రధమ కధ నందు.
నైమిశారణ్యం నందు సూతమహాముని శౌనకాది మహర్షులు కు మానవులు కష్టనష్టాలు తీర్చుటకు తరుణోపాయం అన్న వ్యాఖ్యలు తో కధ ప్రారంభం .

ఈ సకల చరాచర విశ్వం నందు జీవంతో కలిగిన గోళం ఒక్క భూగోళం మాత్రం...ఇందు గల అనేకానేక జీవావరుణంలో మానవుడు మాత్రమే అన్య ప్రాణులకు భిన్న ప్రకృతి కలవాడై వున్నాడు. బుద్ధి మనస్సు వాక్కు కలిగిన వాడుగా వున్నాడు. మిగిలిన ప్రాణులు ఇవి లభించక తమ మనుగడకు ప్రకృతిపై ఆధారపడి ప్రకృతిలో ఒకటిగా మనుగడ సాగిస్తున్నాయి కాని మానవుడు తన భిన్న ప్రకృతి చే తనకు గల విశిష్టత ను వినియోగం పరిచి ప్రకృతి ని తన ఆధిపత్యాన్ని కి తెచ్చుకుని పంచ భూతాలయిన వాటిని తనకు అనుకూలమైన వినియోగం మైన విధముగా చేశారు.అయనను అతని ఆశ తీరిక ఇంకను ఇంకనూ అన్న స్వభావం వలన అతని జీవన పరిణామం క్రమం తప్పి అనేక కష్టనష్టాలను చవి చూస్తున్నాడు . దీని వలన మానసిక సంతులనం కోల్పోయి దిగులుగా ఇబ్బంది గా వున్నాడు...
ఈ సమయంలో నారదమహర్షి భూలోకం సంచారం చేయిచూ పై విషయాలను వైకుంఠ వాసుడైన విష్ణువుతో ప్రస్తావన...
ఆసమయంలో స్వామి వారి వర్ణన ....
స్వామి వారు తన అంశం రూపం అయిన సత్యనారాయణ వ్రతం చేసిన మానవుల కష్టాలు దూరం అవుతాయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని అంటారు.
ఇక్కడే మన పూర్వీకులు మహర్షులు చమత్కారం మనకు తెలియజేస్తుంది...
సాధారణ మానవుడు భోగలాలసతో జ్ఞాన శూన్యతతో భగవంతునికై కృషి సల్పుటలో అలసత్వం తో వుంటారు. మరి వారి మోక్ష ప్రాప్తి కి కొన్ని రకాల వ్రతం ,నోములు, పారాయణలు ప్రవేశం ...వీటి అన్నింటిలోను ఉత్తమమం నామధ్యానం....
అసలు నారాయణుడు అంటే ఎవరు?
మనం నారాయణుడు విష్ణ్వంశగా భావిస్తాం.
ఈయన పని లోక పాలన...
నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్ అన్ని భాగవత వాక్యం అనుసరించి
ఆయన మహ పురుషుడు...మరి ఆయన నామం రూప ధ్యానమే సత్యనారాయణ వ్రతం అన్నది రహస్యం.
సత్ + య + నారాయణ అన్న పద సముచ్ఛయం సత్యనారాయణ గా వాడుక.
ఇందు సత్ అన్ని పదానికి అర్ధం ఎల్లప్పుడు , సతతం , అన్నివేళలా అని......
యం అన్నది మన దేహం నందు గల కుండలిని చక్రంలోని అనాహత చక్ర బీజాక్షరం.
ఈ అనాహత చక్రం దేహం నందు
హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.
అనగా నారాయణ అన్న నామమును హృదయమందు ప్రతిష్టించుకోవాలి.
ఇంకను వ్రతం విధానం తెలుపుట మొదటి అధ్యాయం నందు కలదు. ఏ ఏ కాలాలు చేయాలి, ఏ విధంగా చేయాలి కావలసిన వస్తువులు అన్ని తెలుపుతుంది .

*రెండవ అధ్యాయం*
ఈ అధ్యాయం నందు
కాశీ పట్టణం నందు శతానందుడు అను బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వాడయినను ఉపాధి లేక అనేక కష్టనష్టాలను చవి చూసి భగవత్ కృప వలన ఈ వ్రతం చేయిట మరియి ఈయన ను చూసిన కాలకష్ఠుడు అనే కట్టేలు కొట్టే వాడు అతని శక్త్యానుసారం చేసి తరించుట.
చూడండి శతానందుడు అన్ని రకాల ఆనందాలు అన్నది నామధేయం లో , విద్య కలవాడు కాని ఉపాధి లేకపోవటమే పెద్ద కష్టం...
కాలకష్ఠుడు అనేది దురదృష్టవంతుడు అనే పదానికి పర్యాయ పదం.
ఇటువంటి పరిస్థితుల్లో వున్నవారు స్వామి వారి వ్రతం చేసిన వారి కష్టం నివారణ జరుగుతుంది అని తెలుపుట రెండవ అధ్యాయం అంతరార్ధం.
*మూడవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు ఉల్కాముఖుడు అను రాజుగారి రాజ్యం నందు ఒక వైశ్యుడు ఈ వ్రతం కధ తెలుసుకుని సంతానలేమి చే బాధ పడుతున్న అతను భగవంతుని కృపచే సంతానం లభించటం అయినను వ్రతం చేయక వాయిదాలు వేయటం అలా తన కుమార్తె వివాహం సమయంలో కూడా వాయిదా వేసి తన సంపాదన నిమిత్తం చంద్రకేతు మహరాజు
పరిపాలనలోని రత్నసానుపురం వెళ్ళుట...ఇలా దైవ ధిక్కారం నకు పాల్పడుటతో అతని కుటుంబం ,అతను అనేక కష్టాలు గురి అవటం...దీనికి తరుణోపాయం గా వ్రతం చేసిన
కష్టాలు తీరును అన్న బుద్ధి కలిగించును...
ఈ క్రమంలో వ్రతం నిర్వాహణా లోపం శ్రద్ధాలోపం భక్తి లోపం వలన కలుగు ఇబ్బందులు తెలుపుట ఈ అధ్యాయం యెక్క ఉద్దేశ్యం.
*నాలుగవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు పై అధ్యాయం పాత్రలే వారి తప్పులు మన్నించి స్వామి వారు తరుణోపాయం చూపుట.
భగవంతుడు భక్త సులభుడు మీకు దొరుకు సహాయం ఆకాశవాణి గా అన్యాపదేశంగా అజ్ఞాతం గా జరుగగలదని తెలుపట ఈ అధ్యాయం యెక్క లక్ష్యం.
*ఐదవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు తుంగధ్వజ మహరాజు అడవికి వేటకు వెళ్ళి ఆ సమయంలో అడవిలోని గొల్లవారు స్వామి వారి ప్రసాదం ఇవ్వగా వారు అనాచారులు అని ఆక్షేపణ చేస్తూ ప్రసాద్ స్వీకరణ చేయక నిర్లక్ష్యం వహించిన దైవ ఆగ్రహంనకు గురి అయి రాజ్యం ,సంతానం పోవటం అన్న కష్టం నాకు గురి అయి దైవజ్ఞల వలన ప్రసాద్ స్వీకరణ నిర్లక్ష్యం అని తెలుసుకుని తప్పు సరిదిద్దుకునటచే స్వామి వారిని కరుణించుట.
ఈ అధ్యాయం లో ధర్మ సూక్ష్మం తుంగధ్వజుడు అన్న పేరుతో తెలిపారు. తుంగ ఎంతటీ నిస్సారవంతమైన భూమిలోను కూడా పెరుగుతుంది అంతేకాక తను పెరిగిన భూమి నిరుపయోగం అవుతుంది.
అలాగే ధ్వజం అనగా జెండా.
మనిషిలో అహంకారంతో, అధికార , ధనమదంతో
దైవదూషణ ధిక్కారం చేస్తే తగిన ఫలితం అనుభవిస్తారని తెలుపుట, భగవంతుని సన్నిధిలో రాజు పేద  అన్నది లేదు కావలసినది శ్రద్ధ, భక్తి మాత్రమే.. అలాగే స్వామి వారి వ్రత ప్రసాదం నందు నిర్లక్ష్యం కూడదు అని తెలుపుట.
శ్రీరామ జయం.
****************************************
మిత్రులు నమస్కారం.
ఇందు తప్పు ఒప్పు లు మన్నించి మీ సమాధానం పంపగలరు.
Send your feedback to
Alapati Ramesh Babu
9440172262.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.